lockdown 4.0 | ప్రధాని మోడీ గైడ్ లైన్స్: ఇవి తప్ప మిగిలినవన్నీ క్లోజ్

Lock down 4.0 ను ఉద్దేశించి ప్రధాని మోడీ గతంలో ప్రసంగించిన విషయం తెలిసిందే.  మే 12న జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ మూడు లాక్ డౌన్ లో కంటే 4.0 లాక్ డౌన్ భిన్నంగా ఉంటుందని అన్నారు.  అయితే మోడీ ఎలా చెప్పారో అలాగే భిన్నంగా ఉందని అంటున్నారు విశ్లేషకులు.

పీసీఓడీ లక్షణాలేంటో తెలుసుకోవాలని ఉందా..?

మే 18తో నాలుగో దశ లాక్ డౌన్ ప్రారంభమవుతుండగా..మే 17 అంటే ఆదివారం కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. మార్గదర్శకాల ప్రకారం.. దేశం అంతా కొన్ని ఆంక్షలు కొనసాగుతుండగా.. మరికొన్నింటికి పర్మీషన్ ఇచ్చింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

  1. కంటైన్ మెన్ జోన్లలో అత్యవసర అవసరాలకోసం అనుమతి
  2. కంటైన్ మెంట్ జోన్లు తప్ప గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్లలో పరిస్థితుల్ని బట్టి అనుమతులిచ్చే అంశాన్ని రాష్ట్రప్రభుత్వానికి అప్పగించింది.
  3. అన్నీ విమాన సర్వీసులు బంద్
  4. ఒక్క మెడికల్ ఎమర్జెన్సీకి వినియోగించుకోవచ్చు.
  5. మెట్రో రైలు సర్వీసులకు అనుమతి ఇవ్వలేదు.
  6. రెస్టారెంట్లలో ఒక్క వంటగదికే పర్మీషన్ ఇచ్చింది. వంటగదిలో చేసుకొని డెలివరి చేసే వెసులుబాటును కల్పించింది.
  7. బార్లు, ఆడిటోరియంమ్స్ తో పాటు స్కూల్స్, సినిమా హాల్స్, ఎంటర్ టైన్మెంట్ పార్కులు, జిమ్స్ కు అనుమతులు ఇవ్వలేదు.
  8. క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే ఆడియన్స్ ను మాత్రం స్టేడియంలోకి అనుమతి ఇవ్వలేదు
  9. గుళ్లు, మతపరమైన ప్రార్ధనలకు అనుమతి లేదు. ఇక సాయంత్ర ఏడు నుంచి ఉదయం 7గంటల వరకు ఎవరూ తిరగకూడదని, అలా కాదని నిబంధనల్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest