Hanta virus in china: చైనాలో కొత్త వైరస్…హంటా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రపంచ దేశాలు చైనా అంటే చాలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ తో వైద్యమో రామచంద్రా అని ప్రజలు మొత్తుకుటుంటే ..చైనా నుంచి కొత్తగా పుట్టుకొచ్చిన  హంటా వైరస్ మరింత కలవరానికి గురిచేస్తుంది.

చైనా యున్నన్ ప్రావిన్స్ షాండాగ్ కు చెందిన బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి హంటా వైరస్ సోకి మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది. బాధితుడు ప్రయాణిస్తున్న బస్సుల్లో 32మంది ప్రయాణికులు ఉన్నారని, వారికి కూడా హంటా వైరస్ టెస్ట్ లు చేస్తున్నారు. ఆ టెస్ట్ లు పూర్తయి తే హంటా వైరస్ తీవ్రత ఎలా ఉందనేది తెలుస్తోంది.

హంటా వైరస్ దశాబ్దాలు గా ఉంది

మాన్హాటన్ కు చెందిన  NYU లాంగోన్ హెల్త్ సంస్థకు చెందిన డాక్టర్ తానియా ఇలియట్ మాట్లాడుతూ హంటా వైరస్ వాస్తవానికి  శతాబ్దాలుగా ఉన్నట్లు చెప్పారు. ఇది చైనాలో ఎక్కువగా 16,000 నుండి 100,000 కేసులు నమోదైనట్లు చెప్పారు.

కరోనా వైరస్ లా కాదు

కరోనా వైరస్ లా హంటా వైరస్ అంత ప్రమాదకరం కాదని తానియా చెప్పారు. కరోనాలా  దగ్గు లేదా తుమ్ముతున్నప్పుడు వ్యక్తి నుంచి వచ్చి తుంపరల ద్వారా వ్యాపిస్తుంది. కానీ హంటా వైరస్ ప్రధానంగా ఎలుకలు మరియు వాటి మూత్రం, మలం లేదా లాలా జలంతో  ద్వారా వ్యాపిస్తుందని చెప్పారు. అయితే ఇప్పటి వరకు  హంటా వైరస్ (హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్) కేసులు నమోదు కాలేదన్న ఆమె.. ఈ వైరస్ కు మెడిసిన్ ఉందని అంతగా భయపడాల్సిన అవసరం లేదన్నారు.

హంటా వైరస్ అంటే ఏమిటి?

. “ఓల్డ్ వరల్డ్” హంటా వైరస్ లు  అని పిలువబడే ఇతర హంటా వైరస్ లు  ఎక్కువగా ఉన్న ఎలుకలు యూరప్,  ఆసియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ వైరస్ ప్రధానంగా ఎలుకల నుంచి వ్యాపిస్తుంది . ముఖ్యంగా U.S. లో డీర్ మౌస్ అనే ఎలుక ద్వారా సోకుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలలో వివిధ వ్యాధులకు కారణమవుతుంది. ఎలుకల్లో ఎక్కువగా ఉండే హంటా వైరస్ ను  అమెరికా “న్యూ వరల్డ్” హంటా వైరస్ అని పిలుస్తారు.

హంటా వైరస్ లక్షణాలు

వైరస్ సోకిన ప్రారంభ దశలో అలసట, జ్వరం, కండరాల నొప్పి, దగ్గు మరియు శ్వాస ఆడకపోవడం, haemorrhagic fever with renal syndrome (hfrs) తో తీవ్రమైన తలనొప్పి, వీపు మరియు కడుపు నొప్పి, జ్వరం, చలి, వికారం, చూపు మందగించడం లాంటి సమస్యలు తలఎత్తతాయి.

 హంటా వైరస్ ఎలా సోకుతుంది 

మనుషులుకు ఈ హంటా వైరస్ అప్పుడప్పుడు సోకుతుందని Centres for Disease Control and Prevention ( సీడీ సీ) తెలిపింది.  చాలా తరచుగా గ్రామీణ ప్రాంతాల్లో అడవులు, పొలాల్లో ఎలుకలు గూడుకట్టుకుంటాయి. ముఖ్యంగా యుఎస్ లో డీర్ మౌస్ అనే ఎలుక పత్తి, బియ్యం నిలువ ఉంచిన ప్రాంతాల్లో జీవిస్తుంది. డీర్ మౌస్, ఫుట్ మౌస్ అని పిలిచే ఎలుకల ద్వారా హంటా వైరస్ సోకుతుంది.

ఇళ్లను శుభ్రం చేస్తే అంతే సంగతులు  

డీర్ మౌస్, ఫుట్ మౌస్ అని పిలిచే ఎలుకలు ఇళ్లు, పాడుబడ్డ భవంతులు, షెడ్లలో తన నివాసాన్ని ఏర్పరచుకుంటాయి. పొరపాటు వాటిని శుభ్ర చేసే సమయంలో ఎలుకల్ని ముట్టుకోవడం గాని, ఎలుకల లాల జలం, మల మూత్రాల్ని వాసన చూడడం ద్వారా వైరస్ సోకుతుంది. ఈ వైరస్ ముఖ్యంగా యుటిలిటీ మరియు పెస్ట్ కంట్రోల్ కార్మికులకు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నట్లు తేలింది.

హంటా వైరస్ కు కారణమైన ఎలుకల లాల జలాన్ని ముట్టుకున్న, ఎలుకల మల మూత్రంతో కలుషితమైన నీటిని తాగడం వల్ల, వాటి నోటిని ముక్కును తాకడం వల్ల హంటా వైరస్ సోకుతున్నట్లు సైంటిస్ట్ లు చెబుతున్నారు.

హంటా వైరస్ పై జాగ్రత్తలు ..? వ్యాక్సిన్ ..?

అలసట, జ్వరం, కండరాల నొప్పి, దగ్గు మరియు శ్వాస ఆడకపోవడం, haemorrhagic fever with renal syndrome (hfrs) తో తీవ్రమైన తలనొప్పి, వీపు మరియు కడుపు నొప్పి, జ్వరం, చలి, వికారం వంటి లక్షణాలతో హంటా వైరస్ సోకిన బాధితుణ్ణి ఐసీయూలో ఉంచాలని, బ్రితింగ్ సమస్యలుంటే ఆక్సిజన్ థెరపీని చేస్తారని సీడీ సీ తెలిపింది.

హంటా వైరస్ ప్రమాదం ఎవరికి ఉంది?

దురదృష్టవశాత్తు హంటా వైరస్ ఉన్న ఎలుకల లాలాజలం, మల మూత్రం, ఆ ఎలుకలున్న ప్రాంతాల్ని వాసన చూసినా వైరస్ సోకుతుందని, వాటిలో పల్మనరీ సిండ్రోమ్ (హెచ్ పిఎస్) వచ్చే అవకాశం ఉంది.  ఎలుకల నుంచి కారే బిందువులు, మూత్రం, లాలాజలం తాకడం వల్ల వైరస్ సోకుతుంది.  యుఎస్‌ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వైరస్‌   ఎక్కువగా ఉన్నట్లు తేలింది.  2012లో సోకిన వైరస్ ఇటీవల యోస్మైట్ నేషనల్ పార్క్ సందర్శించిన వ్యక్తులలో 10 కేసులు,2017లో 11 కేసులు నమోదయ్యాయి.   కొలరాడో, జార్జియా, ఇల్లినాయిస్, అయోవా, మిన్నెసోటా, ముస్సూరీ, పెన్సిల్వేనియా, సౌత్ కరోలినా, టేనస్సీ, ఉటా మరియు విస్కాన్సిన్ లో హంటా వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నాయి.

హంటా వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఎలుకలు నివాసం ఉంటున్న ప్రాంతాలను శుభ్రం ఉంచుకోవడం చాలా ఉత్తమం, ఎలుకలు నివాసం ఉంటున్న కలుగుల్ని పూడ్చడం మంచిది. ఎలుకలు ఇంట్లోకి ప్రవేశించకుండా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉచ్చులు ఏర్పాటు చేయాలి.

ఎలుకలు నివాసం ఉంటున్న ప్రాంతాన్ని శుభ్రం చేసే 30నిమిషాల ముందు వెంటిలేట్ , తలుపులు, కిటికీలు తెరవాలి. చేతులకు రబ్బరు గ్లౌజులు తొడుక్కొని శుభ్రం చేయాలి. ఎలుకల మలాన్ని పేపర్ టవల్ తో తీసివేయాలి. ఆ ప్రాంతాన్ని క్రిమి సంహారక మందు లేదా బ్లీచింగ్ ఫౌడర్ చల్లాలి.  ఎలుకలు లేదా వాటి మూత్రం మరియు బిందువుల ద్వారా కలుషితమైన వస్తువులను క్రిమిసంహారక చేయండి. ఇలా చేయడం వల్ల వైరస్  సోకకుండా అరికట్టవచ్చు.

 

One Comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest