Best Food For Vitamin C : కరోనా క్రైసిస్ లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఫ్రూట్స్

కరోనా తో పాటు రక రకాలైన వైరస్ ల బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ముఖ్యం. సమ్మర్ సీజన్, వింటర్ సీజన్లతో పని లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. వాటిలో ముఖ్యంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్‌ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పదార్ధాలు, ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు ఉపయోగపడతాయి.

పుల్లగా ఉండే పండ్లు  –

నోటికి పుల్లగా ఉండే కొన్ని పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండ్లను తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి వల్ల తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. అంటు వ్యాధులతో పోరాడటానికి ఇవి కీలకంగా పనిచేస్తాయి.

విటమిన్ సి ఎక్కువ గా ఉండే ఫ్రూట్స్ – 

ద్రాక్ష పండు, నారింజ, బత్తాయి, నిమ్మకాయల్లో ఉంటుంది. అయితే శరీరంలో ఎక్కువసేపు నిల్వ ఉండడం, నిరంతరం శరీరాన్ని అందించేందుకు సహాయపడవు. కాబట్టి. ప్రతీ రోజు విటమిన్ సి ఎక్కువగా ఉన్న పండ్ల రసాల్ని తాగాలి. భోజనానికి ముందు పండ్ల రసాల్ని తాగేలా చూసుకోవాలి

1. క్యాప్సికమ్ 

సిట్రస్ జాతికి చెందిన ఫ్రూట్స్ లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అంతకంటే ఎక్కువగా క్యాప్సికం లో విటమిన్ సి అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. క్యాప్సికం లో బీటా కెరొటిన్ అనే విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు కళ్లను, చర్మాన్ని ఆకర్షణీయంగా, శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయి.

2.  బ్రోకలి 

బ్రోకలీ లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి విటమిన్లు ఎ, సి మరియు ఈ అలాగే అనేక ఇతర యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌తో నిండిన బ్రోకలీ ఆరోగ్యకరమైన కూరగాయలలో ఒకటి.

3. వెల్లుల్లి 

ప్రపంచంలో వండే అన్నీ వంటకాల్లో వెల్లుల్లి కనిపిస్తుంది. వెల్లుల్లిలో జింక్ ఉంటుంది.  పూర్వకాలంలో   అంటువ్యాధులను వెల్లుల్లితో నయం చేసినట్లు ఆధారాలు చెబుతున్నాయి.  నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ సోర్స్ ప్రకారం వెల్లుల్లి కూడా రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది.

4. ఓట్స్ మరియు బార్లీ 

మన శరీరంలో ఇమ్యూనిటి పవర్ ను పెంచేందుకు ఓట్స్ మరియు బార్లీ ఉపయోగపడతాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాదు.. గాయాల్ని నయం చేసే యాంటి బయోటిక్ వెపన్ లా పనిచేస్తాయి. వీటిలో  బీటా గ్లోకూన్, సాల్యుబుల్ ఫైబర్లు ఉంటాయి.

బీటా గ్లోకూన్ –  ఫైబర్ శరీరంలో కార్బోహైడ్రేట్స్ అంటే పిండిపదార్థాల్ని తగ్గిస్తుంది. బరువు తగ్గేలా సాయం చేస్తుంది.

సాల్యుబల్ ఫైబర్ – ఈ ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి. మంచి కొలెస్ట్రాల్ ను శరీరానికి అందిస్తుంది.

5. టీ  

హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ ల పరిశోధనల్లో రెండు వారాల పాటు రోజుకు  కప్పుల బ్లాక్ టీ తాగిన వ్యక్తులు.. ప్లెసిబో టీ అంటే మందారం పువ్వుతో తయారు చేసిన టీ. మందారం పువ్వులో కృత్తిమంగా దొరికే ద్రవాన్ని ప్లెసిబో అంటారు. ఆ ద్రవంతో తయారు చేసిన టీ తాగే వారి కంటే  కామెల్లియా సినెసెస్ అనే మొక్క ఆకుల పొడితో తయారు చేసే బ్లాక్ టీ తాగేవారిలో ఇమ్యూనిటీ పవర్ 10రేట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

గ్రీన్ టీ కూడా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. గ్రీన్ ఆకుల్ని లేదా పొడిని మరగబెట్టినప్పుడు..ఆ పొడిలో ఉండే కెటెచిన్లు కరిగిపోయి టీ డాకక్షన్ (కాషాయం) తయారవుతుంది. ఈ డికాక్షన్ బ్యాక్టీరియాను అంతం చేస్తుంది.

6. చిలకడ దుంప 

నార్మల్ దుంపల కంటే చిలకడ దుంపల్ని తినడం వల్ల ( స్వీట్ పొటాటోస్ ) ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్వీట్ పొటాటోస్ అని పిలిచే చిలకడ దుంపల్లో ఐరన్, పొటాషియం, బీటా కెరోటిన్ తో పాటు విటమిన్ సీ, విటమిన్ ఈ లు పుష్కలంగా ఉన్నాయి. వీటివల్ల శరీరంలో వివిధ భాగాలకు ఆక్సిజన్ అందించి రోగనిరోధక శక్తిని కాపాడుతుంది.

7. ఎగ్స్ 

ఎగ్స్ తినడం వల్ల విటమిన్ డి తో పాటు కాల్షియం ను అందిస్తుంది. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచేందుకు సాయపడుతుంది. విటమిన్ డీ లోపం వల్ల శ్వాసకోశ సమస్యలు, టైప్ 2 డయాబెటిస్ లు శరీరంపై దాడి చేస్తాయి. ఎగ్స్ తో పాటు విటమిన్ సూర్యరశ్మి నుంచి పొందవచ్చు. పోషకాలున్న ఆహారం తో పాటు, పాలు, ఎగ్స్ ద్వారా ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు.

for more news

Back Pain After Pregnancy : మహిళల్లో వెన్నునొప్పిని తగ్గించే మార్గాలు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest