Mother’s Diet After The Delivery | బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే

గర్భం దాల్చిన మహిళలు బరువు తగ్గాలని కోరుకుంటారు. బరువు తగ్గడం కంటే అతి ముఖ్యమైంది పోషక ఆహారాన్ని శరీరానికి అందించడం. చాలా మంది మహిళలకు ఏ ఆహారం ఎప్పుడు ఎలా తీసుకోవాలనే అంశంపై అవగాహన ఉండదు. అలాంటి మహిళలు పోషక ఆహారం తీసుకోవడం వల్ల స్ట్రాంగ్ గా ఉండడమే కాదు పిల్లలకు పోషక విలువల గల ఆహారాన్ని అందించేందుకు సహాయపడతారు. 

 డెలివరీ తర్వాత ఎలాంటి ఆహారం తినాలి..?డెలివరీ తరువాత హార్మోన్లలో అనేక మార్పులు సంభవిస్తాయి.   మీరు మీ పిల్లలకు పాలిస్తుంటే  మీ శరీరానికి ప్రతి రోజూ అదనంగా 300 కేలరీలు అవసరం. ఇక్కడ తెలిపిన వివరాల ప్రకారం  డెలివరీ తరువాత మహిళలు తినే ఆహారం విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం మరియు ఒమేగా -3 లు పుష్కలంగా ఉన్నాయి. అవి డెలివరీ తరువాత మీ శరీరం త్వరగా కోలుకునేందుకు సాయపడుతుంది.

1. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు:పాల ఉత్పత్తులు, పాలు, జున్ను లేదా పెరుగు. పాలిచ్చే తల్లి ఆహారం లో ముఖ్యమైన భాగాలు. పాలు, జున్ను, పెరుగు తినడం వల్ల  కాల్షియం, ప్రోటీన్ మరియు బి విటమిన్లను అందిస్తుంది. ఎముకలు గట్టిగా ఉండేందుకు ఉపయోగపడే కాల్షియాన్ని అందిస్తుంది. కాబట్టి ప్రతీ రోజు మూడు కప్పుల పాలఉత్పత్తులను మీ ఆహారంలో చేర్చండి.

 2. స్కిన్ లెస్ మాంసం :స్కిన్‌ లెస్ నాన్ వెజ్ ఐటెమ్స్ లలో కోడి, చేప, మటన్ ఆహారాన్ని ఎక్కువగా తినాలి. వీటిల్లో ఐరన్, ప్రోటీన్ మరియు విటమిన్ బి -12 అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శక్తి సామర్ధ్యాలు పెరగడంతో పాటు తల్లి పాలు పడేందుకు ఉపయోగపడతాయి.

3. పప్పు ధాన్యాలు (పప్పులు) –వెజ్ ఐటెమ్ లలో ఆరోగ్యకరమైన ఆహారం ఏదైనా ఉందంటే అది పప్పు ధాన్యాలతో చేసిన వంటకాలనే చెప్పుకోవాలి. పప్పు ధాన్యాల్లో    ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలను ఉత్పత్తి చేస్తాయి.   అంతేకాదు త్వరగా జీర్ణం అయ్యేందుకు రుచికరంగా, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడతాయి.

4. చిక్కుళ్ళు:  నాన్ వెజ్ ఐట్సమ్ లో కంటే చిక్కుడు జాతికి చెందిన అన్నీ రకాల చిక్కుళ్ల తో పాటు బఠానీల్లో ప్రోటీన్ ఆహారం ఎక్కువగా ఉంటుంది.  తల్లి పాలు పడడంతోపాటు శక్తిని ఇచ్చేందుకు సాయపడతాయి.

5. ఆకుపచ్చ కూరగాయలు:  ఆకుపచ్చని కూరగాయల్లో విటమిన్లు మరియు ఖనిజాలు  అద్భుతంగా ఉన్నాయి. ఆకుపచ్చని పండ్లలో కేలరీలు తక్కువగా ఉన్న గుండెకు ఆరోగ్యకరమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ప్రసవం అనంతరం బరువు ను తగ్గించడంలో సహాయపడతాయి. పాలకూర, బ్రోకలీ ,స్విస్ చార్డ్ వంటి ఆకుకూరలు విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది.  తల్లులకు, పిల్లలకు చాలా మంచిది.  ఆకుకూరలు, బీన్స్,  పొట్లకాయ , ఆపిల్  మరియు ఇతర  కాలానుగుణ కూరగాయలను ఎక్కువగా తినండి.

6. బ్రౌన్ రైస్: మీరు బరువు తగ్గడానికి పిండి పదార్థాలను తగ్గించాలని  అంటుంటారు. అలా చేయడం వల్ల చను పాలు పడడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. స్ట్రాంగ్ గా ఉండాలంటే  బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలు ఎంచుకోండి. అవి మీకు, పిల్లలకు  కేలరీలను అందిస్తాయి.

7. బ్లూ బెర్రీస్:    గర్భధారణ తర్వాత మీ రోజువారీ పోషక అవసరాలను తీర్చడానికి బ్లూ బెర్రీస్ చక్కగా ఉపయోగపడతాయి.  బ్లూ బెర్రీస్ లో విటమిన్లు, ఖనిజాలు నిండి ఉంటాయి. అవి మీ శక్తి స్థాయిలను పెంచే ఆరోగ్యకరమైన పిండి పదార్థాలను అందిస్తాయి.

8. సిట్రస్ పండ్లు: నారింజ వంటి సిట్రస్ పండ్లు  విటమిన్ – సి ని అందిస్తాయి. ఇవి తల్లి పాలిచ్చేందుకు చాలా అవసరం అవసరం. పండ్లు లేదా జ్యూస్ లను తాగవచ్చు.  కాల్షియం ఉన్న ఫ్రూట్ జ్యూస్ లు తాగడం వల్ల ప్రయోజనాలున్నాయి.

more news

see this – ప్రతీ రోజూ కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుంతో తెలుసా..?

see this – మోషన్ ఫ్రీ చేసే యోగా ఆసనాలు (వీడియో)

see this – మహిళల్లో వెన్నునొప్పిని తగ్గించే మార్గాలు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest