Poly Cystic Ovary Syndrome| పీసీఓడీ లక్షణాలేంటో తెలుసుకోవాలని ఉందా..?

Poly Cystic Ovary Syndrome అన్నా పీసీఓడీ అన్నా రెండు ఒకటే. వైద్య పరిభాషలో పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిడ్రోమ్ అని పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ అని అర్ధం.

కొన్ని సంవత్సరాల క్రితం స్టెయిన్ లెవన్ తాల్ అనే వైద్యుడు బాగా లావుగా ఉండడం, మొటిమలు, అవాంఛనీయమైన రోమాలు, ఇర్రెగ్యూలర్ పీరియడ్స్, సంతానలేమి సమస్యలతో బాధపడే మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రో అనే సమస్య భయటపడినట్లు గుర్తించారు.

ఓవరీస్ అంటే అండకోశాలలో చాలా నీటి బుడగలు ఉన్నట్లు గుర్తించిన స్టెయిన్ లెవన్ తాల్ పైన చెప్పిన విధంగా సమస్యలు ఉన్నవారికి సిందడ్రోమ్ సమస్య ఉన్నట్లు చెప్పారు. అదే మనం చెప్పుకున్న పీసీఓడీ, పీసీఓఎస్.

అయితే ఈ పీసీఓడీ, పీసీఓఎస్ వచ్చిందనే విషయాన్ని మూడు అంశాలను పరిగణలోకి తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వాటిలో  ఇర్రెగ్యూలర్ పీరియడ్స్. పీరియడ్స్ రెండు నెలలకొకసారి, లేదంటే ఏడెనిమిది నెలల వరకు రాకుండా సడెన్ గా పీరియడ్స్ రావడం, కంటిన్యూగా బ్లీడింగ్ అవ్వడం, ఆల్ట్రా స్టెనోగ్రఫీ అనే టెస్ట్ చేసినప్పుడు అండకోశాలలో చిన్నచిన్న నీటి బుడగలు ఉంటాయి.

For More Health Tips |  పీరియడ్స్ తరువాత ఎప్పుడు కలిస్తే పిల్లలు పుడతారంటే

నీటి బుడగలు 10కంటే ఎక్కవగా, ఒక్కో నీటిబుడగ 10 మిల్లీ మీటర్స్ తక్కువ పరిమాణంలో ఉండాలి. దీంతో పాటు బయో కెమిస్ట్రీల్యాబ్ లో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్, ఎఫ్ ఎస్ హెచ్ ఎల్ హెచ్, టెస్టోస్టిరాన్ చేస్తారు. ఈ మధ్య కాలంలో ఇన్సులిన్, ప్రోలాక్టిన్ టెస్ట్ లు కూడా చేయాల్సి ఉంది. ఈ టెస్ట్ ల్లో కూడా హార్మోనల్ ఇన్ బ్యాలెన్సింగ్ కనిపిస్తుంది. ఎఫ్ఎస్ హెచ్ వ్యాల్యూ, ఎల్ హెచ్ వ్యాల్యూకంటే ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సిండ్రోమ్ ఉన్న వారికి ఎల్ హెచ్ వ్యాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. దానికి పీసీఓడీ హార్మోన్ పనితీరు లేకపోవడం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉంటుంది.

ముఖ్యంగా కొవ్వు పదార్ధాలలో యాండ్రోజన్స్ ఈ స్ట్రోజన్స్ గా కన్వర్ట్ అవుతాయి.  ఆ ఈస్ట్రోజన్ బ్రెయిన్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీంతో అక్కడి నుంచి ఎల్ హెచ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఎల్ హెచ్ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఓవర్ సీసీలో ఆండ్రోజన్స్ ద్వారా మళ్లీ ఈస్ట్రోజన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇలా కంటిన్యూగా జరిగే దానిని హైపర్ హ్యాండ్రజనిక్ స్టేట్ అనేది ఒకటి తయారవుతుంది. దీనివల్ల మహిళల శరీరంలో ఫీమెయిల్ హార్మోన్స్ కంటే మెయిల్ హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.  దీనివల్ల మొటిమలు రావడం, జుట్టురాలిపోవడం, అవాంఛిత రోమాలు రావడం అనే యాండ్రోజన్ ఎక్స్ సెస్ వల్ల జరుగుతుంది. దీంతో పీసీఓడీ వల్ల అండోత్పత్తి జరగకపోవడం, సంతానలేమి సమస్యతో బాధపడుతుంటారు.

లావుగా ఉంటే పీసీఓడీ సమస్య ఎదురవుతుందా అన్న అంశంపై లావుగా ఉన్న 80శాతం మహిళల్లో పీసీఓడీ సమస్యలు, 20శాతం లావుగా ఉన్న మహిళల్లో తిన్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటుంది. సన్నగా ఉన్న మహిళలకు జెనెటిక్ సమస్యలు, ఒత్తిడి వల్ల కూడా పీసీఓడీ సమస్య వస్తుంది. మనశరీరంలో  ఉన్న హార్మోన్స్ సమతూల్యంగా ఉండాలి. డోపెమిన్ హార్మోన్స్ , ప్రోలాక్టిన్ హార్మోన్స్ ఉంటాయి. డోపెమిన్ హార్మోన్స్ ఎక్కువగా ఉండి. ప్రోలాక్టిన్ హార్మోన్లు తక్కువగా ఉన్నా కూడా పీసీఓడీ సమస్యలు తలెత్తతుతాయి.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest