Cataract Ayurvedic Remedies | కంటి శుక్లాల్ని అదుపు చేసే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా

మన ఇంట్లో ని అద్దాన్ని శుభ్రం చేయడం పట్టించుకోకపోతే కొన్నాళ్ల కు అది మబ్బుగా మారిపోతుంది. అలాంటప్పుడు అద్దంలో మనకు ఏదీ స్పష్టంగా కనిపించదు. మనకంట్లోని కటకము (లెన్స్ ) కూడా అంతే. పారదర్శకంగా ఉండాల్సిన కటకము ముదిరిపోయి  మబ్బుగా మారి మనకు చూపు మందగించి పోతుంది. కంట్లో శుక్లము మొదలైనప్పుడు కంట్లో కటకం క్రమంగా ముదిరిపోతుంది. చివరికి ఎండుకొబ్బరిలా మారి మన చూపుకు ఎసరు పెడుతుంది. కంట్లోని శుక్లాన్ని క్యాటరాక్ట్ అంటారు. అయితే  ప్రారంభ దశలో ఉన్న శుక్లాన్ని ఆయుర్వేద పద్దతులను ఉపయోగించి ఎలా నయం చేసుకోవచ్చో తెలుసుకుందాం..?

 Cataract Ayurvedic Remedies
Cataract Ayurveda Remedies

క్యాట్ రాక్ట్ అని ఎందుకు పిలుస్తారు

ఇంగ్లీష్ లో క్యాట్ రాక్ట్ అంటే..! కంటి శుక్లాలు వచ్చినవాళ్ల కళ్లు లోపలి నుంచి బయట చూసినప్పుడు  పిల్లి కళ్ళులా కనిపిస్తాయి. అందుకే క్యాట్ రాక్ట్ అని అంటారు.

క్యాట్ రాక్ట్ రావడానికి కారణాలు

పండు వయసులో కంటి లెన్స్ శక్తిని కోల్పోయి చూపు మందగిస్తుంది. ఒక్కోసారి చిన్నవయసులో కూడా ఈ క్యాట్ రాక్ట్ సమస్య వేధిస్తుంది. డయాబెటీస్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, కంటికి దెబ్బలు తగిలినప్పుడు క్యాట్ రాక్ట్ వస్తుంది.

క్యాట్ రాక్ట్ ను ఎలా నయం చేసుకోవచ్చు.

శుక్లాల సమస్య ముదిరినప్పుడు ఆపరేషన్ ద్వారా, ఆయుర్వేద పద్దతిలో నయం చేసుకోవచ్చు.

శుక్లాల సమస్య ప్రారంభదశలో ఉన్నప్పుడు ఎలా నయం చేసుకోవాలి

శుక్లాల సమస్య ఆరంభంలో ఉన్నప్పుడు ముదరకుండా ఆయుర్వేద పద్దతిలో కొన్ని చిట్కాలు పాటించి నయం చేసుకోవచ్చు.  అయితే ఆ చిట్కాలు మాత్రం ఆయుర్వేద నిపుణులు, డాక్టర్ల సలహా తీసుకొని పాటించాలి. స్వయంగా చిట్కాల జోలికి వెళ్ల వద్దని వైద్యులు చెబుతున్నారు.

 ఆయుర్వేద పద్దతిలో శుక్లాల సమస్యను అధిగమించేలా పాటించాల్సిన చిట్కాలు

ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎన్నో నయం కానీ జబ్బుల్ని సైతం త్రిఫల చూర్ణంతో మటుమాయం చేసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

ఉసిరి కాయ, కరక్కాయ, తాన కాయల్ని ఎండబెట్టి మెత్తని పొడిగా చేసి జబ్బుల్ని నయం చేసుకోవచ్చు. వాటితో ప్రధానంగా శుక్లాల సమస్యని ఆరంభంలో ముదరకుండా నయం చేసుకోవచ్చని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. త్రి ఫల చూర్ణంతో పాటు ఎస్టీ మధుర చూర్ణం చెట్టు వేరులా ఉండే ఈ ఆయుర్వేదం మొక్క షాపుల్లో దొరకుతుంది. చెట్టు వేరుని  పొడిలా చేసుకొని వాడుకోవాలి.

మరింత ఆరోగ్య సమాచారం కోసంఆయుర్వేద పద్దతిలో నడుం నొప్పిని పోగొట్టే చిట్కా

త్రిఫల చూర్ణం, ఎస్టి  మధుర చూర్ణాన్ని కలిపి మూడు నుంచి ఆరుగ్రాములు అంటే అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు తగినంత తేనెతో కానీ, నెయ్యితో కానీ కలిపి ఆరునెలల పాటు రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మూడు పూటలా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యాట్ రాక్ట్ ను అడ్డుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest