coconut water health benefits | ప్రతీ రోజూ కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుంతో తెలుసా..?

సామాన్యుడి కూల్ డ్రింక్ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లలో  విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, ఎంజైములు, ఎమినో యాసిడ్‌లు, సైటోకిన్ అధికంగా ఉన్నాయి. అందుకే కొబ్బరి నీళ్లను ఆరోగ్య ప్రధాయని అని పిలుస్తారు. అయితే ఈ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందామా..?

health benefits of coconut water

రోగ నిరోదక శక్తి పెరుగుతుంది.

అనారోగ్య సమస్యలను తట్టుకునే శక్తి, సామార్ధ్యాల్ని అందిస్తాయి కొబ్బరి నీళ్లు. అంతేకాదు చిగుళ్ళ సమస్యలు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే శరీరంలోని బ్యాక్టీరియాను తొలగించే సామర్థ్యం  ఉంది. కొబ్బరి నీళ్లు జలుబు,  టైఫస్ లేదా అంటు వ్యాధులను ఎదుర్కోవడంలో సాయం చేస్తుంది.

ఎనర్జీని ఇస్తాయి

కొబ్బరి నీరు థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను పెంచుతుంది.  ఎనర్జీని ఇస్తాయి. కొబ్బరి నీళ్లు తాగితే ఇంతకు ముందు కంటే ఎంతో ఎనర్జీగా ఉండేలా చేస్తాయి.

కిడ్నీల్లో రాళ్లను కరిగిస్తుంది.  

కొబ్బరి నీరు శరీరం నుండి మలినాల్ని తొలగిస్తాయి. మూత్రపిండాల్లో (కిడ్నీలు) రాళ్లను కరిగిస్తాయి. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు కొబ్బరినీళ్లు చక్కగా ఉపయోగపడతాయి.  మూత్ర నాళాన్ని, మూత్రాశయ ఎముకల్ని  శుభ్రపరుస్తాయి.

 అరుగుదలను అరికట్టవచ్చు

అజీర్తి, డైజేషన్ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగితే ఉపశమనం పొందుతారు. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల తిన్న ఆహారం  జీర్ణమయ్యేందుకు ఉపయోగపడతాయి. శరీరానికి అవసరమయ్యే  ఫైబర్ ను రోజు మొత్తంలో అందించడం సాధ్యం కాదు. కానీ కొబ్బరినీళ్లు తాగితే వారం రోజుల ఫైబర్ ను సొంతం చేసుకోవచ్చు

మీరు బరువు కోల్పోతారు

ఈ రోజుల్లో అధిక బరువు, మధుమేహం అనేది చాలా కామన్. రకరకాల కారణాల వల్ల విపరీతమైన బరువు పెరుగుతుంటారు. దీంతో వారు బరువును తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు. అలాంటి వారు ఆహారపు అలవాట్లు పాటిస్తూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారని వైద్యులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లను కొవ్వు కరిగించే శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి. దీంతో కొవ్వు కరిగి నాజుగ్గా తయారవుతారు.

ఆకలిని తగ్గిస్తుంది.

చాలా మందికి తినే సమయం లేకపోవడం, ఆకలిగా ఉందని ఏది దొరికితే అది తింటుంటారు. అలాంటి వారు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆకలి నుంచి బయటపడొచ్చు. ఒక్కసారి కొబ్బరి నీళ్లు తాగితే రోజంతా ఎనర్జీగా ఉండొచ్చు.

తలనొప్పిని మటుమాయం చేసే కొబ్బరి నీళ్లు

తలనొప్పితో బాధపడేవారు కొబ్బరి నీళ్లతో సమస్యనుంచి భయటపడొచ్చు. తలనొప్పి వస్తుందంటే కొబ్బరి నీళ్లు తాగండి. కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి ఉపయోగపడతాయి.   మీ తలనొప్పితో పాటు ఒత్తిడిని దూరం చేస్తుంది.

హ్యాంగోవర్ నుంచి బయట పడేస్తాయి.

విపరీతంగా డ్రింక్ చేయడం వల్ల హ్యాంగోవర్ సమస్య వేధిస్తుంది. హ్యాంగోవర్ తో బాధపడేవారు కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఆ సమస్య నుంచి భయటపడొచ్చు. కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్-బ్యాలెన్సింగ్ పోషకాలు హ్యాంగోర్ నుంచి బయట పడేస్తాయి.

అందాన్ని పెంచుతాయి

కొబ్బరినీళ్లు అందాన్ని పెంచేందుకు చక్కగా ఉపయోగపడతాయి. శరీరం హైడ్రేట్ కాకపోవడం వల్ల చర్మం పొడి ఆరిపోతుంది. దీంతో మొహం మీద ఉన్న చర్మం ముడతలు ఏర్పడతాయి. ముసలివారిలా కనిపిస్తారు.  మీరు రోజూ కొబ్బరి నీళ్ళు  తాగడం వల్ల గ్లామర్ గా తయారవుతారు. అంతేకాదు శరీరం అంతా ఆరోగ్యంగా ఉండే నిగనిగలాడే చేస్తాయి.

కంటి సమస్యల్ని దూరం చేస్తాయి.

కంటి చూపు సమస్యతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆ సమస్యను అధిగమించ వచ్చు. అంతే కాదు  గ్లకోమా మరియు కంటిశుక్లం వంటి  సమస్యలను తిప్పికొట్టే సామర్థ్యం కొబ్బరి నీళ్లకు ఉంది. దీంతో పాటు గుండెపోటు ప్రమాద స్థాయిల్ని తగ్గిస్తాయి. వృద్ధాప్యంగా కనిపించే వారు కొబ్బరినీళ్లు యవ్వనంగా మారుస్తాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest