Medical Detection Dogs : కరోనా వైరస్ సోకిందో లేదో చెప్పే కుక్కలు

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ పై యుద్ధాలు ప్రకటిస్తున్నాయి. ఆ మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. వీలైనంత త్వరగా వైరస్ నుంచి ప్రజలను రక్షించాలని దేశాధినేతలు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం అన్నీ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.

ఒక మనిషికి కరోనా వైరస్ సోకిందా లేదా అని గుర్తించాలంటే టెస్ట్ లు చేయించుకోవాల్సి వచ్చేది. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వైద్యుల కొరత, టైం కు టెస్ట్ లు చేసేంత సమయం లేకపోవడంతో అలసత్వం ఏర్పడేది. అయితే దీన్ని అధిగమించేందుకు బ్రిటన్ సరికొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది.

కరోనా వైరస్ ను గుర్తించే కుక్కలు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను గుర్తించేందుకు కుక్కలు రంగంలోకి దిగుతున్నాయి. కుక్కలు కరోనా వైరస్ ను పసిగడతాయా అనే అనుమానం రావచ్చు. ఆ అనుమానాల్ని పటాపంచలు చేసేందుకు బ్రిటన్ కు చెందిన డాక్టర్లు మెడికల్ డిటెక్షన్ డాగ్స్ ను అందుబాటులోకి తెస్తున్నారు.

మలేరియాతో పాటు ఇతర వ్యాధుల్ని గుర్తింపు

గతంలో బ్రిటన్ దేశస్థులకు సోకే మలేరియాతో పాటు ఇతర వైరస్ లను గుర్తించడంలో కుక్కలు సక్సెస్ అయ్యాయి. వాసన చూసి నేరస్తుల్ని ఎలా గుర్తిస్తాయో..ఇప్పుడు మనిషిని వాసన చూసి కరోనా వైరస్ ఉందా లేదా అని చెప్పేస్తాయి.

స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న కుక్కలు

కరోనా వైరస్ ను గుర్తించేందుకు  కుక్కలు ఆరు వారాల పాటు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాయి. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఆరు వారాల మెడికల్ డిటెక్షన్ డాగ్స్ కి కొవిడ్-19ను పసిగట్టే ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడే కాదు గతంలో అనేక రకాలైన వ్యాధుల్ని వాసన చూసి పసిగట్టేలా ట్రైనింగ్ ఇచ్చిన అనుభవం ఉండడంతో..కరోనా వైరస్ ను గుర్తించేలా ట్రైనింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

కరోనా వైరస్ ఉందా లేదా అని కుక్కలు ఎలా గుర్తిస్తాయి.

మెడికల్ డిటెక్షన్ డాగ్స్ ఓ వ్యక్తిని వాసన చూస్తాయి. వాసన చూసినప్పుడు ఆ వ్యక్తి శరీరంలో ఎంత వేడి ఉంది..? వేడి శాతం  ఎక్కువగా ఉందా లేదా అని గుర్తించి..కరోనా వైరస్ సోకిందా లేదా అనేది కన్ఫాం చేస్తాయి. దీనివల్ల కొంత భారం తగ్గుతుందని మెడికల్ ఎక్స్ పర్టులు చెబుతున్నారు.

ఎయిర్ పోర్ట్ లో విధులు

మెడికల్ డిటెక్షన్ డాగ్స్ ను మొదట ఎయిర్ పోర్ట్ లలో విధులు నిర్వహించేందుకు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. బయటి దేశాల నుంచి వచ్చే వారిలో ఎక్కువగా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని, వారిని కనిపెట్టేందుకు ఎయిర్ పోర్ట్ లలో ఈ డాగ్స్ ను రంగంలోకి దింపుతున్నట్లు బ్రిటన్ హెల్త్ ఎక్స్ పర్ట్ లు చెబుతున్నారు.

more news

see this – చైనాలో కొత్త వైరస్…హంటా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest