How To Lose Belly Fat : బెల్లీ ఫ్యాట్ ను కరిగించే సింపుల్ హెల్త్ టిప్స్

సమయ పాలన, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల నడుం చుట్టు కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. రోజు రోజుకి కొవ్వు పెరిగిపోతున్నా కొన్ని కారణాల వల్ల అసలు పట్టించుకోరు. అయితే ఆ కొవ్వు చాలా ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే నడుం భాగంలో మన శరీరాన్ని కాపాడే ముఖ్య అవయవాలన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి. కొవ్వు కంటెంట్ ఎక్కువైనప్పుడు.. ఆ కొవ్వు  అవయవాల్లోకి వెళ్లి  గుండె సంబంధిత వ్యాధులు, టైప్-2 డయాబెటీస్ లకు దారి తీస్తాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడం కొంచెం కష్టం.. కానీ చిట్కాలు పాటించడం వల్ల నడుం భాగంలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫైబర్

ఫైబర్ కంటెంట్  ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుందని, తద్వారా నడుం భాగంలో పేరుకుపోయిన కొవ్వును ఇట్టే కరిగించుకోవచ్చని  కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారం కొంచెం తిన్నా ఎక్కువగా తిన్నట్లు అనిపిస్తుంది. దీంతో బరువు తగ్గి, బెల్లి ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు. అమెరికా కు చెందిన ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ హెల్త్ లైన్ తెలిపిన వివరాల ప్రకారం..1100మందికి పైగా జరిపిన సర్వేలో 10గ్రాముల ఫైబర్ కంటెంట్ ను తినడం వల్ల ఐదు సంవత్సరాల కాలంలో  బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు దాదాపు 3.7శాతం కరిగినట్లు తెలుస్తోంది. కాబట్టి ఫైబర్ ఫుడ్ తినేందుకు ప్రయత్నం చేయండి

ఫైబర్ అధికంగా ఉన్నా ఆకుకూరలు, కూరగాయలు :

పాలకూర, తోటకూర, మొక్కజొన్న, యాపిల్స్, అవిశె గింజలు, తృణధాన్యాలు, బ్రోకలి, క్యాబేజీ

మందు మానేయాలి

మద్యం మానేయడం వల్ల బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఆల్కహాల్ తాగడం వల్ల బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడమే కాదు. స్థూలకాయం సమస్య వెంటాడుతుంది. మందు పూర్తిగా మానేయడం కష్టమే అయినా రోజూ తాగే వాళ్లు వారానికొకసారి, రెండు వారాలకి ఒకసారి తాగడం వల్ల కొవ్వును కరిగించుకోవచ్చు.

పోషక విలువలు కలిగిన ఆహారం

ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కంటెంట్ శాతం తక్కువగా ఉంటుంది. హార్మోన్ల  విడుదల చేయడం తో పాటు ఆకలిని తగ్గిస్తుంది. అంతేకాదు జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు: మాంసం, చేపలు, గుడ్డు, పాలఉత్పత్తలు ,బీన్స్

ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి

మనం ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో ఉండే అడ్రినల్ గ్రంథులు కార్టిసాల్ ను విడుదల చేస్తుంది. కార్టిసాల్ నడుం చుట్టు కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.  అంతేకాదు కొంతమంది మహిళల్లో నడుం భాగం పెద్దగా, మరి కొందరికి సన్నగా ఉంటుంది. నడుం భాగం పెద్దగా ఉన్న మహిళల్లో కార్టిసాల్ అధికంగా ఉత్పత్తి అవుతుందని దీంతో నడుం భాగంలో కొవ్వు విపరీతంగా పెరిగిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

తియ్యటి పదార్ధాలను తినడం తగ్గించాలి

కొంతమందికి తియ్యటి పదార్ధాలను విపరీతంగా తింటుంటారు. అలా తినడం వల్ల నడుం భాగంతో పాటు శరీరంలోని ఇతర భాగాల్లో కొవ్వు పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. షుగర్ లో ప్రక్టోజ్ అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువైతే  దీర్ఘకాలిక గుండెజబ్బులు, టైప్ 2 డయాబెటీస్, ఊబకాయం, లివర్ లో కొవ్వు చేరడం వంటి ప్రమాదాలకు కారణమవుతుంది. కాబట్టి షుగర్ కంటెంట్  ఎక్కువగా ఉన్న ఆహారాల్ని దూరం చేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. కానీ తియ్యని పదార్ధాల్ని మానేయాలంటే కష్టమే కాబట్టి.. వాటికి బదులు బెల్లం, పల్లిపట్టిలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేసినవారవుతారు.

ఏరోబిక్ వ్యాయామం 

నడుం భాగంతో పాటు శరీరంలో కొవ్వును కరిగించేందుకు ఏరోబిక్ వ్యాయామం చక్కగా ఉపయోగపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఏరోబిక్ వ్యాయామాలైన వాకింగ్, జాగింగ్, స్లో రన్నింగ్, స్విమ్మింగ్ లాంటివి చేయడం వల్ల శరీరంలో కొవ్వును కరిగించడంలో కీ రోల్ ప్లే చేస్తాయి.   ఓ అధ్యయనం ప్రకారం పీరియడ్స్ తరువాత మహిళలు వారానికి 300 నిమిషాలు ఏరోబిక్ వ్యాయామం చేసినప్పుడు శరీరంలో అన్నీ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతున్నట్లు తేలింది. మీ కార్బ్ తీసుకోవడం తగ్గించడం ఉదర కొవ్వుతో సహా కొవ్వును కోల్పోవటానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

కార్బో హైడ్రేడ్ 

కార్బో హైడ్రేడ్ ఎక్కువగా ఉన్న పదార్ధాల్ని తినడం వల్ల ఆరోగ్యం తో పాటు నడుం భాగంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అంతేకాదు టైప్-2 డయాబెటీస్, పీసీఓడీ సమస్యతో బాధపడేవారిలో కొవ్వును కరిగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

వెయిట్ లిఫ్టింగ్

వెయిట్ లిఫ్టింగ్ ఆరోగ్యంతో పాటు ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. ప్రి డయాబెటిస్, టైప్ 2, డయాబెటిస్, ఫ్యాటీ లివర్ తో బాధపడేవారు వెయిట్ లిఫ్టింగ్ చేయడంతో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టినట్లు తేలింది. వెయిట్ లిఫ్టింగ్ అంటే జిమ్ కే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న నీళ్ల బిందెలతో పాటు బరువుగా ఉన్న వస్తువులతో వెయిట్ లిఫ్టింగ్ ట్రైయ్ చేయవచ్చు.

హాయిగా నిద్రపోవాలి

ప్రెజెంట్ జనరేషన్ లో ప్రతీ ఒక్కరిని ప్రధాన సమస్య నిద్ర. రకరకాల కారణాల వల్ల నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. నిద్ర లేమి సమస్యతో బాధపడేవారిలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. రాత్రి 5గంటలు, పగలు ఏడు గంటలు అంతకంటే ఎక్కువగా నిద్రపోయే వారిలో కొవ్వు పెరుగుతుందని సర్వేలో తేలింది. ఎక్కువగా నిద్రపోవడం వల్ల శరీరంలో అవయవాలు పనితీరు సరిగా లేకపోవడంతో కొవ్వు పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత నిద్ర పోవాలి.

ఉపవాసం

పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు వారానికి ఒకరోజు, రెండ్రోజుల పాటు ఉపవాసం ఉంటుంటారు. అలా ఉపవాసం ఉండడం వల్ల శరీరంలో కొవ్వు కరిగిపోతుంది. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మాత్రం ఉపవాసం జోలికి పోవద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest