పాలల్లో పసుపు కలుపుకొని తాగితే ఇన్ని లాభాలా…?

ముత్యమంతా వెలుగు ముఖమెంత ఛాయ. ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ అంటు పసుపు గొప్పతనం గురించి కవులు గొప్పగా వివరించారు. పసుపు అందంతో  పాటు  మహమ్మారి క్యాన్సర్ ను తరిమికొట్టే శక్తి ఉందని సైంటిస్ట్ లు చెబుతున్నారు. అంతటి ఔషధ గుణాలున్నా పసుపును విరి విరిగా వినియోగించడం వల్ల  అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

పసుపు ఔషధాల గని. ఒక్క ముక్కలో చెప్పాలంటే పసుపును విరి విరిగా వినియోగిస్తే డాక్టర్ అవసరం లేదనే నానుడు ఉంది. ఆ నానుడ్ని నిజం చేస్తూ కేరళకు చెందిన సైంటిస్ట్ లు  క్యాన్సర్ ను నయం చేసేందుకు  పసుపును వినియోగిస్తున్నారు. పసుపులో ఉండే కర్ క్యూ మిన్ అనే రసాయనం క్యాన్సర్ కారకాన్ని నాశనం చేసే శక్తి ఉన్నట్లు కేరళకు చెందిన శ్రీ చిత్ర తిరునాళ్ ఇనిస్టిట్యూ ట్ హెడ్ లిస్సీ కృష్ణన్ తెలిపారు. పరిశోధనల కోసం  అమెరికాలో పేటెంట్ రైట్స్ కు అనుమతి లభించినట్లు చెప్పారు.

పసుపు  క్యాన్సర్ కణాల్ని ఎలా నాశనం చేస్తుంది

రిసెర్చ్ లో  భాగంగా క్యాన్సర్ ట్యూ మర్లను తొలగించేందుకు లిస్సీ కృష్ణన్  పరిశోధనలు జరిపారు. పరిశోధనల్లో  ఆపరేషన్ ద్వారా క్యాన్సర్ ట్యూ మర్లను తొలగించారు. తొలగించిన తరువాత కొన్ని క్యాన్సర్ కణాలు మిగిలిపోయి…అవి పెరిగి మళ్లీ క్యాన్సర్ వ్యాధి వృద్ధి  చెందడాన్ని గుర్తించారు. అలా క్యాన్సర్ ట్యూమర్లను తొలగించిన తరువాత మిగిలిన క్యాన్సర్ కణాల్ని చంపేందుకు పసుపును వినియోగించారు. పసుపులో ఉన్న కర్ క్యూ మిన్ అనే రసాయనాన్ని ఓ పొరద్వారా శరీరంలోకి పంపి క్యాన్సర్ కణాల్ని చంపేలా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో క్యాన్సర్ కణాలు మరణించాయని, అలా చేయడం వల్ల శరీరానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని లిస్సీ కృష్ణన్ గుర్తించారు.  పరిశోధనల నిమిత్తం అమెరికాలో పేటెంట్ రైట్స్ కు  తీసుకున్నట్లు వివరించారు. త్వరలో పూర్తిస్థాయిలో పరిశోధనలు జరిపి క్యాన్సర్ ను నయం చేసే మందును వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.

పసుపుతో క్యాన్సర్ నే కాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యల్ని నయం చేసుకోవచ్చు.

క్యాన్సర్ ను నయం చేసే శక్తి సామర్ధ్యాలున్న పసుపుతో అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కవచ్చని వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వివిధ పద్దతుల్లో పసుపు పదార్ధాల్ని తీసుకోవడం ద్వారా లివర్ ఫంక్షన్ సరిగ్గా జరిగేలా చూసుకుంటుంది.

నెలసరి సమయాల్ని నొప్పి రాకుండా ఉండేలా పసుపు ఉపయోగపడుతుంది.

రొమ్ము క్యాన్సర్ ను రాకుండా పసుపు అరికడుతుంది.

స్త్రీల గర్భసంచిలో ట్యూమర్ రాకుండా ఫైట్ చేస్తుంది.

ఉప్పు, పసుపును పేస్ట్ గా చేసి బ్రెష్ చేయడం వల్ల నోటి దుర్వాసన, దంత సమస్యలు, నోటి అనారోగ్య సమస్యల్ని నయం చేసుకోవచ్చు.

మొహంపై మొటిమలు పోవాలంటే రాత్రి పడుకునే సమయంలో పసుపు, కొత్తిమీర ను కలిపిన నీటిని తాగితే మొటిమలు మటుమాయం అవ్వడమే కాకుండా మొహం సాఫ్ట్ గా ఉండేలా చేస్తుంది.

పసుపు కలిపిన పాలను తాగడం వల్ల రక్తం శుద్ధి జరిగి గుండె జబ్బుల్ని అరికడుతుంది.

నోరు, కిడ్నీ, లివర్ క్యాన్సర్ సోకకుండా కాపాడుతుంది.

మద్యం సేవించేవారు 5 గ్రాముల పసుపును నీళ్లలో కానీ, మజ్జిగలో కానీ కలిపి నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం తీసుకుంటే లివర్ సమస్యలు లేకుండా చేస్తుంది

నెలసరి సమస్యతో బాధపడే మహిళలు పసుపు నీటిని తాగడం వల్ల సంబంధిత సమస్యల్ని అరికట్టేందుకు ఉపయోగపడుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest