How to Lose Face FAT | ఈ టిప్స్ తో మీ ఫేస్ పై కొవ్వు మటుమాయం

అందం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. అయితే ఈ టెక్ యుగంలో  స్ట్రెస్, పొల్యూషన్ వల్ల మన మొహం పై ముడతలు పడడమే కాదు. కొవ్వు పేరుకుపోయి 30 ఏళ్లకే వయసు, అందం రెండూ ఆవిరైపోతున్నాయి.  దీంతో చూడడానికి ఇబ్బంది కరంగా ఉంటుంది.

అయితే మన ఫేస్ పై పేరుకుపోయిన కొవ్వును యోగాసనాల ద్వారా కరగించుకోవచ్చు. అందంగా కనబడవచ్చు.  కింద చెప్పే ఐదు యోగాసనాలు మొహం మీద కొవ్వును తగ్గించడమే కాదు.. యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

సింహ ముద్ర – మోకాలిపై కూర్చొని మీ రెండు చేతుల్ని ఎడమ మోకాలిపై ఎడమ చేయి. కుడి మోకాలిపై కుడి చేయి పెట్టాలి. అనంతరం మీ నాలుకను వీలైనంత వరకు బయటకు తీయండి. ఆ సమయంలో సింహాలా నోటితో గాలి పీల్చాలి. ఈ ఆసనం ద్వారా మీ ఫేస్ లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.

 ఫిష్ ఫేస్ – మన ఫ్రెండ్స్ సెల్ఫీలు దిగే సమయంలో ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ పెడుతుంటారు.  అందులో అలిగినట్లు, పెదవి విరుస్తూ ఇలా పెడుతుంటారు.  అలా పెట్టడం చాలా మంచిది. చేప నోరు ఎలా పెడుతుందో అలా పెట్టడం వల్ల ఫేస్ పై ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

మౌత్ వాష్ టెక్నిక్ (అయిల్ పుల్లింగ్)  – ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే నోట్లో నీటిని నింపుకొని బుగ్గల్ని అటుఇటు 20 నుంచి 30 సెకన్ల పాటు తిప్పండి.  అనంతం కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్లీ ప్రారంభించండి. అలా వీలు కుదిరినప్పుడల్లా చేయడం వల్ల మన మొహంపై ఉన్న చర్మం లోపలి భాగంలో ఉన్న కొవ్వు పింపుల్స్, జిడ్డు, చెమట రూపంలో బయటకు వస్తుంది.

జీవా బంధ – ఈ యోగా ఫోజ్ లో మీ నాలుకను కొద్దిగా బయటకు పెట్టి అటూ ఇటూ తిప్పుతూ ఉండాలి. అదే సమయంలో మీ ముక్కుతో గాలిపీల్చడం వల్ల మీకు ఎలాంటి సమస్యా ఉండదు.

దవడతో యోగా అంటే పళ్లు కొరకడం అన్నమాట. పళ్లు కొరికితే..మొడ చుట్టు ఎముకలు బయటకు వస్తాయి. అలా చేయడం వల్ల ఫేస్ లో ఫ్యాట్ కరిగిపోతుంది. యవ్వనంగా కనిపిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest