మీ కిడ్నీలను ఇలా కాపాడుకోండి

కిడ్నీలు వెన్నెముకకు రెండు వైపులా, పక్కటెముక దిగువన చిక్కుడు గింజ ఆకారంలో ఉండి అనేక విధులు నిర్వహిస్తాయి.

ముఖ్యంగా రక్తం నుండి వ్యర్థాలను, అదనపు నీరు, ఇతర మలినాలను ఫిల్టర్ చేస్తాయి. అలా ఫిల్టర్ చేయబడిన వ్యర్ధాలు మూత్రాశయంలో నిల్వ చేయబడతాయి. ఆ తరువాత మూత్రం నుంచి బయటకి వెళ్లిపోతాయి.

అంతేకాదు మన మూత్రపిండాలు శరీరంలో మలినాలను నియంత్రించే  (పిహెచ్), ఉప్పు, పొటాషియం స్థాయిలను నియంత్రిస్తాయి. ఇవి రక్తపోటును నియంత్రించే ఎర్ర రక్త కణాలను వృద్ది చేసే హార్మోలను ఉత్పత్తి చేస్తాయి.

ఎముకలు, కండరాల పనితీరు బాగుండేలా కాల్షియంను ఉత్పత్తి చేసే విటమిన్ – డి ని అందిచేలా  మూత్రపిండాలు సహాపడతాయి.  కిడ్నీలను  కాపాడుకోవడం  ఆరోగ్యానికి శ్రేయస్కరం . కిడ్నీలు ఆరోగ్యంగా శరీరం వ్యర్థాలను బయటకు పంపి పనితీరు బాగుండేలా హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.

1.కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొన్ని చిట్కాలు

♦ చురుకుగా, ఆరోగ్యంగా ఉండండి

♦  కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పని సరి.  ఇది దీర్ఘకాలిక కిడ్నీ సమస్యల్ని అరికడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండెను జాగ్రత్తగా ఉంచుతుంది.

 కిడ్నీ సమస్యలు రాకుండా ఉండేందుకు ముఖ్యమైన మార్గాలు

♦ ప్రతీరోజు తప్పని సరిగా వ్యాయామం చేయాలి.  నడవడం, రన్నింగ్ చేయడం, సైక్లింగ్, డ్యాన్స్ కిడ్నీ బాగుండేలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

2. రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోవడం

డయాబెటిస్, షుగర్ సమస్యల వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ లేనప్పుడు రక్తాన్ని ఫిల్టర్ చేసేందుకు కిడ్నీ కష్టపడాల్సి వస్తుంది. దీంతో ప్రాణాంతక సమస్య తలెత్తుతుంది. కాబట్టి కిడ్నీలు బాగుండేలా షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోవడం ఉత్తమం. షుగర్ ను  కంట్రోల్ చేసుకుంటే ప్రమాదం నుంచి భయటపడవచ్చు. ఒకవేళ షుగర్ లెవల్స్ ప్రారంభదశలో ఉంటే తప్పని సరిగా వైద్యుల్ని సంప్రదించాలి.

3. రక్తపోటు(బీపీ)ను పర్యవేక్షించండి

అధిక రక్తపోటు కిడ్నీలకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. డయాబెటిస్, గుండె జబ్బులు, కొలస్ట్రాల్ వంటి ఇతర ఆనారోగ్య సమస్యలు ఉన్నవారికి బీపీ వచ్చిందంటే శరీరంపై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది.

ఆరోగ్యంగా ఉన్నవారి బ్లడ్ ప్రెజర్ 120/80. ప్రీహైపర్‌ టెన్షన్ ఉన్నవారికి  139/89 మధ్య ఉంటుంది. ఈ సమయంలో మీ రక్తపోటును తగ్గించడానికి జీవనశైలి, ఆహారపు అలవాట్లు సహాయపడతాయి.

రక్తపోటు 140/90 కంటే ఎక్కువగా ఉంటే బీపీ ఉన్నట్లు గుర్తించాలి. బీపీని  క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం, జీవనశైలిలో మార్పులు, మెడిసిన్ తీసుకోవాలి.

4. ఎంత బరువు ఉన్నామనేది చెక్ చేసుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.

అధిక బరువు లేదా ఉబకాయం(కొవ్వు) ఉండడం వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కిడ్నీలు దెబ్బతినడం వల్ల  డయాబెటిస్, గుండె జబ్బులు వస్తాయి.

ఎక్కువగా సోడియం(ఉప్పు) ఉండే ఆహార పదార్ధాలు, ప్రాసెస్ చేసిన మాంసాన్ని (ప్యాకెట్లలో నిల్వ ఉంచిన మాంసం) తినకూడదు. అలా తినడం వల్ల కిడ్నీలకు ప్రమాదం. తక్కువ సోడియం కలిగిన కాలీఫ్లవర్, బ్లూబెర్రీస్, చేపలు, తృణధాన్యాలను తినడంపై దృష్టిపెట్టాలి.

5. ద్రవ పదార్ధాలను ఎక్కవగా తీసుకోవాలి.

ద్రవపదార్థాలంటే నీళ్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ ఎక్కువ తాగాలి.  రోజుకు 8గ్లాసుల మంచి నీళ్లు తాగడం చాలా ఉత్తమం.  ఉడక బెట్టిన పదార్ధాలు శరీరానికి శక్తినిస్తాయి. రెగ్యులర్ గా నీళ్లు తాగాలి. నీళ్లు తాగడం వల్ల శరీరంలో సోడియం లెవల్స్ ను తగ్గించేందు సాయం చేస్తుంది.  దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. రోజులో కనీసం 1.5 నుండి 2 లీటర్ల వరకు నీళ్లు తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగేందుకు వ్యాయామం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు, కిడ్నీలో రాళ్లు పడకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఎక్కువ మోతాదులో మంచి నీళ్లను తాగాలి. తద్వారా కిడ్నీలో రాళ్లను వివిధ మార్గాల ద్వారా శరీరం నుంచి బయటకు పంపవచ్చు.

6. స్మోకింగ్ చేయద్దు

ధూమపానం(స్మోకింగ్ ) శరీరంలోని రక్తనాళాల్ని దెబ్బతీస్తుంది. ఇది శరీరం అంతటా స్ప్రెడ్ అయ్యి కిడ్నీలకు అందించే రక్తం సరఫరాను నిలిపి వేస్తుంది. స్మోకింగ్ వల్ల  కిడ్నీకి క్యాన్సర్ సోకే ప్రమాదం కాబట్టి స్మోకింగ్ చేయకుండా ఉంటే మంచిది.

7. ఓ టీసీ ట్యాబ్లెట్ల గురించి తెలుసుకోండి.

క్రమం తప్పకుండా ఓవర్-ది-కౌంటర్ (OTC)వల్ల  కిడ్నీలు దెబ్బతింటాయి.  దీర్ఘకాలిక నొప్పి, తలనొప్పి లేదా ఆర్థరైటిస్ కోసం తీసుకునే ఇబుప్రోఫెన్, నాప్రోక్సెన్‌తో సహా నాన్‌స్టెరోయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్‌ఎస్‌ఎఐడి) మీ మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఒకవేళ ట్యాబ్లెట్స్ వేసుకుంటే కిడ్నీలను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది.

8. కిడ్నీ పనితీరును పరీక్షించండి

కిడ్నీ సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా వైద్యుల సలహాతో పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఎక్సరే ద్వారా  కిడ్నీల పనితీరుపై అంచనా వేయవచ్చు.

కింద పేర్కొన్న లక్షణాలు ఉన్న వారు కిడ్నీ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలంటే తప్పని సరిగా ఎక్సరే తీయించుకోవాలి. 

♦ 60 ఏళ్లు పైబడిన వారు

♦ తక్కువ  బరువుతో పుట్టిన వారు

♦ గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు లేదా ఆ కుటుంబంలోని వ్యక్తులకు గుండె జబ్బులు ఉంటే ఎక్సరే తీయించుకోవాలి.

♦ బీపీ ఉన్నవారు..ఆ కుటుంబంలోనే వారికి బీపీ ఉన్నా ఎక్సరే తీయించుకోవాలి.

♦ ఉబకాయంతో బాధపడేవారు.

ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవాలంటే కిడ్నీ పనితీరు ఎలాఉందో తెలుసుకుంటే సరిపోతుంది. ప్రారంభ దశలో కిడ్నీల పనితీరు గురించి తెలుసుకుంటే భవిష్యత్ లో అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు.

కిడ్నీ గురించి మరింత క్లుప్తంగా

20 ఏళ్లు పైబడిన 10 మంది అమెరికన్లలో 1 కంటే  ఎక్కువ మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు ఆధారాలున్నాయి. కిడ్నీ వ్యాధి కొన్ని రూపాల్లోకి మారి కాలక్రమేణ వ్యాధిని తీవ్రతరం చేస్తుంది. రక్తంలోని వ్యర్ధాలను తొలగించలేని స్థితిలో ఉంది అంటే కిడ్నీలు పూర్తిగా పాడైనట్లు తెలుసుకోవచ్చు.

కిడ్నీలు పాడైనప్పుడు శరీర నిర్మాణ పని తీరుపై వ్యర్ధాలు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. దీంతో మరణం ఖాయమనే చెప్పుకోవాలి. కిడ్నీలు పాడైనప్పుడు  డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. లేదా కిడ్నీలను మార్చాల్సి వస్తుంది.

కిడ్నీ వ్యాధిలోని రకాలు

ప్రారంభస్థాయిలో కిడ్నీ సమస్య ఉన్నప్పుడు గుర్తించాలి. లేదంటే  దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో ప్రాణాల్ని ఫణంగా పెట్టాల్సి వస్తుంది.  దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలకు  ప్రధాన కారణం అధిక రక్తపోటు(బీపీ) . కిడ్నీలు మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్తపోటు వల్ల రక్తం శుద్ధి చేసే సమయంలో  20శాతం రక్తం వ్యర్ధాల ద్వారా బయటకు వెళ్లిపోతుంది.  కాబట్టి బీపీ కిడ్నీ వ్యాధి వచ్చేందుకు ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే తప్పని సరిగా ఆరోగ్యకరమైన జీవిన విధానాన్ని అలవాటు చేసుకోవాలి.

కిడ్నీల్లో రాళ్లు

కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడం అనేది సాధారణ సమస్య. గట్టి పదార్ధాల్ని అరిగించడంలో కిడ్నీలు శక్తిని కోల్పోతాయి. దీంతో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఇవి సాధారణ పద్దతిలో శరీరం నుంచి బయటకు వెళ్లి పోతాయి. కిడ్నీల్లో పడిన రాళ్లను తొలగించడం కష్టతరమైనదనే చెప్పుకోవాలి.

గ్లోమెరులోనెఫ్రిటిస్ వ్యాధి

కిడ్నీల్లో ఉండే గ్లోమెరోలి అనే రక్తనాళాలు ఎర్రబడడం వల్ల గ్లోమెరులోనెఫ్రిటిస్ అనే వ్యాధి వస్తుంది. దీంతో శరీరం నుంచి వ్యర్ధాల్ని, నీటిని వడపోసే ప్రక్రియను దెబ్బతీస్తుంది. ఈ సమస్య అంటు వ్యాధులు, కొన్ని రకలా మెడిసిన్ వల్ల, పుట్టుకతో వచ్చే అసాధారణ సమస్యల వల్ల తలెత్తుతుంది.

పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి

కిడ్నీల్లో ఉండే తిత్తులు చాలా సాధారణమైనవి, హానిచేయవు. కానీ పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి అనారోగ్యాన్ని గురి చేస్తుంది. ఈ వ్యాధి జనటికల్ ప్లాబ్లమ్స్ వల్ల వస్తుంది.

యూరినల్ సమస్యలు 

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు మూత్ర వ్యవస్థలోని  భాగాలకు బ్యాక్టీరియల్  ఇన్ఫెక్షన్లను  సోకేలా చేస్తుంది.  మూత్రాశయం , యురేత్రాలో ఇన్ఫెక్షన్లు సర్వసాధారణం. ఇది సాధారణ చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చు. దీర్ఘకాలిక సమస్యతో కిడ్నీ పాడవుతాయి.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి

కిడ్నీలు మానవ శరీర పనితీరులో కీ రోల్ ప్లే చేస్తాయి. ఆహారపు అలవాట్లు, జీవనశైలితో కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. వైద్యుల పర్యవేక్షణతో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా కిడ్నీలకు ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడుకోవచ్చు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest