How To Get Flat Stomach | మీ పొట్ట సన్నగా, నాజూగ్గా ఉండాలంటే

మీ పొట్ట ఫ్లాట్ గా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లేనని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా మన వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. వాటిలో ప్రధానమైంది పొట్ట.

వయసు తో పాటు రకరకాల కారణాల వల్ల మన పొట్ట బరువు విపరీతంగా పెరిగిపోతుంటుంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వచ్చి పడుతుంటాయి. శరీరంలో ముఖ్యమైన అవయవాలన్నీ పొట్ట చుట్టూ ఉంటాయి. పొట్ట పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడంతో.. ముఖ్యమైన అవయవాల్లోకి కొవ్వు చేరి అనేక అనారోగ్యాలకు కారణమవుతాయి. అందుకే పొట్ట ఫ్లాట్ గా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు చెప్పేది.

అయితే ఇప్పుడు మీ పొట్ట ఫ్లాట్ గా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.  నార్మల్ ఫుడ్ తో డైట్ మెయింటైన్‌చేస్తూ ఫ్లాట్ టమ్మీని పొందడం కష్టమే కానీ ఈ టిప్స్ పాటించడం వల్ల పొట్టను మీరు అనుకున్నట్లు గా  మార్చుకోవచ్చు.

ఇంకెందుకు ఆలస్యం మీ పొట్టను ఫ్లాట్ గా మార్చి ఆకర్షణీయంగా కనిపించేలా చేసే టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏరోబిక్ వ్యాయామాలు

నడక, నార్మల్ గా పరిగెత్తడం, ఈతకొట్టడం, సైక్లింగ్, మెట్లు ఎక్కడం, మెట్లు దిగడం లాంటి వ్యాయామాలు చేయడం వల్ల మీ కేలరీలు బర్న్ అయ్యి పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి..పొట్ట ఫ్లాట్ గా ఉండేలా చేస్తుంది.

ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తినాలి

ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల పొట్ట క్లీన్ గా  ఉంటుంది. కొవ్వు లేకుండా చేస్తుంది. దీంతో అన్నీ రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందొచ్చు. ముఖ్యంగా డయాబెటీస్, ఊబకాయం, క్యాన్సర్, హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకోవచ్చు.  

తక్కువ పిండి పదార్ధాలు లేదా కార్బొహైడ్రేట్స్

తక్కువ పిండి పదార్ధాలు లేదా కార్బొహైడ్రేట్స్ ను తీసుకోవడం వల్ల పొట్ట పెరగకుండా కాపాడతాయి. అలా అని ఆహారంలో కార్బొహైడ్రేట్స్ పూర్తిగా మానేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మనం తినే ఆహారం నుంచి శరీరానికి ప్రొటీన్లు, కొవ్వును అందించేందుకు పిండిపదార్థాలు ఉపయోగపడతాయి.

ప్రొటీన్లను అందించే ఆహారం తీసుకోవాలి

మన శరీరం కణజాలం, కండరాల పనితీరు బాగుండాలంటే ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తినాలి. ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల పొట్టతో పాటు శరీరంలో ఇతర భాగాల్లో కొవ్వు నిల్వ ఉండకుండా చేస్తుంది. పొట్టలో కొవ్వును కరిగించి ఫ్లాట్ గా ఉండేలా సహాయ పడుతుంది.

ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం: పాలు, గుడ్లు, మొక్కజొన్న, చికెన్ బ్రెస్ట్ భాగం, పిస్తా, వోట్స్, అవకాడో, బ్రోకలి, అన్నీ రకాల చిక్కుళ్లు మొదలైనవి.

నిలబడి వ్యాయామాలు చేయాలి

నిలబడి వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి. దీంతో పాటు కూర్చోవడం, నిలబడడం లాంటి వ్యాయామాలు చేయడం వల్ల పొట్టపై ప్రభావం చూపుతుంది. పొట్టలో కొవ్వు కరిగి ఫ్లాట్ గా తయారవుతుంది.

మీ శరీరాన్ని కష్టపెట్టండి

ఫ్లాట్ పొట్ట రావాలంటే తప్పని సరిగా శరీరాన్ని కష్టపెట్టాలి.   మనలో చాలామంది ఆఫీస్ లో కానీ, ఇంట్లో కానీ కూర్చొన్న చోటు నుంచి కదలరు. అలా గంటల తరబడి కూర్చోవడం వల్ల మన శరీరంలో ఉన్న కొవ్వుంతా పొట్ట భాగంలోకి చేరుతుంది. దీంతో మన పొట్ట బరువు పెరిగి కొవ్వు శాతం ఎక్కువవుతుంది. అలా కాకుండా ఉండాలంటే తప్పని సరిగా శరీరానికి పనిచెప్పాలి. కూర్చొన్న చోటు నుంచి కాసేపు నడవడం, మెట్లు ఎక్కడం దిగడం లాంటి పనులు చేయడం వల్ల మన పొట్టలోని కొవ్వు కరిగి ఫ్లాట్ గా ఆకర్షణీయంగా తయారవుతుంది.

కేలరీలను తగ్గించాలి

మనం తినే కొవ్వు పదార్ధాలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఆ కేలరీలను పూర్తిగా తగ్గించాలంటే ఆహార నియమాలు తప్పని సరిగా పాటించాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కాల్షియం, ఇనుము, విటమిన్లు చాలా అవసరం. ఓ వైపు మన శరీరానికి వాటిని అందిస్తూనే బరువు తగ్గడం, కొవ్వును కరిగించడం చాలా అవసరం.

కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు  

కూల్ డ్రింక్ లు, మద్యం, కాఫీలు, పాలతో తయారు చేసిన కూల్ డ్రింక్ లలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వాటికి బదులు మనం ఇంట్లోనే పండ్ల రసాల్ని తయారు చేసుకొని తాగొచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉన్న దినుసులతో జ్యూస్ చేసుకొని తాగడం ఇంకా మంచిది. ఉదాహరణకు నిమ్మరసం.

మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి

ప్రతీరోజు మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. ముఖ్యంగా భోజనానికి ముందు రెండు గ్లాసులు మంచి నీళ్లు తాగాలి. మంచినీళ్లు తాగడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. మితంగా అన్నం తినవచ్చు. ఫ్యాట్ ను దరిచేరకుండా కాపాడుకోవచ్చు. కుదిరితే పుల్లటి పండ్ల రసాల్ని తాగేందుకు ప్రయత్నించండి. పుల్లటి పదార్ధాల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. కొవ్వును దూరం చేస్తాయి. హిమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.

 ప్రతీ రోజు తప్పని సరిగా 30నిమిషాలు నడవాలి

ప్రతీ రోజు తప్పని సరిగా 30నిమిషాల పాటు నడవడం వల్ల పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. కొవ్వు కరగడమే కాకుండా ఒత్తిడిని జయించవచ్చు. మధ్యాహ్నం భోజన సమయానికి అరగంట ముందు నడవడం వల్ల ఎనర్జీ ఉండేలా చేస్తుంది. రాత్రి అన్నం తిన్న తరువాత నడవడం వల్ల జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది. కొవ్వును కరిగిస్తుంది.

అన్నం నెమ్మదిగా తినాలి

అన్నం ఎంత నెమ్మదిగా తింటే అంత మంచిదని వైద్యులు చెబుతున్నారు. అన్నం త్వరగా తినడం వల్ల జీర్ణక్రియ సరిగా పనిచేయదు. దానికి తోడు స్పీడ్ గా అన్నం తినడం వల్ల గాలి పొట్టలోకి వెళ్లి ఉబ్బరంగా ఉంది. కాబట్టి అన్నం నెమ్మదిగా తినాలి. వీలైతే అన్నాన్ని బాగా నమలాలి.


FOR MORE NEWS

FOR MORE  |  Yoga for Thighs And Hips | తొడలు & హిప్స్ ను తగ్గించే ఈజీ యోగా టిప్స్

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest