ఆయుర్వేదం : మీ జుట్టు పొడవు పెరగాలంటే..?

జుట్టు ఊడిపోయేందుకు ప్రధాన కారణాలు 

యాంత్రిక జీవనంలో ప్రతీఒక్కరిని ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఎయిర్ ఫాల్. పూర్వం వయసు మళ్లిన తరువాతే జుట్టు రాలుతుండేంది. కానీ ఇప్పుడు 20 ఏళ్లకే జుట్టు ఊడిపోతుంది. సాధారణంగా మనం పుట్టుకతో వచ్చే జుట్టు నాలుగున్నరేళ్ల తరువాత కుదుళ్లతో సహారాలిపోతుంది. అలా రాలిన జుట్టు 6నెలల్లో మళ్లీ పుట్టుకొస్తాయి. జుట్టు ఊడిపోవడానికి రకరకాల కారణాలున్నాయని వైద్యలు చెబుతున్నారు. ముఖ్యంగా వారసత్వ లక్షణాలు, వాతావరణ కాలుష్యం, విటమిన్ లోపం, నిద్రలేమి, విపరీతమైన స్ట్రెస్ వల్ల వల్ల జుట్టు ఊడిపోతుంది. ఈ సమస్యను అరికట్టేందుకు అనేక రకాల చిట్కాలు ఉన్నాయి. వాటిలో ఆయుర్వేద చిట్కాల్ని పాటించి జుట్టు రాలిపోవడాన్ని, జుట్టు పెరిగేట్లు చేసుకోవచ్చు.

వెంట్రుకలు ఎలా ఏర్పడుతాయి..?

మన చర్మంలో మూడు రకాలైన ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్ పొరలు ఉంటాయి. ఆ పొరలే తలపై జుట్టు మొలిచేందుకు సాయం చేస్తాయి.

1.హైపోడెర్మిస్ – రెండు పొరల కింద ఉండే ఈ పొరలో కొవ్వు, అనుసంధాన కణజాలం ఉంటుంది. ఇవి చర్మానికి అండగా ఉంటూ, బలాన్ని ఇస్తుంది.

2. డెర్మిస్ – డెర్మిస్ పొరలో స్వేద గ్రంధులు, రక్తనాళాలు, కుదుళ్లు ఉంటాయి.

3. ఎపిడెర్మిస్ – పై రెండు పొరలకు అండగా ఈ ఎపిడెర్మిస్ పొర ఉంటుంది. ఈ పొరలో ఉండే స్వేద గ్రంధుల నాళాలు, వెంట్రుకలు ఎపిడెర్మిస్ పొరను చీల్చుకొని చర్మం పైకి వస్తాయి.

అలా ఈ మూడు పొరల సాయంతో చర్మంపైన మొలిచిన వెంట్రుకల కుదుళ్లలో ఫాలికల్ గ్రంధి ఉంటుంది. ఈ ఫాలికల్ గ్రంధిలో ఉండే పిగ్మెంట్ కణాలు ..వెంట్రుకల్లో ఉన్న సన్నని ట్యూబ్ లో ఈ కణాలు వ్యాప్తి చెందేలా చేస్తుంది. ఈ కణాలు నల్లగా ఉండడం వల్ల మనజుట్టు నల్లగా ఉంటుంది. ఫాలికల్ కణాలు రంగు మారే కొద్ది మన జుట్టురంగు మారిపోతుంది.

విటమిన్ హెచ్

మనం ఆరోగ్యంగా ఉన్న జుట్టు ఊడిపోతుందంటే దానికి కారణం విటమిన్ బీ7 లోపమనే చెప్పుకోవాలి. బీ7 ( బయోటిన్ ) విటమిన్ వల్ల జుట్టు, గోళ్లు పెరుగుతాయి. ఈ విటమిన్ సరైన మోతాదులో అందితే వెంట్రుకలు దృఢంగా, పొడవుగా పెరుగుతాయి.

ఆయుర్వేద పద్దతిలో జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే పాటించాల్సిన చిట్కాలు

జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే కావాల్సిన పదార్ధాలు

1. ముల్లంగి – ప్రకృతి ప్రసాధించిన గొప్ప ఆయుర్వేద మందు అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ముల్లంగి. ముల్లంగిలో సీ విటమిన్, ఫోలిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. దీంతో క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. అంతేకాదు పైల్స్, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

2 సాల్ట్

3. మిరియాల పొడి

4.తేనే

తయారు చేసే విధానం

పైన చెప్పిన విధంగా ముల్లంగిని ఉల్లిపాయ ముక్కల్ని తరిగినట్లు తరగాలి. తరిగిన తరువాత ఆ ముక్కల్లో మూడు చిటికెడుల సాల్ట్, మూడు చిటికెడుల మిరియాల పొడిని కలపాలి. అలా కలిపిన ముల్లంగి ముక్కల్ని రోజుకు ఉదయం, సాయంత్రం తినాలి. కొంతమందికి ముల్లంగి ముక్కల్ని తినడం వల్ల కొంచె వగరు, ఘాటుగా ఉంటుంది. ఓ టీస్పీన్ తేనె కలుపుకొని తినాలి. అన్నంలో కూడా ముల్లంగి ముక్కల్ని కలుపుకొని తినాలి. అలా మూడు వారాలు, నాలుగువారాలు తింటే జట్టులో మార్పులు చోటు చేసుకుంటాయి. ముల్లంగిలో ఉండే సీ విటమిన్ జట్టు పెరిగేందుకు సాయం చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వంటింటి చిట్కాతో ఒత్తైన, పొడవైన జుట్టును పొందండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest