సెగ గడ్డల్ని నయం చేసే అద్భుతమైన చిట్కాలు

సాధారణంగా శివరాత్రితో శివ శివ అంటు చలికాలం వెళ్లిపోతుందని మన పెద్దలు అంటుంటారు. కానీ ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో శివరాత్రికి ముందే ఎండలు మండుతున్నాయి. దీంతో ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు అల్లాడి పోతున్నారు. నీళ్లు ఎన్ని తాగినా దాహంగానే ఉంటుంది.  దీనికి తోడు సమ్మర్ తెచ్చే చర్మ వ్యాధులపై ఆందోళన చెందుతున్న ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మనం ఈ వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సెగ గడ్డలు విపరీతంగా ఇబ్బంది పెడతుంటాయి. శరీరంలో వేడెక్కువై చెమట పడుతోంది. ఈ చెమట వల్ల ఇన్ఫెక్షన్లు శరీరంపై దాడి చేస్తాయి. దీంతో మొహం మీద, తొడలు,గజ్జలు,శరీరంలో ప్రైవేట్ భాగాల్లో సెగ గడ్డలు ఏర్పడతాయి. అయితే ఏర్పడిన సెగ గడ్డల్ని నయం చేసేందుకు ఆహార నియమాలతో పాటు కొన్ని వంటింటి చిట్కాలు పాటిస్తే నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. సెగ గడ్డలు మానేందుకు పాటించాల్సిన చిట్కాలేంటో తెలుసుకుందాం.

పసుపు –

turmeric health benefits in telugu

మన వంటగదిలో ఉండే అద్భుతమైన దివ్య ఔషధం పసుపు. పసుపు కూరల్లోనే కాకుండా అన్నీ రకాల వ్యాధుల్ని నయం చేసే శక్తి ఉంది. తమిళనాడుకు చెందిన సైంటిస్ట్ లు పసుపుకు క్యాన్సర్ కు నయం చేసే శక్తి ఉందని, అందుకు సంబంధించిన పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. పసుపులో ఉన్న యాంటీబయోటిక్ లక్షణాలు శరీరాన్ని శుభ్రం చేస్తుంది. అన్నీ రకాల వ్యాధుల్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది. అంతేకాదు మనం వేసవికాలంలో ఇబ్బంది పడే సెగ గడ్డల(వేడి గడ్డలు) నుంచి విముక్తిని కలిగిస్తుంది. సెగ గడ్డలు వచ్చిన వారు,  సెగ గడ్డలతో బాధపడేవారు పసుపు- పాలు మరగబెట్టి తాగితే సెగ గడ్డలు త్వరగా నయమవుతాయని వైద్యులు చెబుతున్నారు.

టీ ట్రీ ఆయిల్  –

tea tree oil health benefits in telugu

సబ్బుల్లో రకరకాల క్రీముల్లో, బాడీ లోషన్లు, ఎయిర్ ఫ్రెషనర్లలో బ్యాక్టీరియాను అంతం చేసేందుకు టీ ట్రీ మిట్రసియా కుటుంబానికి చెందిన చెట్టు నుంచి తయారు చేసిన ఆయిల్ ను టీ ట్రీ ఆయిల్ అని పిలుస్తారు. శరీరంలో సెగ గడ్డలున్న ప్రాంతాన్ని వేడి నీటితో శుభ్రం చేసి టీ ట్రీ ఆయిల్ ను మెత్తటి దూదితో అప్లై చేయాలి. అనంతరం శుభ్రమైన గుడ్డను, లేదా బ్యాండ్ వేయాలి. అలా రోజు టీ ట్రీ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల సెగ గడ్డలు నయం అవుతాయి.

అల్లం – లవంగాలు –

summer health benefits of cloves and ginger in telugu

అల్లం, లవంగాల్ని  సాధారణంగా మన ఇంట్లో చికెన్, మటన్ లలో వినియోగిస్తుంటాం. అయితే ఈ పేస్ట్ సెగ గడ్డల్ని నయం చేసేందుకు వినియోగించుకోవచ్చు. అల్లం,లవంగాల్ని పేస్ట్ చేసి సెగ గడ్డలున్న చోట రాస్తే సమస్య నుంచి బయటపడొచ్చు.

ఉప్పు-

health benefits of salt in telugu

ఉప్పు సెగ గడ్డల్ని నయం చేసేందుకు మంచి చిట్కా అని చెప్పుకోవచ్చు. మరగబెట్టిన ఉప్పు నీటిలో గుడ్డను ముంచి సెగ గడ్డ మీద మర్దన చేయాలి. అలా చేస్తే గడ్డ పగిలి పోయి మానిపోతుంది.

వెనిగర్-పాలు- 

health benefits of vinegar and milk in telugu

సెగ గడ్డల్ని మాయం చేసేందుకు వెనిగర్ దివ్య ఔషధంగా పనిచేస్తుంది.  ఒక టీస్పూన్ పాలు, తగినంత  పసుపు, తగినంత  వెనిగర్ జోడించండి. ఆ మూడింటి ని కలిపి సన్నని మంటపై వేడి చేయాలి అనంతరం  ద్రవాన్ని సెగ గడ్డ లేసిన చోట పూస్తే మానిపోతుంది.

ఆపిల్ సై డర్ వెనిగర్  –

health benefits of apple cider vinegar in telugu

యాపిల్ సై డర్ వెనిగర్ సెగ గడ్డల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలున్న ఓ టీ స్పూన్ వెనిగర్ ను నీటిలో కరిగించి సెగ గడ్డమీద అప్లయ్ చేస్తే మానిపోతుంది.

వెల్లుల్లి(చిన్నులిపాయ) –

health benefits of  Garlic in telugu

వంటింట్లో మనకు దొరికే మరో గొప్ప ఔషధం ఉల్లిపాయ. అనాల్జేసిక్, యాంటీ ఫంగల్ మరియు క్రిమినాశక లక్షణాలున్న వెల్లుల్లి ముక్కలుగా కట్ చేసి నీటిలో మరగబెట్టాలి. అలా మరగబెట్టిన తరువాత వెల్లుల్లి సెగ గడ్డమీద పూయాలి. కొన్ని రోజులకు సెగ గడ్డ మానిపోతుంది.

జీలకర్ర (జీరా) –

health benefits of jeera powder in telugu

అందంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే జీలకర్ర సెగ గడ్డల్ని నయం చేస్తుంది. జీలకర్రను పేస్ట్ గా చేయాలి. పేస్ట్ ను మందంగా ఉండేలా తయారు చేసుకొని సెగ గడ్డలపై అప్లయ్ చేయాలి. అలా అప్లయ్ చేస్తే కొద్ది రోజులకే సెగ గడ్డలు తగ్గిపోతాయి.

బంగళా దుంప  –

health benefits of potato in telugu

ఇనుము, కాల్షియం, విటమిన్ బి, విటమిన్ సి, భాస్వరం, మెగ్నీషియం లక్షణాలున్న ఆలు గడ్డ నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని బాగా వేడి చేసి సెగ గడ్డ లేసిన చోటు పూయడం వల్ల సెగ గడ్డలు తగ్గిపోతాయి.

వేప చిగురు –

health benefits of neem leaves in telugu

సెగ గడ్డల్ని మాయం చేసేందుకు ప్రకృతి ప్రసాదించిన మరో గొప్ప దివ్య ఔషధం వేప చెట్టు. వేపచెట్టు యాంటీ బాక్టీరియల్, యాంటీమలేరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్ మరియు యాంటీ-హైపర్ కెమికల్ లక్షణాలను కలిగి ఉంది. వేప చిగురును మెత్తగా చేసి సెగ గడ్డ లేచిన చోటు పుయ్యాలి అనంతరం వేప చిగురు పూసిన ప్రాంతంలో గుడ్డతో కప్పి వేయాలి. అలా రోజుకు రెండు సార్లు చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయి. చూశారుగా. ఇక ఆరోగ్య పరమైన సమస్యలు, నివారణ మార్గాల గురించి తెలుసుకోవాలంటే www.smarthelathtips.in ను విజిట్ చేయండి.

ఇంకా చదవండి  – వడదెబ్బ తగలకుండా ఉండాలంటే

ఇంకా చదవండి – కంటి శుక్లాల్ని అదుపు చేసే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా

ఇంకా చదవండి  – కిడ్నీ స్టోన్స్ లక్షణాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest