Summer Sunstroke Tips | వడదెబ్బ తగలకుండా ఉండాలంటే

హాట్ సమ్మర్ లో కూల్ గా ఉండడం చాలా అవసరం. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా సమ్మర్ లో మన శరీరాన్ని కూల్ గా ఉంచడం వల్ల చర్మ వ్యాధులతో పాటు, వడదెబ్బలాంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. ఇందుకోసం మన బాడీని ఎప్పుడు కూల్ గా ఉంచాలి. తినే ఆహారంలో మార్పులు చేయాలి. సాధారణంగా ఎనర్జీ కోసం అన్నం తింటాం. కానీ సమ్మర్ లో అన్నానికి బదులు  శరీరాన్ని చల్లబరిచే శీతలపానీయాలు తాగడం అలవాటు చేసుకోవాలి. వాటితో పాటు కొన్ని చిట్కాలు పాటించి హాట్ సమ్మర్ లో బాడీని కూల్ గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

పుచ్చకాయలు 

Watermelon summer health tips in telugu

సమ్మర్ సీజన్ అంటే ముందుగా గుర్తొచ్చేది పుచ్చకాయ. దీనిలో 91.45 నీటి శాతం ఉన్నందున వేడి నుంచి ఉపశమనం పొందొచ్చు. శరీరంలో నీటి శాతాన్ని కాపాడేందుకు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్న పుచ్చకాయ తింటే ఒంట్లో వేడి మటు మాయం అవుతుంది. దీంతో పాటు సమ్మర్ సీజన్ లో ఆరోగ్యంగా ఉండేందుకు అద్భుతమైన చిట్కాలు  ఎలా ఉన్నాయో తెలుసుకోండి 

 

తాటి ముంజలు

taati munjalu benefits summer season in telugu

వేసవిలో దొరికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప మెడిసిన్ తాటి ముంజలు. తాటి ముంజలు తినడం వల్ల మన శరీరం కూల్ గా ఉంటుంది. అంతేకాదు ప్రమాదకరమైన వడదెబ్బ నుంచి సురక్షితంగా ఉండాలంటే తాటి ముంజలు తినడం చాలా ఉత్తమం. వాటిల్లో ఉన్న వాటర్ కంటెంట్ శరీరానికి వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. చర్మ పొడి బారి పోకుండా కాపాడుతుంది.

కీర దోసకాయ

summer health benefits of keera dosakaya in telugu

ఫైబర్ లక్షణాలున్న కీర దోసకాయ సమ్మర్ సీజన్ లో వేడి నుంచి కాపాడుతుంది. అంతేకాదు శరీరాన్ని రీహైడ్రేట్ చేయడంలో కీర దోసకాయ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మలబద్ధకాన్ని నివారించడంతో పాటు ఛాతీలో మంట, బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది

పెరుగు

summer curd health benefits in telugu

పెరుగు రుచికరంగా ఉండడమే కాదు సమ్మర్ సీజన్ లో శరీరం కూల్ గా ఉండేలా చేస్తుంది. ఎండల్లో పెరుగుతో  మసాలా మజ్జిగ, లస్సీని తయారు చేయండి. పెరుగుతో మీకు నచ్చిన ఫ్రూట్స్ ను యాడ్ చేసుకొని తినండి. నోరు పొడిబారిపోకుండా ఉంటుంది.

కొబ్బరి నీళ్లు

summer coconut water benefits in telugu

సమ్మర్ సీజన్ లో ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం కొబ్బరి నీళ్లని చెప్పుకోవచ్చు. మధ్య తరగతి కుటుంబాలకు కాస్త ఖరీదైన ఆస్పత్రి పాలు అవ్వడం కంటే  విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర పోషకాలున్న కొబ్బరి నీళ్లు తాగడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. చల్లని లక్షణాలున్న కొబ్బరి నీళ్లు వేడినుంచి ఉపశమనాన్ని ఇస్తాయి.  కొబ్బరి నీళ్ళు క్రమం తప్పకుండా తాగడం వల్ల క్యాన్సర్ నుంచి  రక్షిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

పుదీనా

summer benefits of pudina in telugu

ఆరోగ్య పుష్కరిణిగా పేరొందిన పుదీనాను తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. పుదీనాను టీ తోపాటు కీరదోస, పుచ్చకాయ, కొబ్బరి నీళ్లతో కలిపి తీసుకోవడం వల్ల శరీరం కూల్ అవుతుంది. అంతేకాదు గురక సమస్య, తలనొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.

ఆకుకూరలు

summer health benefits of Leafy vegetables in telugu

ఏడాది పొడవున ఆకుకూరలు తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో  ఆకు పచ్చ ఆకు కూరలలో అధిక నీటి శాతం ఉంటుంది. దీంతో  మీ రోజువారీ ఆహారంలో ఆకు పచ్చని ఆకు కూరల్ని చేర్చడం ఎంతో ప్రయోజక రం. సమ్మర్ లో కూరగాయలను ఎక్కువగా వండటం మానుకోవాలి. ఎందుకంటే వాటిలో నీటి శాతం  తక్కువగా ఉండి.  శరీరంలో వేడి ఎక్కువవుతుంది.

ఉల్లిపాయలు

Health Benefits of Onion in Telugu

ఉల్లిపాయను తినడం వల్ల శరీరంలో చల్లబడుతుంది. ఉల్లిపాయను నార్మల్ గా తినలేం కాబట్టి నిమ్మకాయ, ఉప్పు కలిపిన సలాడ్లు, ఆకు కూరలు, కూరగాయల్లో ఎక్కువగా యాడ్ చేయడం మంచిది. ఎర్ర ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అనే పోషకాలు ఉండడం వల్ల  అలర్జీల నుంచి కాపాడుతుంది. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది.

కర్బూజాలు

summer health benefits of Kharbuja in telugu

కర్బూజాలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో పుచ్చకాయను ఎలా తింటామో కర్బూజాలను అలా తినొచ్చు. ఉడకబెట్టు కొని తినొచ్చు నార్మల్ గా తినొచ్చు. కర్బూజా వల్ల శరీరంలో వేడి తగ్గిపోతుంది.

నింబూపానీ

nimbu pani benefits of summer in telugu

సమ్మర్ సీజన్ లో బాడీని కూల్ చేసే మరో కూల్ డ్రింక్ నింబూపానీ. నిమ్మకాయతో చేసిన ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరంలో కూల్ అవ్వడమే కాదు  పొటాషియం రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. స్ట్రెస్, డల్ నెస్ ను తగ్గిస్తుంది. సమ్మర్ లో నింబూ పానీ తాగడం వల్ల శరీరం కూల్ అవ్వడమే కాదు మైండ్ రిఫ్రెష్ అవుతుంది.

ఆకుకూరలు

ఆకుకూరల్లో  95 శాతం నీరు ఉంటుంది. పోషక పదార్ధాల్ని అందించడమే కాదు శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది. ఆకు కూరల్లో  సోడియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం, జింక్ లు ఆరోగ్యాన్నిస్తాయి.

 

 

 

 

One Comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest