వాత, పిత్త, కఫ | బరువు తగ్గాలంటే

ఆయుర్వేదం 5,000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉద్భవించిన ఒక ఆరోగ్య వ్యవస్థ. ఇది ప్రపంచంలోనే మన ఆరోగ్యాన్ని కాపాడే పురాతనమైన సంరక్షణ సాంప్రదాయాల్లో ఒకటి. వేల సంవత్సరాల గడుస్తున్న, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు దీనిని నేడు పాటిస్తున్నారు.

ఆయుర్వేద వైద్యం వల్ల బ్రెయిన్ షార్ప్ గా తయారవుతుంది.  ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యకరమైన జీవనాన్ని గడిపేందుకు ఉపయోగపడుతుంది.

ఆయుర్వేద వైద్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన చరక మహర్షి, శుశ్రుత మహర్షులు చెప్పిన వివరాల ఆధారంగా  ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి ఈ  పంచభూతాలు మానవ శరీరానికి కనెక్టై ఉంటాయని చెబుతున్నారు. పంచభూతాల ఆధారంగా ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా ఉంటుందని, అందువల్ల శరీరంలో హెచ్చు  తగ్గుతుంటాయని, ఆ హెచ్చు తగ్గుల వల్లే కప్ప, పిత , వాత దోషాలు ఏర్పడతాయని, ఆ సమస్యలతో బాధపడే వారు బరువు తగ్గాలనుకుంటే కొన్ని ఆహార పదార్ధాలు పాటించాలని తద్వారా బరువు తగ్గి ఆరోగ్యంగా ఉంటారని చరిత్ర చెబుతోంది.

వాత తత్వం శరీరం కలిగిన వారికి  : కదిలే శక్తిని స్థలం నుంచి గాలి నుంచి వస్తుంది.

పిత్త  శరీరం కలిగిన వారికి  :  జీర్ణ క్రియ అగ్ని నుంచి , నీటి ద్వారా జరుగుతుంది.

కఫ తత్వం శరీరం కలిగిన వారికి  :  మానవుడి శరీర నిర్మాణం , శక్తి భూమి నుంచి నీటి నుంచి లభిస్తాయి

అయితే ఈ లక్షణాలున్నా వారు బరువు తగ్గాలంటే ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలుసుకుందాం.

వాత లక్షణాలు కలిగిన ఉన్నవారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలంటే 

♥  వాత లక్షణాలున్న వారు కనీసం భోజనాన్ని రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు తినాలి. తినాలి కదా అనని ఎంత అంటే అంత తినకూడదు. మితంగా తినాలి. కొద్ది కొద్దిగా తినాలి. ఆ తినే ఆహారంలో వండిన కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.

♥  వంకాయలు, మిరియాలు, టమోటాలు మానుకోండి.

♥  జ్యూస్ తియ్యని పండ్లు, కార్బో హైడ్రేడ్స్ ఎక్కువగా ఫ్రూట్స్ తో పాటు యాపిల్ పండ్లను తీసుకోవాలి. యాపిల్  రక్త స్రావాన్ని అరికడుతుంది.

♥  చిక్కుళ్ళు పరిమితం చేయండి. అనేక రకాల గింజలు, విత్తనాలను తినండి. ఆ గింజల్ని మెత్తగా నూరి పాలల్లో కలుపుకొని తాగితే ఇంకా మంచిది.

♥  షుగర్ తో బాధపడేవారు డ్రింకింగ్‌‌, స్మోకింగ్ పూర్తిగా మానేయాలి.

♥ చల్లని ఆహారాన్ని అ వాయిడ్ చేయాలి.

పిత్త లక్షణాలు కలిగిన ఉన్నవారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలంటే 

♥  పచ్చి కూరగాయలు, సలాడ్లు తినాలి. ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా తినేలా చూసుకోవాలి

♥ మాంసం, సీ ఫుడ్ తీసుకోవాలి. వేసవిలో ఎక్కువగా తినేలా చూసుకోవాలి

♥ కారంగా ఉండే ఆహార పదార్ధాలు , కాఫీ, ఆల్కహాల్ మానుకోండి

♥  కాయలు, ధాన్యాలను మితంగా తినాలి.

♥ పాలతో తయారు చేసిన ఉత్పత్తులను తినాలి.

కఫ లక్షణాలు కలిగి ఉన్నవారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలంటే

♥  కఫ లక్షణాలు కలిగిన వారు ఆహారాన్ని మితంగా తినాలి.

♥  పాల మరియు కొవ్వు అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి.

♥ ప్రోటీన్‌ను పరిమితం చేయాలి.

♥  పండించిన  ఆకుకూరలు మరియు కూరగాయలు తినాలి

♥   రక్త స్రావాన్ని అరికట్టే యాపిల్స్,కాన్ బెర్రా , మామిడి, పీచు వంటి పదార్ధాలను తినాలి.

♥ మాంసాన్ని, పచ్చి కాయలు, విత్తనాలను మితంగా తినాలి

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest