Ashwagandha | అశ్వ గంధంతో కరోనా కు చెక్ పెట్టొచ్చు..నిర్ధారించిన సైంటిస్ట్ లు

Ashwagandha..! ఆయుర్వేద మందుల్లో కింగ్ గా పేరు గడించిన అశ్వ గంధ కరోనా వైరస్ ను నివారించేందుకు ఉపయోగపడుతున్నట్లు సైంటిస్ట్ ల పరిశోధనల్లో తేలింది.

కరోనా ను నివారించేందుకు  హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సిక్యూ) కు అశ్వ గంధ ప్రత్యామ్నాయమా అన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం పరిశోధనల్ని ప్రారంభించింది.

పరిశోధనల్లో భాగంగా కరోనా నివారణకు అశ్వ గంధం ఉపయోగపడుతున్నట్లు తేలింది. ఐఐటీ – ఢిల్లీతో పాటు జపాన్ కు చెందిన  నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ ఇండస్ట్రియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో పరిశోధనలు జరుగుతున్నాయి.

ఈ పరిశోధనల్లో    అశ్వ గంధ మరియు పుప్పొడి నుండి వచ్చిన సహజ సమ్మేళనాలు  కరోనా వైరస్ నివారించే డ్రగ్ లా ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధనా బృందం తేల్చింది. వైరస్ వ్యాప్తికి మధ్యవర్తిత్వం వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రొటేజ్ గా పిలువబడే ప్రోటీన్ల ను వేరుచేసేందుకు సైంటిస్ట్ లు కరోనా ఎంజైమ్ లను టార్గెట్ చేస్తున్నారు. ఈ అశ్వ గంధం తక్కువ ప్రమాద స్థాయిలో ఉన్న ప్రొటేజ్ ను వేరే చేసేలా పరిశోధనలు జరుగుతున్నాయని ఐఐటీ ఢిల్లీ బయో టెక్నాలజీ హెచ్ ఓడీ  డి సుందర్ అన్నారు.

పరిశోధనలు కరోనా ను నివారించడంతో పాటు స్క్రీనింగ్ టెస్ట్ లకు, సమయం, డబ్బు ఆదా అవుతుందని అన్నారు. అయితే క్లినికల్ ట్రయల్స్ లో అశ్వ గంధం ఎంత మేరకు ఉపయోగపడుతుందో చూడాలన్నారు.  డ్రగ్స్ వినియోగంలోకి తేవాలంటే కొంత సమయం పడుతుందని, ఒకవేళ ట్రయల్స్ విజయవంతం అయితే కరోనాను నివారించడం, పూర్తి స్థాయిలో ట్రీట్ మెంట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest