Morning Drinks For Weight Loss : మీ బరువును తగ్గించే మార్నింగ్ డ్రింక్స్

కరోనా వైరస్ తో పాటు అన్నీ రకాల వైరస్ ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే తప్పని సరిగా మనకి ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. ఇమ్యూనిటీ పవర్ తో ఎటువంటి మహమ్మారినైనా జయించవచ్చు.

దేశ ప్రధాని మోడీ సైతం తన ప్రసంగంలో ప్రతీ ఒక్కరు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకునేందుకు వేడి నీళ్లు తాగాలని సూచించారు. వేడి నీళ్లతో పాటు మరికొన్ని పండ్ల రసాల్ని యాడ్ చేస్తే ఇమ్యూనిటీ పవర్ తో పాటు వెయిట్ లాస్ అవ్వొచ్చు. అందమైన జుత్తును సొంతం చేసుకోవచ్చు. అయితే ఆ జ్యూస్ లేంటో తెలుసుకుందాం.

యాపిల్ సైడర్ వెనిగర్  

ఉదయాన్ని నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చని గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను కలిపి తాగాలి.

బరువు తగ్గడానికి సహాయపడే, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. మరియు రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గించే దివ్య ఔషధం. ఈ జ్యూస్ తాగిన 30నిమిషాల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా చూసుకోవాలి.

ఉసిరి జ్యూస్

ఉసిరి జ్యూస్ ఆమ్ల రసం అంటారు. ఈ జ్యూస్ పొడిషాపుల్లో దొరుకుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల రసం వేసి త్రాగాలి. తాగిన ముప్పై నిమిషాల తరువాత ఎటువంటి ఆహారం తీసుకోవడం, జ్యూస్ లను తాగడం చేయకూడదు. ఈ జ్యూస్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాదు చర్మాన్ని గ్లోగా ఉంచుతుంది. జుట్టు స్ట్రాంగ్ గా ఉంచడమే కాదు పెరిగేందుకు సాయపడుతుంది. అంతేకాదు బరువు తగ్గొచ్చు.

తేనె, నిమ్మకాయ జ్యూస్

తేనె – లెమెన్ వాటర్  నీరు బరువు తగ్గడానికి ఇష్టపడే పానీయం. ఒక గ్లాసు గోరు వెచ్చని వాటర్ బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఉదయం నిద్ర లేచిన తరువాత గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం మరియు తేనె కలుపుకొని తాగాలి.

అలోవేరా జ్యూస్

అలోవెరా జ్యూస్(కలబంద)మన ఇళ్లల్లో విరివిరిగా దొరికే కలబంద గుజ్జును వాటర్ లో కలుపుకొని ఉదయాన్నే  ఖాళీ కడుపుతో తాగాలి.  అలోవెరాలో మనశరీరానికి కావాల్సిన విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. బరువు తగ్గొచ్చు.ఈ మిశ్రమంలో అవసరమైన విటమిన్లు ఉంటాయి మరియు జీవక్రియ మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మన చర్మం అందంగా ఆకర్షణీయంగా ఉండేలా చేస్తుంది.

జింజర్ వాటర్

నార్మల్ వేడిగా ఉన్న వాటర్ లో సగం టీ స్పూన్ జింజర్ ను కలిపాలి. అనంతరం ఆ నీటిని బాగా మరిగించాలి. అనంతరం ఆ వేడిని నీటి నార్మల్  వేడి అయ్యే వరకు చల్లార్చి తాగాలి. ఆ జింజర్ టీని తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. బరువును తగ్గిస్తుంది. రక్తంలో షుగల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

గ్రీన్ టీ మరియు పుదీనా టీ

పుదీనా ఆకుల్ని నీటిలో కలిపి బాగా మరిగించాలి. ఐదునిమిషాల తరువాత గ్రీన్ టీ..వేడిచేసిన పుదీనా వాటర్ లో కలిపి వేడి చేయాలి. చల్లార్చి తాగాలి. గ్రీన్ టీ, పుదీనాతో తయారు చేసిన టీ బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

నిమ్మకాయ, తేనె మరియు దాల్చిన చెక్క

సగం పొడిచేసిన దాల్చిన పౌడర్ , నిమ్మరసం, తేనె ఈ మూడింటిని కలపాలి. కలిపిన ద్రావకంలో వామ్ వాటర్ ను కలపాలి. ఉదయం నిద్రలేనిచ వెంటనే ఖాళీ కడుపుతో తాగాలి. ఈ జ్యూస్ ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

జీర వాటర్

జీలకర్ర గింజల్ని రాత్రి పడుకునే ముందుకు గ్లాస్ లో కలిపి నానబెట్టాలి. ఉదయాన్నే నానబెట్టిన జీలకర్ర వాటర్ ను తాగాలి. జీర వాటర్ మన శరీరంలో ఫ్యాట్ ను బర్న్ చేస్తుంది. బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest