Best Summer Health Tips | సమ్మర్ సీజన్ లో ఆరోగ్యంగా ఉండేందుకు అద్భుతమైన చిట్కాలు

 మార్చి నెల ప్రారంభం కాక ముందే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఉదయం 9 కాగానే వచ్చేస్తూ సాయంత్రం 6 దాటినా వెళ్లనంటున్నాడు. ఒంట్లో నీరంతా స్ట్రా పెట్టి తాగేస్తున్నాడు. బయట అడుగుపెడితే భయపడేలా చేస్తున్నాడు. ఊహించని రీతిలో రికార్డ్ అవుతున్న ఉష్ణోగ్రతలు ఊపిరి తీయనీయడం లేదు. వీటికి తోడు వడగాలులు ఉండడం తో సమ్మర్ సెగలు పుట్టిస్తోంది. దీంతో ఈ సమ్మర్ ఎఫెక్ట్ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

అయితే సమ్మర్ సీజన్ లో కొన్ని చిట్కాలు పాటిస్తే వేడినుంచి ఉపశమనం పొంది ఎనర్జీగా ఉండొచ్చు. ఆ సమ్మర్ హెల్త్ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సమ్మర్ సీజన్ లో దొరికే పండ్లను తినాలి – Get Grab Seasonal Fruits and Vegetables in Telugu  

సమ్మర్ సీజన్ లో లభ్యమయ్యే  ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యకరంగా ఉండొచ్చు. వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు.  మామిడి, రేగి పండ్లు, స్ట్రాబెర్రీస్ , పుచ్చకాయ, నారింజ, ఆకు కూరల్ని తినాలి.

హైడ్రేట్ గా ఉండండి – Hydrated Health Tips in Telugu

సమ్మర్ సీజన్ లో ప్రధానంగా తలెత్తే సమస్య పొడి చర్మం. పొడి చర్మం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా చర్మ సంబంధమైన ఎలర్జీ, దురద, మంట, చికాకును కలిగిస్తుంది. కాబట్టి వీలైనంత  హైడ్రేట్ గా ఉండడానికి ప్రయత్నించండి. శరీరాన్ని హైడ్ రేట్ గా ఉంచేందుకు, ప్రతి రోజు కనీసం ఎనిమిది 8 ఔన్సు గ్లాసుల ద్రవాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  నిమ్మకాయతో చేసే షర్బత్ తో పాటు గంట గంటకు మంచి నీళ్లు తాగడం ఉత్తమం. నార్మల్ కూల్ గా ఉన్న వాటర్ ని తాగాలి. కానీ చల్లటి నీరు తాగకూడదు. చల్లటి నీరు తాగడం వల్లో అనారోగ్య సమస్యలు తలెత్తాయి.

మీ భోజనాన్ని తగ్గించండి – Summer Food Tips in Telugu 

భోజనాన్ని తినడం తగ్గించాలి. ఎక్కువ ద్రవపదార్థాల్ని తీసుకోవాలి. ఎందుకంటే ఎండాకాలంలో  తిన్న అన్నం జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడుతుంది. దానికి తోడు వేడి. అందుకే సమ్మర్ సీజన్ లో ఎక్కువ ఆహారాన్ని తీసుకోలేము.  ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువ తినడం గంటే తేలికైన భోజనం చేయడం మంచిది.

 మీ బాడీని చల్లబరిచే ఆహార పదార్ధాల్ని తీసుకోండి – Summer Season Cool Food Tips in Telugu

మీ బాడీని కూల్ చేసే ఆహారాన్ని తీసుకోవాలి.  నువ్వులు, కొబ్బరి నీరు, దోసకాయ, పు దీనా, సోపు గింజలను తినండి.

కూల్ డ్రింక్స్ కంటే పండ్ల రసాల్ని ఎక్కువగా తాగండి – Summer Season Drinks Tips in Telugu 

సమ్మర్ సీజన్ లో విపరీతమైన దాహం వేస్తుంది. ఈ మయంలో కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంది. కూల్ డ్రింక్స్ బదులు శీతల పానీయాలు శక్తినిస్తాయి. ఆరోగ్యంగా ఉంచేలా సాయం చేస్తాయి. మీకు దాహం వేసినప్పుడల్లా నారింజ రసం, పుచ్చకాయ రసం తాగడానికి ఇష్టపడండి.

తేలికపాటి స్నాక్స్ తినండి – summer season snacks tips in telugu 

 

సమ్మర్ సీజన్ లో అన్నం ఎక్కువగా తినాలనిపించదు. ఆరోగ్యాన్నిచ్చే గింజలు, స్ట్రీట్ లలో అమ్మే  మిక్చర్ లు, ఫ్రూట్స్ లను తీసుకోండి. స్నాక్స్  తినాలనే కోరిక తీరుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి – Summer Season Healthy Body Tips in Telugu 

సమ్మర్ సీజన్ లో శరీరాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే మనకు అంత మంచిది.  మీరు తాగే వాటర్, తినే తిండి, ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సమ్మర్ లో ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శుభ్రంగా ఉండేలా జాగ్రత్తపడండి. తినే ముందు తప్పని సరిగా చేతులు సోప్ తో క్లీన్ చేసుకోండి.

ఇంకా చదవండి – Cataract Ayurvedic Remedies | కంటి శుక్లాల్ని అదుపు చేసే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా

ఇంకా చదవండి – kidney stone symptoms : కిడ్నీ స్టోన్స్ లక్షణాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇంకా చదవండి – భరించలేని నడుంనొప్పి (బ్యాక్ పెయిన్)తో బాధపడుతున్నారా..?

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest