Five Herbal Tea: టీ తాగండి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోండి

కరోనా వైరస్ తో పాటు అన్నీ రకాల వైరస్ ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇమ్యూనిటీ పవర్ చాలా ముఖ్యం. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్న మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ లేకపోతే అంటే వ్యాధిని తట్టుకునే శక్తి లేకపోతే అంతా వృధానే. లాక్ డౌన్ టైం లో అందరం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు ఖాళీగా ఉన్నాం కదా అని ఏదో ఒక టీ తాగే బదులు.. మన వంటగదిలో దొరికే ఔషధాలతో హెర్బల్ టీ ని తయారు చేసుకొని తాగితే ఇంకా మంచిది.

అయితే వంటగదిలో దొరికే అల్లం, తులసి, పుదీనా, మిరియాలు మరియు దాల్చిన చెక్క వంటి ఔషధాలతో 5రకాలైన హెర్బల్ టీ ని తయారు చేసుకొని ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యాధి నిరోధక శక్తితో పాటు స్టమక్ పెయిన్, జలుబు, తలనొప్పి, నిద్రలేమి సమస్యలు, డైజేషన్ ప్రాబ్లమ్స్ ని ఈ హెర్బల్ టి నయం చేస్తుంది.

1. అల్లం టీ 

జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్నప్పుడు  అల్లం టీ తాగాలి.  అల్లం నుండి వచ్చే వేడి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. టీ లో ఉపయోగించే తేనె గొంతులో ఏదైనా సమస్యలుంటే మటుమాయం చేస్తుంది.

కడుపులో క్రిములు ఉండడం వల్ల  కడుపు నొప్పితో అనేక రకాలైన సమస్యలు తలెత్తుతాయి.  అల్లం, దాల్చిన చెక్క తో తయారు చేసిన టీని తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు.

టీ చేసుకునేందుకు కావాల్సిన పదార్ధాలు

ఒక టీ స్పూన్ తరిగిన అల్లం

1/2 స్పూన్ తేనె

2 లవంగాలు

కావాల్సినంత దాల్చిన చెక్క

నిమ్మకాయ ముక్క

తయారు చేసుకునే విధానం 

తగినంత నీటిని నార్మల్ గా మరగబెట్టాలి. అనంతరం పైన చెప్పిన పదార్ధాల్ని ఆ నీటిలో కలపాలి. అనంతరం కొద్దిసేపు ఆ నీటిని మరగబెట్టి…ఓ గ్లాస్ లో వడకట్టి తాగాలి.

2. నిమ్మ మరియు మిరియాలు టీ

నిమ్మ, మిరియాలతో చేసిన టీ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాకుండా కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్, కిడ్నీ సంబంధిత సమస్యలను దూరం చేయవచ్చు.

కావాల్సిన పదార్ధాలు

ఒక నిమ్మకాయ రసం

1/2 స్పూన్ పసుపు పొడి

1/4 స్పూన్ మిరియాలు

1 1/2 స్పూన్ తేనె

తయారు చేసే విధానం –

మిరియాల పొడి, పసుపు కలిపి నీటి మరిగించాలి. మరిగే నీటిలో తేనె, నిమ్మరసాన్ని బాగా కలపాలి. కొద్ది సేపు అలాగే వేడి చేయాలి . వేడి చేసిన అనంతరం ఆ టీని తాగాలి.

3.అశ్వగంధం టీ

ఆయుర్వేద పద్దతుల్లో అశ్వగంధం అనే పదాన్ని తరుచూ వింటుంటాం. అశ్వగంధం అనేది ఓ చెట్టు వేర్లు. ఆ చెట్ల వేర్లు, పొడి మనకు ఆయుర్వేద షాపుల్లో దొరకుతుంది. ఆ పొడితో తయారు చేసిన టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాదు, శరీరంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది.

కావాల్సిన పదార్ధాలు

అశ్వగంధం వేర్లు, లేదా పొడి

ఒక టీ స్పూన్ తేనె

తయారు చేసుకునే విధానం 

ఒక కప్పు నీటిలో అశ్వగంధం పొడి, లేదా వేర్లను ఉడికించాలి. తగినంత సేపు మరగబెట్టిన తరువాత ఆ నీటిలో తేనె కలుపుకొని తాగాలి.

4. తులసి టీ

తులసి టీ  ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాదు చర్మ సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, షుగర్ లెవల్స్ ను కంట్రోల్  చేస్తుంది

కావాల్సిన పదార్ధాలు  

1/4 కప్పు తులసి

1 స్పూన్ తేనె

2 స్పూన్ నిమ్మరసం

తయారు చేసుకునే విధానం

తగినంత నీటిలో తులసి ఆకుల్ని కలిపి బాగా మరిగించాలి. తగినంత సేపు మరిగించిన నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి.

5.పుదీనా టీ

పుదీనా మరియు రోజ్మేరీ తో చేసిన టీ తాగడం వల్ల  జ్ఞాపక శక్తి  మెరుగుపడుతుంది. పొట్ట ఉబ్బరంగా ఉన్నా, నొప్పితో బాధపడుతున్న, డైజేషన్ సమస్యలతో బాధపడుతున్న సమయంలో పుదీనా టీ ఉపయోగపడుతుంది.

కావాల్సిన పదార్ధాలు

తగినతం పుదీనా ఆకులు

రోజ్మేరి ఆకులు

నిమ్మకాయ

తయారు చేసుకునే విధానం :

తగినంత నీటిలో తుంచిన పుదీనా ఆకుల్ని ఉడికించాలి. ఉడికించిన నీటిలో పుదీనా జాతికి చెందిన రోజ్మెరీ ఆకుల్ని కలిపి కొద్ది సేపు మరగబెట్టాలి. మరగబెట్టిన నీటిలో  నిమ్మరసాన్ని కలుపుకొని తాగాలి.

see more

yoga for constipation | మోషన్ ఫ్రీ చేసే యోగా ఆసనాలు (వీడియో)

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest