Director Harish Shankar : వైరల్ అవుతున్న డైరెక్టర్ హరీష్ శంకర్ కరోనా వైరస్ కవిత

కరోనా ప్రపంచ దేశాల్ని చిగురాకులా వణికిస్తుంది. ఇప్పటికే చైనా దేశాలు అతలాకుతలమై పోయాయి. మనదేశంలో కూడా ఆల్ రెడీ రెండో స్టేజ్ కూడా నడుస్తోంది. మూడో స్టేజ్ లోకి ఎంటరై తే ఇండియా కూడా ఇరాన్, ఇటలీలా మారిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. మూడో స్టేజ్ చేరుకోవడానికి ఇంకా టైం పడుతుంది. ఇలోగ జాగ్రత్తలు పడకపోతే చేతులు కాలక ఆకులు పట్టుకోవడమే అవుతుంది.

ఈ దారుణం జరగక ముందే ప్రధాని మోడీ గారు గత రాత్రి నుంచి 21రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించారు. కార్చిచ్చులా కరోనా వైరస్ వ్యాపిస్తుంటే అగ్ర దేశాలు సైతం ఏం చేయలేకపోతున్నాయని అన్నారు. ఆ పరిస్థితి మన దేశానికి రాకుండా ఉండాలంటే కచ్చితంగా హోం క్వారంటైన్ లో ఉండాలని కోరారు.

కరోనా వైరస్ కు మందు లేదు. కరోనాకి మందంటే ఇంట్లో ఉండటమే. మీకు చేతులెత్తి వేడుకుంటున్నా.. లాక్ డౌన్ దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తుందని తెలిసినా ఈ నిర్ణయం తీసుకుంటున్నా. తప్పని సరిగా ప్రతీ ఒక్కరు హోం క్వారంటైన్ లో ఉండాలని మోడీ గారు జాతినుద్దేశించి ప్రసంగించారు.

ప్రచారం చేస్తున్న టాలీవుడ్ ఇండస్ట్రీ

సినీరంగానికి చెందిన పలువురు హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు తనదైన స్టైల్లో కరోనా వైరస్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రచారం చేస్తున్నారు. తాజాగా తూటాలలాంటి డైలాగులతో అభిమానుల్ని కను విందు చేసే డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కరోనా వైరస్ పై తనదైన స్టైల్లో ఓ కవిత రాశారు. ప్రస్తుతం ఆ కవిత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటునుం” *చైనా*

అటునుం”చైనా”

ఎటునుం”చైనా”

వచ్చి ఉండవచ్చు గాక ఇకనుం”చైనా”జాగ్రత్తగా ఉంటే మంచిది..

దాని మెడలు వం”చైనా” పంపిద్దాం

ప్రజలకు కాస్త వివరిం “చైనా” చెబుదాం.

వారికి కాస్త మం”చైనా”చేద్దాం

అంతకు మిం”చైనా”సాధిద్దాం.. అంటూ కవిత రాశారు. ప్రస్తుతం ఆ కవిత వైరల్ గా మారింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest