kidney stone symptoms : కిడ్నీ స్టోన్స్ లక్షణాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు

kidney stone symptoms : మన శరీరంలో మూత్రపిండాలు నిరంతరం పనిచేసే సహజ యంత్రాలలాంటిది. వీటి పనితీరులో ఒక్కసారిగా మార్పులొస్తే అవి ఏ విధంగా గాయపడతాయి. కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఎందుకు వస్తాయి. వీటికి కారణాలు పరిశీలించినట్లైతే  కాల్షియం, ఆక్సాలిక్ ఆమ్లం వంటి రసాయనాలు పేరుకుపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.

కిడ్నీలో రాళ్లు ఎందుకు పడతాయి – Why stone fall in the kidney stones

హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం, వాటర్ తక్కువగా తీసుకోవడం, ఆక్సాలిట్ ఎక్కువగా ఉన్న ఆకు కూరలు పాలకూర, కాలీఫ్లవర్, క్యాబేజీ తో చేసిన ఆహార పదార్ధాల్ని ఎక్కువగా తీసుకోవడం, చికెన్ మటన్ లలో ప్యూరిన్స్‌, పిరమిడైన్స్‌ అనే  మాంసకృతులు ఉంటాయి.  ప్యూరిన్స్ ఎక్కువగా ఉన్న నాన్ వెజ్ ఐటమ్స్ ను తినడం వల్ల ఆ ప్యూరిన్స్ యూరిక్ యాసిడ్ గా మారి స్టోన్ తయారవుతుంటాయి. వాటితో పాటు టమోటాలను, కూల్  వాటర్ ను ఎక్కువగా తాగడం వల్ల..ఆ కూలింగ్ వాటర్ లో ఉండే కొకొవా అనే పదార్ధం ఉంటుంది. ఆ పదార్ధం వల్ల  కిడ్నీ స్టోన్ వస్తుంటాయి. కూల్ డ్రింక్స్, కూల్ వాటర్ కు బదులు ఇళ్లల్లో తయారు చేసుకునే షర్బత్ వల్ల కిడ్నీలో   స్టోన్స్ కరిగిపోతుంటాయని వైద్యులు చెబుతున్నారు. షర్బత్ లో సిట్రస్ ఎక్కువగా ఉంటుంది.  సిట్రస్ అనే పదార్ధం కిడ్నీలో రాళ్లు పడకుండా నివారిస్తుంది.

శరీరంలో విటమిన్ డి ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య వస్తుంది. కిడ్నీలో రాళ్లు ఉండడం వల్ల అసౌకర్యంగా ఉంటుంది. దీని ప్రభావం దైనందిన జీవితంపై పడి రోజువారి పనులకు ఆటంకం ఏర్పడుతుంది.

కిడ్నీలో రాళ్లు ఉంటే కనిపించే లక్షణాలు – symptoms of kidney stone in telugu

kidney stone symptoms in telugu
          kidney stone symptoms in telugu

మూత్రపిండాలు మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మలిన పదార్ధాలను బయటకు పంపిస్తాయి. ఎర్ర రక్త కణాల తయారీలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎముకలు స్ట్రాంగ్ గా ఉండేలా కాపాడతాయి. అదే సమయంలో మనం ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీలో రాళ్లు పడి వికారం, వాంతులు, అసాధారణమైన చెమటలు, పొట్ట కింది భాగంలో విపరీతమైన నొప్పి, కిడ్నీలో ఉన్న రాళ్లు అటు ఇటు కదలడం వల్ల మూత్రం రంగు మారి దుర్వాసన రావడం,యూరిన్ ఎరుపు – పసుపు మిక్స్ చేస్తే వచ్చే డార్క్ కలర్ లో మూత్రం ఉండడం, మూత్రాశయ ఇన్ఫెక్షన్ల వచ్చినప్పుడు వైద్యుల సలహాతో ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం వల్ల కిడ్నీలో రాళ్లను తొలగించవచ్చు.

కిడ్నీలో రాళ్లను తొలగించే విధానం – how to remove kidneys stones in telugu  

kidney stone symptoms in telugu
kidney stone symptoms in telugu

కిడ్నీలో రాళ్ల సైజును బట్టి చికిత్స ఉంటుంది. 2.2 ఎంఎం స్టోన్స్ ఉంటే రోజుకు 4,5లీటర్ల  వాటర్ ను ఎక్కువగా తాగడం 4,5 రాళ్ల వరకు యూరిన్ రూపంలో బయటకు వస్తుంది. 6ఎంఎం నుంచి 15ఎంఎం స్టోన్స్ ఉంటే eswl- Extracorporeal Shock Wave Lithotripsy, laser therapy, 15ఎంఎం కంటే ఎక్కువగా ఉంటే కీ హోల్ సర్జరీ (keyhole surgery) బాధితుణ్ణి వెల్ల కిలా పడుకోబెట్టి చిన్న హోల్ చేసి ఆ రంధ్రం ద్వారా కిడ్నీలో ఉన్న రాళ్లను చిన్న చిన్న పీసులుగా కట్ చేసి బయటకు తీసే విధానం, ureter లో ఉంటే (కిడ్నీనుంచి యూరిన్ వచ్చే పైపు ) లో ఉంటే  ureteroscopy and laser fragmentation(ursl ) అంటారు.

ఆయుర్వేద పద్దతిలో కిడ్నీ స్టోన్ ను కరిగించడం ఎలా – Ayurveda Treatment for Kidney Stones in Telugu

కిడ్నీలో రాళ్లను కరిగించే వేప  – 4000 సంవత్సరాలకు పైగా భారత్ లో వాడుతున్న గొప్ప ఔషద మూలిక వేప అని చెప్పుకోవచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచ దేశాలు  70శాతం పైగా ఆయుర్వేద వైద్యంపై ఆధారపడుతున్నాయని, అందులో 200రకాలైన వ్యాధుల్ని నయం చేసేందుకు వేపను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. వ్యాధుల్ని అరికట్టే ప్లేవనాయిడ్స్ , 200కంటే ఎక్కువ కీటకాల్ని నాశనం చేసే లిపిడ్ కంటెంట్ ఉండడం వల్ల అనేక రకాల వ్యాధుల్ని అరికట్టే శక్తి సామర్ధ్యాలు ఈ వేప ఆకులో ఉన్నాయి. లివర్ , గుండె సంబంధిత వ్యాధుల్ని నయం చేసే వేప. కిడ్నీలో రాళ్లను కరిగించే గొప్ప ఔషద మూలిక అని ఆయుర్వేద పండితులు చెబుతున్నారు.

వేప ఆకు తో ఔషధాన్ని ఎలా తయారు చేసే విధానం  – how to make Ayurveda nettle leaf powder in telugu

పసుపు పచ్చరంగులో ఉండే వేప ఆకుల్ని ఎండబెట్టాలి. ఎండిన ఆకుల్ని సన్నటి మంటపై దోరగా వేయించాలి. అలా వేయించడంతో వేప ఆకు నల్లగా మారిపోతుంది. అనంతరం ఆ పొడిని జల్లెడ పడ్డాలి. జల్లెడ పట్టగా వచ్చిన  పొడిని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. పావు చెంచా వేపపొడి, చెంచా తేనె కలుపుకొని చప్పరించాలి. అలా తిన్నతరువాత  గంట వరకు ఎలాంటి ఆహార పదార్ధాల్ని, వాటర్ తాగకూడదు. దీంతో వేపఔషదం కిడ్నీలోని రాళ్లను కరిగించేందుకు ఉపయోగపడుతుంది. ఆయుర్వేద పండితులు చెబుతున్నారు.

గమనిక – కిడ్నీలో రాళ్లను కరిగించే విధానంపై మాకు  ఆన్ లైన్ లో  దొరికిన సమాచారం ప్రకారం అప్ డేట్ చేయబడింది. కిడ్నీ సమస్యతో బాధపడేవారు వైద్యుల సలహాతో ట్రీట్‌మెంట్  తీసుకోగలరు.

కిడ్నీలో స్టోన్స్ పడకుండా ఉండాలంటే – how to avoid kidney stones in telugu

బీపీ, మధుమేహం, రక్తంలో కొలస్ట్రాల్ లేకుండా చూసుకోవాలి. కొలస్ట్రాల్ ఎక్కువైనప్పుడు కిడ్నీలో రక్త ప్రసరణకు ఆటంకాలు ఏర్పడి విషపూరితంగా మారతాయి. దీంతో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఉదయం నడక, రోజు రెండు మూడు లీటర్ల మంచి నీళ్లు తాగాలి, శరీరం చెమట పట్టేలా వ్యాయామం చేయాలి. స్మోకింగ్, డ్రింకింగ్‌ ను మానేయడం ద్వారా భవిష్యత్ లో కిడ్నీలో రాళ్లు పడకుండా అరికట్టవచ్చు.

ఇంకా చదవండి –kidney failure symptoms | ప్రారంభ దశలో కిడ్నీ వ్యాధిని గుర్తించడం ఎలా

ఇంకా చదవండి – మీ కిడ్నీలను ఇలా కాపాడుకోండి

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest