14 corona virus confirmed | ఢిల్లీలో 14మందికి సోకిన కరోనా వైరస్

ఢిల్లీలో 14మందికి కరోనా సోకినట్లు ఎయిమ్స్ వైద్యులు నిర్ధారించారు.  ఇటలీ నుంచి భారత్ కు వచ్చిన 21మందిలో కరోనా 14మందికి కరోనా సోకినట్లు ఎయిమ్స్ వైద్యులు గుర్తించారు. వారిని చావ్లాలోని ఇండియన్ – టిబిటెన్ బోర్డర్ పోలీస్ ఐసోలేషన్ వార్డ్ లో చికిత్స చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు.

భారత్ లో ఇప్పటికి నమోదైన కరోనా వైరస్ కేసులు 28

భారత్ లో కరోనా వైరస్ కేసులు ఇప్పటివరకు 28 ధృవీకరించబడినట్లు  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ చెప్పారు.

ఎయిర్ పోర్ట్ లలో 5,89,000  మందికి స్క్రీనింగ్

కరోనా గురించి మీడియా సమావేశంలో డాక్టర్ హర్ష వర్ధన్ మాట్లాడుతూ ఇండియాకి వచ్చే స్వదేశీయులు, విదేశీయులందరూ మెడికల్ స్క్రీనింగ్ చేయించు కోవాలని సూచించారు. మంగళవారం నాటికి స్క్రీనింగ్ చివరిదశకు వచ్చిందన్నారు. పలు ఎయిర్ పోర్ట్ లో నిర్దేశించిన 12 దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఉన్నట్లు చెప్పారు. విమానాశ్రయాల్లో ఇప్పటి వరకు   5,89,000 మంది విమానాశ్రయాలలో పరీక్షించబడ్డారని, 10 లక్షలకు పైగా నేపాల్ సరిహద్దుల్లో  నేపాల్ లో 27 వేల మందికి చెక్ చేసినట్లు చెప్పారు.

ప్రజలు బయపడొద్దు

కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.  ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రాథమిక పరిశుభ్రతను పాటించాలన్న ఆయన.. ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నవారు వైద్యుల్ని సంప్రదించాలన్నారు.

see this : కరోనా వైరస్ పట్ల పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

see this : సమ్మర్ సీజన్ లో పిల్లలు హెల్దీగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest