kidney failure symptoms | ప్రారంభ దశలో కిడ్నీ వ్యాధిని గుర్తించడం ఎలా

మన శరీరంలో గుండె తరువాత అతి ప్రధాన అవయవాలు కిడ్నీలు.కీడ్నీలు పాడై తే ఒక్కో సమస్య మొదలవుతుంది. ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులు సైలెంట్ కిల్లర్స్ వంటివి ని శబ్ధంగా కబళిస్తాయి. జీవన ప్రమాణంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. మన కిడ్నీలు బాగుండాలంటే శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడంతోపాటు రోజూ వారి ఆహార నియమాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కిడ్నీలకు ఉపయోగపడే ఆహారాల్ని తరచూ తీసుకోవడం వల్ల కిడ్నీ వ్యాధులను నివారించుకోవచ్చు. కిడ్నీలో రాళ్లు, ఇన్ఫెక్షన్లవంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. అయితే కిడ్నీ సమస్యలు ఎన్ని రకాలు..? కిడ్నీ సమస్య ఉందా లేదా తెలుసుకోవాలంటే ఏ పరీక్ష  చేయించుకోవాలి…? అనే అంశాల గురించి తెలుసుకుందాం.

మానవ శరీరంలో కిడ్నీల పాత్ర అమోఘం. శరీరంలో ఉండే కిడ్నీలు ప్రతిరోజు దాదాపు 200లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంటాయి. ఇవి నిరంతరం నిరంతరాయంగా పనిచేస్తుంటాయి. ఉద్దండ పిండాలైన ఈ కిడ్నీలు పాడై తే మనిషి జీవితంలో సగభాగం అంతమైన ట్లేనని చెబుతారు వైద్యులు. హై బీపీ, షుగర్, ఇతరత్రా ఇన్ఫెక్షన్ల కారణంగా కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. కిడ్నీ ఫెయిల్యూర్ రెండు విధాలుగా జరుగుతుంది

  1. సడన్ గా కిడ్నీ ఫెయిల్యూర్
  2. నిదానంగా కిడ్నీ ఫెయిల్యూర్

సడన్ కిడ్నీ ఫెయిల్యూర్:  సడన్ గా కిడ్నీ ఫెయిల్ అయితే డయాలసిస్ తో రెండు వారాల తరువాత ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఉదాహరణ: పాము కాటు వల్ల కిడ్నీ ఫెయిల్ అయితే పరిమాణం సైజ్ తగ్గుతుంది.  డయాలసిస్ చేయించుకుంటే నార్మల్ స్థితికి వస్తుంది. దీన్ని సడన్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు.

నిదానంగా కిడ్నీ ఫెయిల్యూర్ :   డైలీ నాన్ వెజ్,  ఒబేసిటీ, శరీరానికి పని కల్పించకుండా స్ట్రెస్ ఎక్కువగా తీసుకొని బీపీ, షుగర్ పెరగడం వల్ల నిదానంగా కిడ్నీ ఫెయిల్ అవుతుంది. అలా సాధారణంగా కిడ్నీ పరిమాణం  10సెంటీమీటర్లు ఉండాలి. పాడై తే కిడ్నీ పరిమాణం తగ్గుతుంది. అలా తగ్గిన కిడ్నీ పరిమాణం  5 సెంటీమీటర్లు అయితే ప్రమాదమనే చెప్పుకోవాలి.

కిడ్నీ ఫెయిల్ అయితే కనిపించే లక్షణాలు : రోజు యాక్టివ్ గా ఉండే వ్యక్తి ఒక్కసారి మైకంలోకి వెళ్లిపోవడం, ఎదుటి వారిని గుర్తించలేకపోవడం, ఒళ్లు నొప్పులు , లేజీగా ఉండడం, మొహం అంతా ఉబ్బడం, కాళ్లల్లో వాపు రావడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, అలసట, మొహం అంతా ఆకుపచ్చరంగులోకి మారిపోవడం,నాలుక పాలిపోవడం, ఫేస్ లో మార్పులు, హెయిర్ కలర్ చేంజ్ అవ్వడం, డ్రై ఐస్ ఉండడం, చేతి గోళ్లు హారిజంటల్ కలర్ లోకి మారిపోవడం ఈ సమస్యలు కనిపిస్తే కిడ్నీ ఫెయిల్యూర్ అని గుర్తించాలి.

ఏ వయసు వారు కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి

kidney failure symptoms
how to find kidney disease with symptoms in telugu

 

 

 

 

 

 

 

 

కిడ్నీ పరీక్ష వయసుతో సంబంధం ఉండదు. ఏ వయసులోని వారైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా 35సంవత్సరాలు దాటిన ప్రతీ ఒక్కరు సంవత్సరానికి ఒకసారి క్రియాటినిన్ టెస్ట్ చేయించుకోవాలి. చిన్నపిల్లలో కిడ్నీ జబ్బులు చాలా అరుదుగా వస్తుంటాయి. 10 నుంచి 25మధ్యలో వచ్చే సమస్యలు కఠిన తరంగా ఉంటాయి. 20ఏళ్ల వయసులో వచ్చే జబ్బులు కష్టంగా ఉంటాయి. 40వచ్చే సమస్యలు పర్మినెంట్ గా ఉంటాయి. 60తరువాత వచ్చే జబ్బులు చాలా ఉదృతంగా ఉంటాయి.

 కిడ్నీ ఆరోగ్యం గురించి చేయించుకోవాల్సిన పరీక్షలు

క్రియాటినిన్ బ్లడ్ యూరిన్ టెస్ట్ : సాధారణంగా మన కిడ్నీ గురించి తెలుసుకోవాలంటే వైద్యుల పర్యవేక్షణలో కొన్ని టెస్ట్ లు చేయించుకోవాల్సి వస్తుంది. వాటిలో క్రియాటీనిన్ బ్లడ్ యూరిన్ టెస్ట్. 100ఫీజుతో ఈ టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ లో క్రియాటినిన్ బ్లడ్ ఆరోగ్యంగా ఉన్న వాళ్లకి 1ఉండాలి. 1.5 ఉంటే కిడ్నీ సమస్య ప్రారంభ దశలో ఉన్నట్లు, 2 పాయింట్లలో ఉంటే సగం కిడ్నీ పాడైనట్లు, 4 పాయింట్లలో అంటే చాలా పాడైనట్లు, 8 పాయింట్లు  వచ్చిందంటే కిడ్నీ కంప్లీట్ గా ఫెయిల్ అయినట్లు గా గుర్తించాలి.

 హిమోగ్లోబిన్: హిమోగ్లోబిన్ టెస్ట్ లో ఆరోగ్యంగా ఉంటే 14పాయింట్లు ఉంటాయి. కానీ హిమోగ్లోబిన్ తక్కువైతే పాయింట్లు తగ్గిపోతుంటాయి. 14ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు, 9ఉంటే ఎక్కడో బ్లీడింగ్ అవుతుందని గమనించాలి.

రీజనల్ ఫంక్షన్ టెస్ట్ : మన కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే 5 టూ 1.5 రేంజ్ ఉంటాయి. ఈ టెస్ట్ లో 1.5 రేంజ్ దాటి పోతే కిడ్నీలు అనారోగ్యంగా ఉన్నట్లు గుర్తించాలి.

హిమోగ్లోబిన్ 14, 9ఉంటే ఎక్కడో బ్లీడింగ్ అవుతుందని గమనించాలి. పై టెస్ట్ ల ఆధారంగా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది  ప్రారంభ దశలో గుర్తించినప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.

కిడ్నీ గురించి తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి |మీ కిడ్నీలను ఇలా కాపాడుకోండి

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest