corona virus precautions | కరోనా వైరస్ పట్ల పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గతేడాది  చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకుతుంది. చైనా వుహాన్ నగరంలోని జంతువుల నుంచి మనుషులుకు సోకి ప్రపంచ దేశాల్ని అంధకారంలోకి నెట్టేస్తున్న ఈ వైరస్ ధాటికి 3వేల మందికి పైగా మరణించారు. ఆయా దేశాలు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి.

వైరస్ వ్యాపించడం అనివార్యం కావడంతో ప్రపంచ దేశాలు ఆ వ్యాధి నుంచి బయట పడేసే అతీత శక్తుల కోసం  ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు కోవిడ్-19 అని పిలవబడే వ్యాధికి కారణమయ్యే వైరస్ ఎందుకు సోకుతుంది..? జర్నీలు చేయడం వల్ల కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది అనే విషయాల గురించి ఇంకా చాలా మందికి పూర్తి స్థాయిలో తెలియదు.

స్మార్ట్ హెల్త్ టిప్స్ టీం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (who) ద్వారా కరోనా వైరస్ గురించి మరింత సమాచారం రీడర్స్ కు అందించే ప్రయత్నం చేస్తుంది. ఇచ్చే ఇన్ఫర్మేషన్ తో ఆందోళనకు గురి కాకుండా వైరస్ ను అరికట్టేలా మార్గాల్ని అన్వేషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.

కరోనా వైరస్ గురించి చెప్పేవన్నీ కల్పితాలే

telugu corona virus precautions in telugu

కరోనా గురించి మనం తరచుగా వింటున్నా అది ఎందుకు సోకుతుంది..? ఎలా సోకుతుంది..? అనే విషయాల గురించి ఎవరికి తెలియదు.  కల్పితాలతో కరోనా వైరస్ గురించి అంచనా వేస్తున్నాం. ఎందుకంటే మునుపెన్నడూ చూడని, మునుపు చూసిన వైరస్ జాతిలో కరోనా వైరస్ చాలా కొత్తగా ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం  సాధారణ జలుబు నుంచి తీవ్రమైన అనారోగ్యానికి గురి చేస్తుంది ఈ వైరస్.  చైనా వుహాన్ లో ప్రారంభమైన ఈ వైరస్ గత కొన్ని సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని ఆందోళనకు కలిగించే కరోనా జాతికి రెండు వైరస్ లని చెప్పుకోవచ్చు. అందులో 1. సివియర్‌ అక్యూట్‌రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (SARS) 2. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS). ఈ వైరస్ మనుషుల్లో బ్రీతింగ్ సమస్యలు, న్యుమోనియా, కిడ్నీలు, లంగ్స్ పై దాడి చేసి ద్రవాల్ని ఏర్పరుచుకుంటాయి.

కరోనా వైరస్ ఎంత ప్రమాదమంటే ..?

2002లో వచ్చిన సివియర్‌అక్యూట్‌రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (SARS) కంటే డేంజర్ ఈ కరోనా వైరస్ అని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. అప్పట్లో సార్స్  వైరస్ 10 శాతం అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకుంది. అయితే ఎపిడెమియాలజిస్టులు సార్స్,  మార్స్ కంటే కరోనా అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు. అయితే మరణాల రేటు తక్కువని అంటున్నారు. వైరస్ ప్రారంభంలో జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చన్న వైద్యులు.. పరిస్థితి చేయి దాటితే కష్టమేనంటున్నారు. వ్యాధి ప్రారంభంలో 2,000 కేసులు నమోదైనప్పటికీ  లక్ష మంది కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందన్నారు. మెల్ల మెల్లగా మరణాలు పెరుగుతుందని చెప్పారు.

కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది..?

సార్స్ కన్నా కరోనా చాలా స్పీడ్ గా వ్యాపిస్తుంది. జలుబు లక్షణాలతో వైరస్ అటాక్ చేస్తుంది. సార్స్ పూర్తి అనారోగ్యం ఉన్నప్పుడు దాడి చేస్తే. కరోనా వైరస్ అలా కాదు.. అనారోగ్యంతో ఉన్నామని అర్ధం కాక ముందే వ్యాపిస్తుంది

న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ఒక నివేదిక ప్రకారం కరోనా వైరస్ పై ప్రజలు అనారోగ్యంతో ఉన్నామని గుర్తించిన నిమిషాల వ్యవధిలో అంటువ్యాధిలా మారిపోతుందని తెలిపింది.

ఎవరి మీద కరోనా ప్రభావం ఉంటుంది..?

శ్వాసకోశ వ్యాధులు, వృద్ధులు, డయాబెటిస్, హై బీపీ వంటి అనారోగ్య సమస్యలున్న వారిలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  వైరస్ ప్రమాద స్థాయిలో మగవారిలో ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు వైరస్ ప్రభావం వ్యాధి నిరోదక శక్తిపై ఆధారపడి ఉంటుందని టొరంటో యూనివర్సిటీ ఎపిడెమియాలజిస్ట్ అల్లిసన్ మెక్‌గీర్ అన్నారు.

కరోనా వైరస్ పిల్లలికి సోకుతుందా..?

కరోనా పిల్లలికి సోకుతుందనే ఎలాంటి ఆధారాలు లేవు. సార్స్, మెర్స్ విషయం లో కూడా ఇదే జరిగింది.  వైరస్ పెద్దవారిలో వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. జ్వరం, ముక్కు కారటం, మరియు దగ్గు కు మాత్రమే పరిమితం అయినప్పటికీ, పిల్లలలో తీవ్రమైన సమస్యలు అసాధారణమని డబ్ల్యూ హెచ్ ఓ పేర్కొంది. అయితే పెద్దవారిలో కంటే పిల్లలకు కరోనా వైరస్ ప్రభావం తక్కువైనప్పటికీ వారి ప్రమాదం పెద్దల కంటే ఎక్కువ కానప్పటికీ స్కూల్‌ల్లో బ్యాక్టీరియా కారణంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపించగలదని తేల్చి చెప్పింది.

పిల్లలకు  అనారోగ్యాల నుంచి సురక్షితంగా కాపాడుకోవాలంటే కొన్ని అలవాట్లను నేర్పించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పలు సూచనలు చేసింది. ఫ్లూ టీ కాలను వేయించడం, చేతులు తరచుగా కడుక్కోవడం, అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు, కుటుంబసభ్యుల నుంచి దూరంగా ఉంచాలి. పిల్లలికి అనారోగ్యంగా ఉంటే స్కూల్ కు పంపించకుండా ఇంట్లో ఉంటేనే మంచిదని డబ్ల్యూ హెచ్ ఓ సూచిస్తుంది.

వైరస్ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు ఎలాంటి ట్రీట్‌మెంట్, మెడిసిన్ కానీ లేవు. కానీ కొన్ని ప్రాథమిక జాగ్రత్తల వల్ల వైరస్ సోకకుండా జాగ్రత్త పడవచ్చని తెలిపింది. వైరస్ పట్ల భయాందోళనకు గురి కాకుండా బ్రీతింగ్ సమస్యలు రాకుండా  చేతులను క్రమం తప్పకుండా క్లీన్ చేసుకోవాలి.  తుమ్ము వచ్చినప్పుడు ముక్కును, నోటిని క్లాత్ ను అడ్డం పెట్టుకోవాలి. అనారోగ్యంతో ఉన్న పిల్లలు స్కూల్ కు పంపకుండా ఉంటే మంచిది. బాత్‌రూం ఉపయోగించిన తరువాత, తినడానికి ముందు తిన్న తరువాత  20 సెకన్ల పాటు సబ్బు నీటితో కడగాలని డబ్ల్యూ హెచ్ ఓ  సిఫార్సు చేస్తుంది.  కళ్ళు, ముక్కు, నోటిని తాకనివ్వకుండా ఉంచాలి. తరుచూ తాకే వస్తువుల ను శుభ్రంగా ఉంచుకోవాలి.

see more – ఒక్కరోజే 57 కరోనా మరణాలు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest