China Bat Women : కరోనా వైరస్ కు కారణం గబ్బిలాలే..!

కరోనాకి మనలాగా కన్ ఫ్యూజన్ లేదు మూర్తి. నువ్వు మంచోడివా, చెడ్డోడివా, మాస్క్ ఉందా లేదా అని చూడదు. నీ దగ్గర హిమ్యూనిటీ పవర్ ఉందా లేదా..? హోంక్వారంటైన్ లో జాగ్రత్తలు తీసుకుంటున్నా లేదా..?  ఇవి ప్రస్తుతం కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో ట్రెండ్స్ అవుతున్న మీమ్స్. వైరస్ భయాందోళనలో ఉన్న నెటిజన్స్ కరోనా పై మీమ్స్ చూసి కాస్త రిలాక్స్ అవుతున్నారు. కానీ ఆ రిలాక్స్ వెనుక ఎంతో విషాదం ఉంది.

2019 డిసెంబర్ చైనా వుహాన్ నగరం నుంచి ప్రారంభమైన ఈ వైరస్  ప్రపంచ వ్యాప్తంగా పొట్టన బెట్టుకుంది. ఇంత మంది మృతికి కారణమైన  ఈ వైరస్ ఎలా వచ్చింది..? దీన్ని హతమార్చే వ్యాక్సిన్లు ఎప్పుడు అందుబాటులో తీసుకురావాలనే  అనే అంశాలపై సైంటిస్ట్ లు పరిశోధనలు జరుపుతున్నారు.

సార్స్ పై ప్రయోగాలు 

అయితే  ఈ నేపథ్యంలో గబ్బిలాలతో పాటు చైనా వాసులు తినే ఆహారపు అలవాట్ల కరోనా వైరస్ సోకినట్లు అనుమానం వ్యక్తం చేశారు. చైనాకు చెందిన సైంటిస్ట్.

చైనాలో ఎలాంటి ప్రమాదకరమైన వైరస్ అంటే ముందుగా గుర్తొచ్చేది  షీ – జెంగ్లీ. చైనా దేశస్థులు ఆమెను ముద్దుగా బ్యాట్ ఉమెన్ అని పిలుచుకుంటుంటారు. 16ఏళ్లుగా ప్రమాదకరమైన వైరస్ లపై పరిశోధనలు చేస్తున్నారు.  2003లో సార్స్ వైరస్ సోకి సుమారు 10శాతం మంది ప్రజలు మరణించారు. అదే సమయంలో వైరస్ లపై పరిశోధనలు జరుపుతున్న షీ- జెంగ్లీ ..సార్స్ వైరస్ పుట్టు పూర్వత్రాలపై అన్వేషణ ప్రారంభించారు. రోజుల తరబడి యునాన్ నగర గుహల్లో ఉన్న రకరకాల పక్షులతో పాటు గబ్బిలాల నమూనాల్ని సేకరించారు. ఆ నమూనాలపై జరిపిన పరిశోధనల్లో సార్స్ వైరస్ గబ్బిలాల నుంచే వచ్చిందని గుర్తించి వ్యాక్సిన్ ను తయారు చేశారు. ఆ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంలో జెంగ్లీ కీరోల్ ప్లే చేశారు.

ఇప్పుడు తన విలయ తాండవంతో ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న కరోనా వైరస్ షీ- జెంగ్లీ పరిశోధనలు చేస్తున్నారు.

అది 2019 డిసెంబర్ 30న చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆస్పత్రికి ఇద్దరు రోగులు విలక్షణమైన లక్షణాలతో వచ్చారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ..కొత్త వైరస్  ఉండడంతో అనుమానం వ్యక్తం చేసిన వైద్యులు షి- జెంగ్లీ పనిచేస్తున్న ఊహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ కు పంపించారు.

గబ్బిలాల నుంచే కరోనా పుట్టినట్లు అనుమానం 

అదే సమయంలో షాంఘైలో హాజరవుతున్న కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు వెళుతున్న  షీ జంగ్లీకి  ఊహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ డైరెక్టర్ ఫోన్ చేశారు. త్వరగా ల్యాబ్ కు రావాలని, కొత్త వైరస్ తో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తుల బ్లడ్ శాంపిల్స్ ఉన్నట్లు ఫోన్ కాల్ సారాంశం. డైరెక్టర్ చెప్పారో లేదో ఏ మాత్రం ఆలస్యం చేయని షీ – జంగ్లీ.. ఊహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ వచ్చారు. అనంతరం ల్యాబ్ లో ఉన్న బ్లడ్ శాంపిల్స్ ను పరిశీలించగా కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమని నిర్ధారించారు.

ఎందుకంటే ఇది గబ్బిలాల నుంచి వచ్చిన వైరస్ అని అనుమానం వ్యక్తం చేశారు.  గతంలో సోకిన సార్స్ కుటుంబానిదేనని తేల్చారు. ఈ సందర్భంగా బ్యాట్ ఉమెన్ మాట్లాడుతూ ఈ “మధ్య చైనాలోని వుహాన్‌లో ఇలాంటివి జరుగుతాయని నేను ఎప్పుడూ ఊహించలేదు.” తమ అధ్యయనాల ప్రకారం  గువాంగ్డాంగ్, గ్వాంగ్క్సీ మరియు యునాన్ యొక్క దక్షిణ, ఉప ఉష్ణమండల ప్రాంతాలలో  గబ్బిలాల నుండి వచ్చే అనేక వైరస్ లు స్థానిక జలాశయాల్లో కలవడం , ఆ నీటిని ఊహాన్ ప్రజలు ఉపయోగించడం వల్ల కరోనా వైరస్ పుట్టుకొచ్చిందనే అనుమానం వ్యక్తం చేశారు.  ప్రస్తుతం ఆ వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు షీ- జంగ్లీ పరిశోధనలు జరుపుతున్నారు.

బ్యాట్ ఉమెన్ కోసం ఎదురు చూస్తున్న  198 దేశాలు 

బ్యాట్ ఉమెన్ పరిశోధనలపై 198దేశాల  ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రోజు రోజుకి వైరస్ ప్రభావం ఎక్కువ కావడంతో..ఆయా దేశాలకు చెందిన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని కట్టడి చేసేందుకు లాక్ డౌన్ ప్రకటించిన కంట్రోల్ కాకపోవడంతో షీ జంగ్లీ చేస్తున్న పరిశోధనల్లో ఏమైనా కొత్త అంశాలు వెలుగులో వస్తాయని భావిస్తున్నారు.

 see this: చైనాలో కొత్త వైరస్…హంటా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

see this:  బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest