Janata Curfew Live Updates : 14 గంటల కర్ఫ్యూ కరోనాను ఎలా కట్టడి చేస్తుంది

భిన్నంత్వంలో ఏకత్వమైన భారత్ మరోసారి ఏకతాటిపైకి వచ్చింది. కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు యావత్ దేశ ప్రజలు కర్ఫ్యూలో పాల్గొన్నారు.

అయితే కర్ఫ్యూ విధిస్తే కరోనా వైరస్ నుంచి భారత్ ను  సురక్షితంగా   ప్రపంచ దేశాలకు సరికొత్త సందేశం ఇచ్చినట్లైంది.

జనతా కర్ఫ్యూ తో కరోనా వైరస్ అంతం సాధ్యమవుతుందా..?

జనతా కర్ఫ్యూ ముఖ్య ఉద్దేశం ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవడమే

సింగపూర్, జపాన్, వియాత్నం వంటి దేశాలు కర్ఫ్యూతో కరోనా వైరస్ తో కొంతమేర విజయం సాధించాయి. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాలు నిర్లక్ష్యం చేసి మూల్యం చెల్లించుకుంటున్నాయి.

సింపూర్, జపాన్, వియాత్నం వంటి దేశాల్ని ఆదర్శంగా తీసుకున్న మోడీ గారు ఈ జనతా కర్ఫ్యూని విధించారు.

కరోనా వైరస్ వ్యాపించే దశలు

కరోనా వ్యాపించేందుకు మూడు దశలు ఉన్నాయి.

  1. విదేశాల నుంచి భారత్ కు వచ్చే వారికి కరోనా సోకితే అది మొదటి దశ
  2. వారితో కాంటాక్ట్ అయిన వ్యక్తులకు కరోనా సోకితే అది రెండో దశ అవుతుంది.
  3. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి వల్ల ఎవరికైనా సోకితే అది మూడో దశ

ఈ మూడు దశల్లో భారత్ ప్రస్తుతం రెండో దశలో ఉంది. ఈ దశలో ఎవరికైనా వైరస్ సోకితే గుర్తించడం చాలా సులభం అవుతుంది. కానీ మూడో దశలో కరోనా వైరస్ సోకితే తట్టుకోవడం చాలా కష్టం. అందుకు ఉదాహరణ స్పెయిన్, ఇటలీ దేశాలే. మొదటి రెండు దశల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మూడో దశలో భారీగా ప్రాణ నష్టం కొనసాగుతుంది.

మూడో దశకు భారత్ వెళ్లకూడదనే ప్రధాని మోడీగారి ఉద్దేశం

మూడో దశకు వెళితే చాలా ప్రమాదకరమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించింది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న భారత్ లో ముప్పు ఎక్కువే. దీనికి చెక్ పెట్టేందుకు మోడీగారు వేసిన మాస్టర్ ప్లానే ఈ జనతా కర్ఫ్యూ

జనతా కర్ఫ్యూ అంటే

జనతా కర్ఫ్యూ అంటే వైరస్ ను నియంత్రించేందుకు దివ్య ఔషధం. కరోనా వైరస్ 12గంటల పాటు జీవించి ఉంటుంది. ఈ సమయంలో ప్రజలందరూ కర్ఫ్యూని పాటించడం వల్ల కరోనా వైరస్ ను అరికట్టవచ్చు. అదే సమయంలో దేశ వ్యాప్తంగా శానిటైజర్లను వెదజల్లుతున్నారు. అందుకే ఈ జనతా కర్ఫ్యూని ప్రధాని మోడీగా విధించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest