relieve constipation naturally | పిల్లల్లో మలబద్ధకాన్ని జాడించి తన్నే అద్భుతమైన చిట్కా

రోజూ రెండు మూడు సార్లైనా  బాత్‌రూం తలుపు తట్టే పిల్లలు రెండు మూడు రోజులైనా ఆ ఊసే ఎత్తకపోతే ఏ తల్లి మనసైనా కుదురుగా ఉండదు.  బిడ్డకు ఏమైందో నని ఆందోళన పడుతుంటారు. టాయిలెట్ కు వెళ్లినా మల విసర్జన కోసం బలంగా ముక్కుతూ మూలుగుతూ బాధపడుతుంటారు. నిజానికి పిల్లల్లో కనిపించే మలబద్ధకానికి తాగే పూత పాల దగ్గర నుంచి తల్లిదండ్రులు తినిపించే తిండి వరకు చాలా కారణాలే ఉంటాయని కారణాలు చెబుతుంటారు వైద్యులు. ఇటు పిల్లల్ని అటు పెద్దల్ని వేధించే మలబద్ధకానికి కారణాలేంటో తెలుసుకుందాం.

మలబద్ధకానికి కారణాలు

malabaddakam nivarana telugu

చందమా రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే అంటూ పిల్లలకు గోరు ముద్దలు తినిపించే రోజులు ఇప్పుడు లేవనే చెప్పాలి. ఇప్పుడంతా రెడీమేడ్ ఫుడ్. పిల్లలకు చాక్లెట్లు, స్వీట్లు, ఐస్ క్రీమ్ లు పిజ్జాలు, బర్గర్ లు, పఫ్ లు, చిప్స్ లంటూ రెడీ మేడ్ ఆహారాన్నే అందిస్తున్నాం. పేగుల్ని శుభ్రం చేసే ఫైబర్ ఏమాత్రం లేని ఇలాంటి జంగ్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో విరేచనం అవ్వడం అనేది ఇబ్బంది కరంగా మారింది. దీనికి తోడు శారీరక శ్రమలేక  పోవడం, పెద్దలు తినే ఆహారాన్ని పిల్లలకు పెట్టడం, తగినన్ని నీళ్లు తాగించక పోవడం, ఆకు కూరలు పీచుపదార్థాలు తగినంతగా పెట్టకపోవడం,  స్కూల్ కి టైం అవుతుందని టాయిలెట్ కు పంపించక పోవడం, ఇలాంటివెన్నో పిల్లల్లో మలబద్ధకాన్ని తెచ్చిపెడతుంటాయి.

సాధారణ పద్దతిలో మలబద్ధకాన్ని నివారించే చిట్కాలు

water drinking for constipation

మలబద్ధకానికి ప్రధాన కారణం శరీరంలో వాటర్ కంటెంట్ లేకపోవడం. ఉదయం నిద్ర లేసింది మొదలు రాత్రి పడుకునే వరకు పిల్లలు నీళ్లు తాగేలా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు ఉదయం బ్రష్ చేయించిన తరువాత వేడి నీళ్లు  తాగడం వల్ల జీర్ణాశయంలోని ఎముకల్లో ఇరుక్కుపోయిన ఆహారం బయటకు వచ్చేస్తుంది. అదే సమయంలో కెఫీన్ కంటెంట్, ఫ్యాట్ ఎక్కువగా  ఉన్న పదార్ధాల్ని దూరం చేయండి

 

 

పండ్ల రసాల్ని తాగించండి

పిల్లల్లో మల బద్దకాన్ని నివారించేందుకు ఫ్రూట్‌ జ్యూస్ చక్కగా ఉపయోగపడుతుంది.  ఎందుకంటే కొన్నింటి లో స్వీటెనర్ సార్బిటాల్ ఉంటుంది.  పిల్లల వయసు 6 నెలల వయస్సు ఉంటే  2 నుండి 4  ఔన్సుల పండ్ల రసాన్ని తాగించాలి.  రెగ్యులర్ ఫీడింగ్స్‌ తో పాటు 100 శాతం ఆపిల్ జ్యూస్, ఎండు ద్రాక్షను యాడ్ చేసుకోవచ్చు.

ఫైబర్ ను యాడ్ చేయండి

పిల్లలకు పెట్టే ఆహారంలో ఫైబర్ ను యాడ్ చేయండి. పాలకూర, చిక్కుళ్లు, బఠాణీ, రాజ్మా, పుచ్చకాయలు, కీర దోసకాయలు, జామ కాయలు, ఆరంజ్, పెసర పప్పు, మొక్క జొన్నతో పాటు పలు ఆకు కూరల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఫుడు అరుగుదలకు సాయం చేస్తాయి.

పాలతో చేసిన పదార్ధాల్ని దూరం చేయండి

పోతపాలతో పాటు పాలతో చేసిన ఐస్ క్రీమ్, చాక్లెట్లను దూరం చేయడం వల్ల అరుగుదల ఈజీ అవుతుంది.

ఆయుర్వేద పద్దతిలో మలబద్ధకాన్ని నివారించే మార్గాలు

అగస్య లేహాన్ని తినడం వల్ల పెద్దల్లో, పిల్లల్లో మలబద్ధకం సమస్య తీరిపోతుంది. లేహ్యం వల్ల కడుపులో పేరుకుపోయిన చెత్తా చెదారాల్ని బయటకు పంపించవచ్చు.

అగస్య లేహ్యాన్ని తయారు చేసుకునే విధానం

అగస్య లేహ్యాన్ని తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్ధాలు

ఆవు నెయ్యి -100 గ్రాములు

వాము – 100గ్రాములు

పటిక బెల్లం – 100 గ్రాములు

అగస్య లేహ్యాన్ని తయారు చేసుకునే విధానం

వామును, పటిక బెల్లాన్ని విడివిడిగా మొత్తగా చేసి ఆ రెండింటిని కలపాలి. అనంతరం ఆవు నెయ్యిని వేడి చేసి .. కలిపిన వాము, పటిక బెల్లం పొడిలో పోసి స్పూన్ పెట్టి తిప్పాలి. తిప్పగా వచ్చిన మిశ్రమాన్ని భోజనం చేసిన తరువాత పెద్దలు అర టీ స్పూన్, పిల్లలు పావు టీ స్పూన్ ను చప్పరించడం వల్ల కడుపులో పేరుకుపోయిన మలినాలు, వ్యర్ధాలన్నీ బయటకు వస్తాయి.

ఆయుర్వేద పద్ధతిలో మరో విధంగా పొడిని చేసుకునే విధానం

కావాల్సిన పదార్ధాలు – వాము 100గ్రాములు

కరక్కాయ పొడి  100గ్రాములు

పటిక బెల్లం  – 50 గ్రాములు

దోరగా వేయించి, దంచి, జల్లించిన సొంటి పొడి – 50 గ్రాములు

తయారు చేసుకునే విధానం  – ఈ నాలుగు పదార్ధాల్ని కలిపి పొడి చేసుకొని భద్ర పరచుకోవాలి.

ఎప్పుడు తినాలి- నాలుగు పదార్ధాలు కలిపిన మిశ్రమాన్ని భోజనం చేసిన తరువాత పిల్లలు- పెద్దలు మూడేళ్ల తో కలిపి నోట్లో వేసుకొని మంచి నీళ్లు తాగాలి. అలా తినడం వల్ల పిల్లలకు పెద్దలకు జీర్ణం సమస్యలు దరిచేరవు. పొట్టలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది.

see this – women weight loss tips : మహిళలు త్వరగా బరువు తగ్గాలంటే ఈజీ టిప్స్

 

see this – సెగ గడ్డల్ని నయం చేసే అద్భుతమైన చిట్కాలు

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest