సమ్మర్ సీజన్ లో పిల్లలు హెల్దీగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు పిల్లల విషయంలో తల్లిదండ్రుల్ని అనేక భయాలు పట్టి పీడిస్తుంటాయి. ఆఫ్ డే స్కూల్స్, ఎగ్జామ్స్, ఫెస్టివల్ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ ఇలా ఒకదాని తరువాత బిజీ షెడ్యూల్ తో పిల్లలు బిజీగా ఉంటే.. తల్లిదండ్రులు వారి పిల్లల ఆరోగ్యం విషయంలో తెగ హైరానా పడిపోతుంటారు. ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్. సమ్మర్ హాలిడేస్ లో పిల్లలు ఎంజాయ్ చేయాలని తెగ ఆరాట పడుతుంటారు.

హెల్త్ గురించి పట్టించుకోకుండా ఎక్కువ సమయం ఆరు బయట ఆడుకోవడానికి మక్కువ చూపుతుంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఆడుకోవడానికే ఇష్టపడతారు. కానీ సమ్మర్ సీజన్ తో పిల్లల ఆరోగ్యం  పాడవుతుందని ఇంట్లో నుంచి బయటకు పంపేందుకు ఇష్టపడరు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల సమ్మర్ లో పిల్లల్ని ఆరోగ్యంగా ఉండేలా కాపాడుకోవచ్చు.

జ్యూస్ : 

సమ్మర్ లో పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు జ్యూస్ లు ఎక్కువగా తాగించండి. దీంతో పాటు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చకాయల్ని తినిపించండి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తినడం వల్ల శరీరం వేడెక్కకుండా ఉంటుంది. అంతేకాదు పిల్లలు ఆరోగ్యంగా, హెల్దీగా ఉంచేందుకు సాయపడతాయి.

 

 

 

 

అతి నీల లోహిత కిరణాలు : 

అతినీలలోహిత కిరణాలు లేదా అల్ట్రా వయొలెట్ కిరణాలు అని పిలవబడే ఈ కిరణాలు సమ్మర్ సీజన్ లో అత్యంత ప్రమాదకరమైనవి. ఈ కిరణాలు పిల్లలతో పాటు పెద్దల ఒంటిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. కంటికి కనిపించని ఈ కిరణాలు ఒంటిపై పడినప్పుడు గులాబీ రంగు దద్దులు వస్తుంటాయి. ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్ లో వచ్చే దద్దులు తీవ్రంగా ఇబ్బంది పెడతుంటాయి. ఓ వైపు ఒంట్లో వేడి ..మరో వైపు  ఈ దద్దులు నరకమనే చెప్పుకోవాలి. సాధారణంగా ఈ గులాబీ రంగు దద్దులు పది రోజుల్లో మాయం అవుతాయి. పది రోజులు దాటితే చర్మ సంబంధిత వైద్యుల్ని సంప్రదించాలి. అయితే ఈ కిరణాల నుంచి పిల్లల్ని కాపాడేందుకు లేత రంగులో ఉన్న కాటన్ దుస్తుల్ని ధరించాలి.  ఈ దుస్తులతో అతినీలలోహిత కిరణాలనుంచి ఉపశమనం పొందవచ్చు.

 

టోపీలు ధరించండి :

పిల్లలు ఎండ వేడిమి నుంచి కాపాడేందుకు టోపీలు ఉపయోగపడతాయి. పూర్వం రాజులు తలల సంరక్షణ కోసం ఉపయోగించేవారు. రానురాను కుర్ర కారు ఫ్యాషన్ గా ఉండేందుకు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ టోపీలే సమ్మర్ సీజన్ లో పిల్లలు సన్ స్ట్రోక్ తగలకుండా ఉండాలంటే టోపీలు ధరించడం చాలా ముఖ్యం

 

 

 

ఎస్ పీఎఫ్ – 15, ఎస్ పీఎఫ్ – 30 ని అప్లయ్ చేయండి  : 

పిల్లలు టూర్లు, ఆటాడుకునేందుకు బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే అలా బయటకు వెళ్లే పిల్లలకు వైద్యుల సలహాతో  మెడికల్ షాపులో దొరకే  ఎస్ పీఎఫ్ – 15 శరీరానికి అప్లయ్ చేయండి.

ఎస్ పీఎఫ్ – 15అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటారు. ఈ క్రీమ్ లను శరీరానికి అప్లయ్ చేయడం వల్ల 150 నిమిషాలు ఎండ నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంతో అతి నీల లోహిత కిరణాలు, లేదా యూవీ కిరణాల నుంచి శరీరాన్ని కాపాడతాయి. అలా అప్లయ్ చేయకపోవడం వల్ల అతినీలలోహిత కిరణాలు శరీరంపై పడి చర్మవ్యాధులు వస్తాయి.

ఎస్ పీఎఫ్ -15తో పాటు ఎస్ పీఎఫ్ -30ని శరీరానికి అప్లయ్ చేయాలి. వేసవిలో చర్మం, మొహం పొడిబారిపోకుండా ఉండేందుకు సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్ పీఎఫ్) ను శరీరానికి అప్లయ్ చేయడం వల్ల శరీరానికి పట్టిన చెమట ను పీల్చివేసేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు ఎక్కువ సేపు వాటర్ లో ఉన్నా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు  వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్ చక్కగా ఉపయోగపడతాయి.

 అంటు వ్యాధులకు దూరంగా  :

ఎండా కాలంలో పిల్లలకు అంటు వ్యాధులు వేధిస్తుంటాయి. చెమట, ఒంట్లో వేడి అంటు వ్యాధులకు కారణమవుతుంటాయి. చెమట వల్ల ప్రైవేట్ పార్ట్ లలో దద్దుల లేస్తుంటాయి. ఆ దద్దుల వల్ల ఇన్ఫెక్షన్లు తీవ్రంగా ఇబ్బంది పెడతుంటాయి. వేసవికాలంలో వైద్యుల పర్యవేక్షణలో అంటు వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

 

 

 

చల్లటి ప్రదేశాల్లో ఆడుకునేలా చూడండి : 

ఎండలో ఆడేందుకు పిల్లలు ప్రయత్నిస్తుంటారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పిల్లలు ఇంట్లో ఉండేలా ఆంక్షలు విధించండి. చల్లటి ప్రదేశాల్లో ఆటలు ఆడేలా జాగ్రత్త పడాలి. వేసవి కాలం ఎండ నుంచి వచ్చే కిరణాలు అత్యంత ప్రమాదకరమైనవి. హాని కలిగిస్తాయి. కాబట్టి ఎండలో తిరగకుండా ఉండేలా చూసుకోవాలి.

 

 

 

పండ్లను తినిపించండి :

సమ్మర్ సీజన్ లో అన్నానికి బదులు పండ్లను, పండ్ల రసాలను తాపించండి. ఆరోగ్యంతో పాటు శరీరం కూల్ గా ఉండేలా చూస్తాయి. పండ్లలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పుచ్చకాయలు, స్ట్రా బెర్రీలతో  పీచు పదార్ధాలను తినిపించండి.

 

 

 

 

జంక్ పుడ్ ను దూరం చేయండి :

పిల్లలు జంక్ ఫుడ్ ను ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతుంటారు. జంక్ ఫుడ్  తినకుండా జాగ్రత్త పడండి. జంక్ ఫుడ్ తో పాటు కాల్చిన మాంసాన్ని తినిపించకూడదు. కాల్చిన మాంసం తినడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయి.

 

 

 

 

నీరు పుష్కలంగా తాగించండి :

వేసవి కాలంలో వచ్చే వేడి వల్ల శరీరం  డీహైడ్రేషన్‌ కు కారణమవుతుంది. దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చి పడుతుంటాయి. అందుకే సమ్మర్ సీజన్ లో పిల్లలు ఎక్కువ నీళ్లు తాగేలా చూసుకోవాలి.  పిల్లలకు దాహం లేకపోయినా మంచి నీళ్లను తాగించండి.

 

 

 

 

 

 

ఇంకా చదవండి -సెగ గడ్డల్ని నయం చేసే అద్భుతమైన చిట్కాలు

ఇంకా చదవండి – కంటి శుక్లాల్ని అదుపు చేసే అద్భుతమైన ఆయుర్వేద చిట్కా

ఇంకా చదవండి -కిడ్నీ స్టోన్స్ లక్షణాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇంకా చదవండి –  సమ్మర్ సీజన్ లో ఆరోగ్యంగా ఉండేందుకు అద్భుతమైన చిట్కాలు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest