Early Morning Hot Water Benefits | ఉదయాన్నే నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా…?

ఎప్పుడూ ఎనర్జిటిక్ గా, మొహం మీద ఎలాంటి మచ్చలు లేకుండా కాంతివంతంగా దగదగ మెరిసిపోయేలా ఉండాలంటే ఉదయం పరగడుపున మంచి నీళ్లు తాగమని వైద్యులు చెబుతున్నారు. మంచి నీళ్లు తాగితే ఎనర్జిటిక్ గా ఉంటామా అనే అనుమానం రావచ్చు. ఖచ్చితంగా ఎనర్జిటిక్ గా ఉంటామని  అమెరికాకు చెందిన ఆరోగ్య సంస్థ హెల్త్ లైన్ చెబుతోంది. మంచి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి  లాభాలున్నాయనే అంశంపై జపాన్ ప్రజల ఆహారపు అలవాట్ల పై సర్వే నిర్వహించగా. ఆ సర్వేలో తాము ఇంత అందంగా, ఎనర్జిటిక్ గా ఉండడానికి ఉదయాన్నే మంచి నీళ్లు తాగడం వల్లేనని చెబుతున్నారు.

జపాన్ ప్రజల అందం గురించి పక్కనబెడితే ఉదయాన్నే పరగడుపున మంచి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందాం

డైజెషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది

ప్రెజెంట్ యాంత్రిక జీవనంలో డైజెషన్ అనేది ఒక సమస్యగా మారింది. గంటల తరబడి పనిచేయడం, తినడం లో సమయపాలన లేకపోవడం, శరీరాన్ని సుఖపెట్టడంవల్ల తిన్న ఆహారం సరిగ్గా అరగడం లేదు. దీంతో అనేక అనారోగ్య సమస్యల్ని ఖర్చులేకుండా కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. అయితే ప్రతిరోజు ఉదయం పరగడుపున ఖాళీ కడుపుతో మంచి నీళ్లు తాగడం వల్ల డైజెషన్ ప్రాబ్లంను అరికడుతుంది. వాటర్ తాగడం వల్ల 25శాతం జీవక్రియ మెరుగుపడుతుంది. దీంతో తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ఈజీగా బరువు తగ్గుతారు.

అనారోగ్య సమస్యల్ని తట్టుకునే శక్తి వస్తుంది

మన శరీరంలో 80శాతం నీటితో నిండి ఉంటుంది. కాబట్టి పరగడుపున వాటర్ తాగడం వల్ల మనకు జ్వరం, తలనొప్పి లాంటి రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు త్వరగా తగ్గిపోయేలా వాటర్  శరీరాన్ని ప్రిపేర్ చేస్తుంది. అంటు వ్యాధులు సోకకుండా కాపాడుతుంది.

పేగుల్ని శుభ్ర పరుస్తుంది

89శాతం ప్రజలు డైజెషన్ ప్రాబ్లమ్ తో సతమతమవుతున్నారు. తిన్న ఆహారం జీర్ణంగాక అనారోగ్య సమస్యలతో పాటు నవ్వుల పాలు కావాల్సి వస్తుంది.

ఉదా- డైజెషన్ ప్రాబ్లమ్ వల్ల ఓ వ్యక్తి విమానం ఎక్కిన దగ్గర నుంచి గ్యాస్ వదులుతున్నాడు. ఆ కంపుతో తోటి ప్రయాణికులు గగ్గోలు పెడితే గ్యాస్ వదిలే వ్యక్తిని మధ్యలోనే విమానం నుంచి దించేశారు.  సో డైలీ ఉదయాన్నే మంచి నీళ్లు తాగితే గ్యాస్ ప్రాబ్లంతో పాటు శరీరంలోని వ్యర్ధాల్ని వివిధ మార్గాల నుంచి బయటకు పంపిస్తుంది.   మీరు ఉదయాన్నే నీళ్లు తాగితే మూత్ర విసర్జన చేసినప్పుడు వ్యర్ధాల్ని బయటకు వెళ్లిపోతాయి. కడుపు ఉబ్బ రంగా ఉన్నా వాటర్ తాగండి. వాటర్ ఎంత తాగితే అన్ని సార్లు బాత్‌రూంకు వెళుతున్నారని అర్ధం చేసుకోవాలి.

మైగ్రేన్ నుంచి కాపాడుతుంది

తలనొప్పుల్లో రెండు రకాలు ఒకటి నార్మల్ తలనొప్పి, రెండోది మైగ్రేన్. తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకొని, టీ తాగో నయం చేసుకోవచ్చు. కాని మైగ్రేన్ వచ్చిందంటే ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్న తగ్గదు. చాలా సందర్భాల్లో కాలేజీకి వెళ్లే విద్యార్ధులు మైగ్రేన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనాలున్నాయి. మైగ్రేన్ తో బాధపడేవారు రోజూ పరగడుపున మంచి నీళ్లు తాగాలి. మంచి నీళ్లు తాగితే రోగనిరోధక శక్తిని పెంచి మైగ్రేన్ రాకుండా కాపాడుతుంది.  తరచుగా ఖాళీగా ఉన్న నీటిని తాగడం వల్ల సహజంగా తలనొప్పి నుండి బయటపడవచ్చు.

బరువు తగ్గొచ్చు

తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, కొవ్వు పదార్ధాల్ని ఎక్కువగా తినడం, ఎటువంటి వ్యాయామాలు చేయకపోవడం వల్ల బరువు పెరుగుతుంటారు. ఉదయాన్నే మంచి నీళ్లు తాగడం వల్ల లోపల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కొవ్వును కరిగించి సన్నబడేలా చేస్తుంది.

ఆకలి వేస్తుంది

కొంత మందికి అస్సలు ఆకలనేదే ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పనిచేస్తుంటారు. కాని వాళ్లకు ఆకలనేదే వేయదు. దానికి కారణం ఆకలి వేయకపోవడం. అది అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో మంచి నీళ్లు తాగడం వల్ల పేగులు శుభ్రమై ఆకలి అనిపిస్తుంది. త్వరగా తినాలని అనిపిస్తుంది.

మొహంపై పింపుల్స్ ను రాకుండా చేస్తుంది

ఖాళీ కడుపుతో మంచ నీళ్లు తాగడం వల్ల మొహం ప్రకాశ వంతంగా మెరిసి పోతుంటుంది. మొహంపై పేరుకుపోయిన కొవ్వును, మచ్చలను, మలినాల్ని శుభ్రం చేస్తుంది.  రెగ్యులర్ ఉదయాన్నే మంచి నీళ్లు తాగడం వల్ల  పేగులు శుభ్రమై మొహం మెరిసిపోయేలా చేస్తుంది.

హాయిగా నిద్రపోవచ్చు

నిద్రపట్ట లేదంటే మంచి నీళ్లు తాగితే రక్తంలో ఉన్న ఎర్రరక్తకణాలు చురుగ్గా కదిలి హాయిగా నిద్రపోయేలా చేస్తుంది.  దీని ఫలితంగా ఎక్కువ ఆక్సిజన్ మరియు శక్తి వస్తుంది.

పేగుల్ని శుభ్రం చేస్తుంది.

మంచి నీళ్లు తాగితే పేగులు శుభ్రంగా తయారవుతాయి. దీంతో పేగుల్లో పేరుకుపోయిన వ్యర్ధాలను వదిలించుకోవచ్చు.  పోషకవిలువల్ని సంపాదించి పెడుతుంది. పెద్దపేగులు సైతం ఆరోగ్యంగా ఉంటాయి.

నోటి దుర్వాసనను తరిమికొడుతుంది

మనల్ని ప్రధానంగా వేధించే సమస్య నోటి దుర్వాసన. నోటి దుర్వాసన మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా.. నోరు తెరుచుకోకపోతే శరీరంలో ఉన్న మలినాలు బయటకు రాకపోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. మంచి నీళ్లు తాగితే నోటిలో ఉన్న  మలినాలు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతీ ఒక్కరు ఉదయాన్నే లేచిన వెంటనే మంచి నీళ్లను తాగి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.

see this – మందు తాగితే ఏమవుతుందో తెలుసా..?

see this – పాలల్లో పసుపు కలుపుకొని తాగితే ఇన్ని లాభాలా…?

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest