constipation remedies | మోషన్ ఫ్రీ అవ్వాలంటే పాటించాల్సిన చిట్కాలు

అజీర్తి, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్ నిజానికి ఇవేం పెద్ద సమస్యలు కాదు. వీటి బాధల్ని భరించడం చాలా చిరాగ్గా ఉంటుంది. అస్తమానం పుల్లటి తేన్పులు, పొట్టంతా బిగదీసినట్లుగా ఉండడంతో మన శాంతి కరువవుతుంది. ఆలోచనలన్నీ పొట్ట చుట్టూనే తిరుగుతుంటాయి. వేధించే గ్యాస్ ట్రిక్ ప్రాబ్లం నుంచి కొన్ని వంటింటి చిట్కాలు పాటిస్తే ఈజీగా బయటపడవచ్చు. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.

వేడినీళ్లు తాగండి 

water constipation remedies

చాలా మంది అన్నం హడావిడిగా తింటుంటారు. అలా తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. అన్నాన్ని మెత్తగా నమిలి మింగడం వల్ల జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. దీనికి తోడు  అన్నం తినేటప్పుడు చాలామంది మంచి నీళ్లు తాగుతుంటారు. అలా తాగడం వల్ల అన్నం త్వరగా అరగదని వైద్యులు చెబుతున్నారు. అన్నం తిన్న 15నిమిషాల తరువాత మంచి నీళ్లు తాగాలి. గ్యాస్ సమస్యతో బాధపడేవారు అన్నం తిన్న 15 నిమిషాల తరువాత వేడి నీళ్లు తాగాలి. అంతే కాదు తిన్న తరువాత కొద్ది దూరం నడవాలి. నడవడం సాధ్య పడకపోతే సీట్లోనే నిటారుగా కూర్చోవాలి. అలా చేయడం వల్ల అన్నం త్వరగా జీర్ణమై గ్యాస్ట్రిక్ ను తరిమికొడుతుంది.

వెల్లుల్లి

garlic cure constipation

గ్యాస్ట్రిక్, గ్యాస్, అపానవాయువు పేర్లు వేరైనా సమస్య ఒక్కటే. ఈ సమస్యలతో సతమతమయ్యేవారు ప్రతీ రోజు భోజనం చేసిన తరువాత వెల్లుల్లిని నమలడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య ను తరిమికొట్టొచ్చు. దీంతో పాటు వెల్లుల్లి, నల్లమిరియాలు, జీలకర్ర కలిపి ఉడకబెట్టాలి. ఉడకపెట్టిన అనంతరం వడకట్టి ఆ నీటిని రోజుకు మూడుసార్లు తాగడం వల్ల సమస్య నుంచి భయటపడొచ్చు.

నల్ల మిరియాలు 

గ్యాస్ సమస్య నుంచి బయటపడేందుకు మిరియాలు మంచి చిట్కాగా ఉపయోగపడతాయి. నల్ల మిరియాలు తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు, గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఉపయోగపడుతుంది. సగం టీ స్పూన్ పొడి నల్ల మిరియాలు, బెల్లం కలిపి మెత్తగా  చేయండి. గ్యాస్ తో బాధపడేవారు ప్రతీ రోజు ఆ మిశ్రమాన్ని ఏ టైంలోనైనా కొంచెం తినాలి. దీంతో పాటు నల్ల మిరియాలు, పొడి అల్లం, కొత్తిమీర, పు దీనా ఆకులను ఉపయోగించి మిశ్రమాన్ని కూడా తయారు చేసుకొని ప్రతిరోజూ  ఒక టీ స్పూన్ తినడం వల్ల గ్యాస్ మటుమాయం అవుతుంది

జీలకర్ర 

గ్యాస్ట్రిక్ సమస్యలను నయం చేసేందుకు జీలకర్ర సహాయపడుతుంది.  ఒక కప్పు వేడి నీటిలో, ఓ టీ స్పూన్ జీలకర్రను  వడకట్టి భోజనం ఎప్పుడు చేస్తే అప్పుడు.. భోజనానికి ముందు  తాగడం వల్ల గ్యాస్ట్రిక్ ను సమస్యను అరికట్టవచ్చు. ఈ జీలకర్ర వాటర్ ను టీలా తయారు చేసుకొని తాగొచ్చు.

తాజా పెరుగు

గ్యాస్, గ్యాస్ట్రిక్ సమస్యలతో పోరాడటానికి పెరుగు చిట్కాగా ఉపయోగపడుతుంది. చిటికెడు జీలకర్రపొడి, ఉప్పు, వెన్న కలిపి తినడం వల్ల  గ్యాస్ మటుమాయం అవుతుంది.

లవంగాలు

లవంగాలు సర్వరోగ నివారిణి దంతసమస్యలు, అజీర్తి సమస్య, లైంగిక పరమైన సమస్యలతో బాధపడేవారు లవంగాలను నమలడం వల్ల ఆయా సమస్యలనుంచి బయటపడొచ్చు.  ఈ లవంగాలను నమలడం వల్ల గ్యాస్ట్రిక్ నొప్పి  నుంచి ఉపశమనం పొందవచ్చు. కొంచెం మంటగా అనిపిస్తే.. లవంగాన్ని పీలిస్తే నూనె వస్తుంది. ఆ లవంగం నూనె  గ్యాస్ ను దరిచేరదు.

సోపు గింజలు (సాన్ఫ్)

జీలకర్ర, సోపు లు జీరా జాతికి చెందిన ఈ గింజలు ఆనారోగ్య సమస్యల్ని ముటుమాయం చేస్తాయి. జీలకర్ర,సోపు గింజలు చూడటానికి ఒకేలా ఉంటాయి. జీలకర్రను ఆహార పదార్ధాల్లో వినియోగిస్తే సోపును శుభకార్యాల్లో ఉపయోగిస్తాయి. ఈ సోపు గింజలతో పాటు ఎండిన మెంతులు, పెరుగు, తరిగిన దోసకాయ ముక్కలతో కలిపి తినడం వల్ల  గ్యాస్ సమస్యను అరికట్టవచ్చు.

గోరువెచ్చని నీరు

గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు నొప్పి, అజీర్తి సమస్యల్ని మటుమాయం చేసేందుకు వేడినీళ్లు చక్కగా పనిచేస్తాయి. ప్రతీసారి కొంచెం కొంచెం గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను అరికట్టవచ్చు. శరీరంలో వాటర్ కంటెంట్ ను పెంచేందుకు ఉపయోగపడుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్

మీరు గ్యాస్ట్రిక్ తో బాధపడుతుంటే ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక టీ స్పూన్ తేనెని ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల గ్యాస్ ట్రిక్ ను తరిమి కొట్టొచ్చు.

యాలుకలు 

యాలుకలు తిన్న అన్నాన్ని జీర్ణం చేసేందుకు దివ్వ ఔషదంగా పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థను పెంచేందుకు గ్యాస్, ఉబ్బరం సమస్యలను అరికడుతుంది. డైజేషన్ సమస్య, గ్యాస్ట్రిక్ సమస్య, తలనొప్పితో బాధపడేవారు యాలుకల టీ తాగండి. యాలుకల టీ తో గ్యాస్ సమస్య నుంచి భయపడొచ్చు.

వంట సోడా 

గ్యాస్ట్రిక్ సమస్య, గుండెల్లో మంటగా ఉండే ఓ టీ స్పూన్ బేకింగ్ సోడాను అరకప్పు నీటిలో బాగా కలపాలి. అలా కలిపిన వాటన్ ను తాగడం వల్ల గ్యాస్ మరియు గ్యాస్ట్రిక్ సమస్యల నుండి తక్షణ ఉపశమనం పొందొచ్చు.

యష్టిమధు 

ఆయుర్వేద వైద్య శాస్త్రంలో యష్టిమధు చూర్ణాన్ని ఉపయోగిస్తారు. ఆదివాసీలు అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ యష్టిమధు మూలికల పొడిని ఉపయోగిస్తారు. యష్టిమధు చూర్ణం మీకు ఆయుర్వేద మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. ఈ యష్టిమధు మూలికల చూర్ణాన్ని చప్పరించడం వల్ల ఎసిడిటీ, అల్సర్, గుండె నొప్పిని అరికడుతుంది.

దాల్చిన చెక్క

ఒక కప్పులో కావాల్సినంత దాల్చిన చెక్క, పాలు, తేనె కలిపి తాగండి. తద్వారా గ్యాస్, డైజేషన్ సమస్యలనుంచి ఉపశమనం పొందొచ్చు. గ్యాస్ సమస్య పోవాలంటే దాల్చిన చెక్క టీ తాగడం వల్ల సమస్యను దూరం చేయోచ్చు.

అల్లం 

గ్యాస్ సమస్యల్ని అరికట్టేందుకు అల్లం ఉపయోగపడుతుంది. అల్లం టీని రోజు ఉదయం సాయంత్రం తాగడం వల్ల గ్యాస్, డైజేషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. గ్యాస్ సమస్యలను రాకుండా కాపాడుతుంది.

ఉసిరి కాయ 

ఉసిరికాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పేగుల పనితీరు బాగుపడేలా చేస్తుంది. వంటల్లో ఉసిరి యాను యాడ్ చేసి తినడం వల్ల పేగుల పనితీరు బాగుంటుంది. గ్యాస్ సమస్యను అరికడుతుంది. శరీరం కూల్ గా ఉండేలా చేస్తుంది.

ఇసబ్ గోల్ 

ఇసాబ్గోల్ మలబద్దకాన్ని నయం చేస్తుంది కాని ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మరియు ప్రేగును నియంత్రిస్తుంది. దీనికి ఒక మంచి మార్గం ఏమిటంటే, ఒక చెంచా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపాలి మరియు ప్రతి ఉదయం త్రాగాలి.

పసుపు 

అన్నీ రకాల అనారోగ్య సమస్యల్ని తరిమికొట్టడం లో పసుపు కీరోల్ ప్లే చేస్తుంది. గ్యాస్, గ్యాస్ట్రిక్, అజీర్తి సమస్యల్ని దూరం చేసేందుకు పసుపు బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడేవారు. వేడివేడి పాల్లలో పసుపు పొడిని కలుపుకొని తాగడం వల్ల గ్యాస్ మటుమాయం అవుతుంది.

కొబ్బరి నీరు  

బాడీని హెల్దీగా ఉంచేందుకు, ఫ్లూ, విరేచనాలు, కలరా వంటి సమస్యలనుంచి బయటపడేందుకు కొబ్బరి నీళ్లు ఉపయోగపడతాయి. గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బయటపడాలంటే కొబ్బరినీళ్లు తాగడం వల్ల సమస్యను అరికట్టవచ్చు.

see more – పిల్లల్లో మలబద్ధకాన్ని జాడించి తన్నే అద్భుతమైన చిట్కా

see more – భరించలేని నడుంనొప్పి (బ్యాక్ పెయిన్)తో బాధపడుతున్నారా..?

see more – ఊబకాయం – అధిక బరువు అంటే ఏమిటి

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest