కరోనా వైరస్ ఏఏ దేశాల్లో ఎంతమందికి సోకిందంటే

Corona virus..! ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న వైరస్. 2002నవంబర్ నుండి 2003 జులై సౌత్ చైనాలో కరోనా జాతికి  చెందిన సార్స్ వైరస్ విజృంభించింది. ప్రపంచ వ్యాప్తంగా 37దేశాల్లో 8000మందికి సోకగా 774మంది మృతి చెందారు.

106కి చేరిన మృతుల సంఖ్య

తాజాగా చైనాలో ఆ జాతికి చెందిన కరోనా వైరస్ సోకడంతో ఇప్పటివరకు ఆదేశంలో సుమారు 6,000మందికి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న హుబెమ్ ప్రావిన్స్ లో 840కొత్త కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 24మంది మరణించగా. ఇప్పటి వరకు చైనాలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 132కి చేరింది. 3554మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అసలు ఈ కరోనా వైరస్ లు ఎందుకింత ప్రమాదకరం..!

కరోనా వైరస్ లు క్షీరదాలు. అంటే పాలిచ్చే జంతువుల్లో, పక్షుల్లోనూ ఇన్ఫెక్షన్ లను కలిగిస్తాయి. ఆవులు, పందుల్లో డయోరియాను, కోళ్లల్లో ఊపరితిత్తుల సమస్యల్ని కలిగిస్తాయి. మనుషుల్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లను కలిగిస్తాయి. గబ్బిలాలు ఈ వైరస్ కు కేంద్రబిందువుగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కరోనా వైరస్ అంటే..?

కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అంటారు. ఈ వైరస్ సోకిన బాధితుడికి పరీక్షలు జరిపినప్పుడు రాజులు ధరించే కిరీటం ఆకృతిలో కనిపిస్తుంది. అందుకే దీన్ని కరోనా అని పిలుస్తారు.

కరోనా ఎలా వెలుగులోకి వచ్చింది  

కరోనా వైరస్ కేంద్రబిందువైన చైనాలో వుహన్ నుంచే ప్రపంచ దేశాలకు సోకినట్లు తెలుస్తోంది. చైనా ఆహారపు అలవాట్లు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. ప్రపంచ దేశాల్లో ఆహారపు అలవాట్లకు భిన్నంగా చైనా దేశ ఆహారపు అలవాట్లు ఉంటాయి. చైనా ప్రజలు క్షీరదాలు, కప్పలు, పాముల్ని ఇష్టం తింటారు. అందుకు తగ్గట్లే చైనాలో పలు మార్కెట్లో పాముల్ని అమ్ముతుంటారు. అలా పాముల్ని తిన్న ఓ వ్యక్తి ఈవైరస్ సోకినట్లు డబ్ల్యూహెచ్ఓ పరిశోధనల్లో తేలింది.

అత్యంత ప్రమాదకరమైన పాములు

ఈ వైరస్ సోకిన పాములు అత్యంత ప్రమాదకరమైనవి. దక్షిణ చైనా, ఆగ్నేయాసియాలో తైవానీస్ క్రైట్ , చైనీస్ క్రైట్ అనే పాముల్లో బ్యాండెడ్ క్రైట్ అనే జాతి పాముల్లో ఈ వైరస్ ను సైంటిస్ట్ లు గుర్తించారు.

చైనా చుట్టుపక్కల దేశాల్ని వణికిస్తున్న కరోనా

ఈ కొత్తరకం వైరస్ చైనా చుట్టుపక్కల దేశాలకు చెందిన ప్రజల వెన్నుల్లో వణుకు పుట్టిస్తుంది. ఇప్పటి వరకు థాయ్ లాండ్  (7), సింగపూర్ (4), ఆస్ట్రేలియా (4), జపాన్ (3), మలేషియా (3), సౌత్ కొరియా (3), నేపాల్ (1), శ్రీలంక (1)లో కేసులు నమోదయ్యాయి.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest