ఆయుర్వేద పద్దతిలో నడుం నొప్పిని పోగొట్టే చిట్కా

తెలుగు ఆయుర్వేద పద్దతిలో బ్యాక్ పెయిన్ ని నివారించేలా కొన్ని చిట్కాలు పాటిద్దాం. బ్యాక్ పెయిన్ అనేది ముఖ్యంగా  ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చొన్న కూర్చుండిపోవడం, వందల కిలోమీటర్లు వాహనాలు నడపడం, ఎలాంటి వ్యాయామాలు చేయకపోవడం, మలబద్ధకం (డైజెషన్ కాకపోవడం) తో బాధపడేవారి అపార వాయువు ( గ్యాస్ )నడుంలోకి వెళ్లి నడుం నొప్పి వస్తుంది.  అయితే ఈ నడుం నొప్పిని ఏల్చూరి ఆయుర్వేదం పద్దతిలో,యోగాసనాల ద్వారా నయం చేసుకోవచ్చు.

నడుం నొప్పిని పోగొట్టే ఆసనం

telugu ayurveda back pain tips
telugu ayurveda back pain tips | back pain home remedies in telugu

సేతు బంధ నాసనం లేదా వంతెన భంగిమ అంటారు. సంస్కృతంలో సేతు అంటే వంతెన, బంధం అంటే బంధం, ఆసనం అంటే భంగిమ ఈ మూడు కలిపి సేతు బంధనాసనం అంటారు.

 ఈ ఆసనాన్ని ఎప్పుడు వేయాలి

ఖాళీకడుపుతో ఈ ఆసనం వేసే నాలుగు గంటల ముందు భోజనం చేసేలా చూసుకోవాలి. ఉదయం చేస్తే ఉత్తమం. సాయంత్రం కూడా ఈ ఆసనం వేయొచ్చు.

ఆసనాన్ని ఎలా వేయాలి

వెల్ల కిలా పడుకోవాలి(ఆకాశంవైపు తిరిగి) పడుకున్నప్పుడు వీపు భాగం పూర్తిగా నేలకు ఆనిచ్చాలి. నడుంకు భూమికి మధ్య ఎలాంటి గ్యాప్ ఉండకూడదు.

పడుకున్న అనంతరం నిటారుగా ఉన్న కాళ్లని మోకాళ్ల వరకు మడవాలి

చేతుల్ని సైతం కింద నిటారుగా ఉంచిన తరువాత నెమ్మదిగా నడుం భాగాన్ని పైకి లేపాలి.

పూర్తిగా కాకుండా మోకాళ్లనుంచి గుండె వరకు బ్రిడ్జ్ ఫోజ్ లో ఉంచాలి.

అనంతరం నిటారుగా ఉన్న చేతుల్ని రెండు కాళ్ల గిలకల వెనక పైపు ఉంచాలి. ఇలా భంగిమ కనీసం నిమిషం పాటు ఉంచాలి. ఈ భంగిమను చాలా జాగ్రత్తగా సర్టిఫైడ్ యోగా టీచర్ ఆధ్వర్యంలో చేయాలి.

ఈ ఆసనం పై సూచనలు  

ఈ ఆసనాన్ని ఆచరించేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు

♦  మెడ నొప్పి, గాయంతో బాధపడేవారు ఈ ఆసనం వేయకూడదు.

♦  సర్టిఫైడ్ యోగా టీచర్, డాక్టర్ అనుమతితో చేయాలి.

♦  గర్భిణీ స్త్రీలు ఈ ఆసనాన్ని చేయవచ్చు. కానీ సొంతంగా చేయకూడదు.  తప్పనిసరిగా యోగా నిపుణుల మార్గదర్శకత్వంలో చేయాలి.

♦  గర్భిణీ స్త్రీలు మూడో నెలలో ఉన్నప్పుడు ఈ ఆసనం గురించి డాక్టర్ ను అడిగి తెలుసుకోవాలి.

♦  మీకు వెన్నునొప్పి ఉంటే తప్ప ఈ ఆసనం వేయకూడదు.

కొత్త ఆసనం వేసేవారికి సలహాలు

♦  తొలిసారి ఆసనం వేసే వాళ్లు ఆహార నియమాలు పాటించాలి.

♦  నొప్పి వస్తున్నా బలవంతంగా వేయకూడదు.

♦  ఆసనం వేసినప్పుడు నడుం భాగం బ్రిడ్జి ఆకారం లో ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం ఎత్తు తక్కువలో ఉంచాలి.

♦  రెండు మూడు వారాల అనంతరం అనుకున్న ట్లుగా ఈ ఆసనం వేసుకోవచ్చు.

♦  మీద సమాన సమయం కోసం అదే పునరావృతం చేయండి.

సేతు బంధనాసనం యొక్క ప్రయోజనాలు

వంతెన భంగిమ యొక్క కొన్ని అద్భుతమైన ప్రయోజనాలను చూడండి.

♦  ఈ ఆసనం వెనుక కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. వెనుక భాగంలో చిక్కుకున్న ఒత్తిడిని తగ్గించడానికి కూడా సాగదీయడం సహాయపడుతుంది.

♦  మెడ, వెన్నెముక , ఛాతీ వెడల్పయ్యేలా చేస్తుంది.

♦  ఈ ఆసనంతో డిప్రెషన్, స్ట్రెస్, ఆందోళన తగ్గుతుంది. బ్రెయిన్ ను కూల్ గా ఉంచుతుంది.

♦  లంగ్స్ తెరుచుకొని గాలి లోపలికి వెళ్లి నొప్పి, గుటకపడకపోవడం లాంటి సమస్యల్ని నివారిస్తుంది.

♦  థైరాయిడ్ సమస్యల్ని నివారిస్తుంది.

♦  ఈ ఆసనం జీర్ణ అవయవాలను మసాజ్ చేస్తుంది, తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

♦  ఈ ఆసనం గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది.

♦  స్త్రీలకు రుతుక్రమంలో వచ్చే నొప్పిని అరికడుతుంది.

♦  పురుషులలో తలనొప్పిని అరికడుతుంది.

♦   ఇది అధిక రక్తపోటు, సైనసిటిస్, ఉబ్బసం, నిద్ర లేమి సమస్యల్ని దూరం చేస్తుంది.

♦  ఈ ఆసనం క్రమం తప్పకుండా వేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

♦  వైద్య పరిభాషలో ఈ ఆసనాన్ని బ్రిడ్జ్ ఫోజ్ అంటారు.

♦  బ్రిడ్జ్ పోజ్ అని  పిలిచే ఈ భంగిమ వల్ల  గుండె, ఛాతీ, భుజాలు ఫ్రీ అయ్యేలా చేస్తుంది.

♦  మెడ వెనుక భాగం,  వెన్నెముక మరియు తొడలు ఫ్రీగా ఉండేలా చేస్తుంది.

♦   ఈ ఆసనంలో మీ గుండె మీ తలకంటే ఎత్తులో ఉంటుంది. కొంచెం నొప్పిగా ఉన్నా అనేక ప్రయోజనాలున్నాయి. ఆందోళన, అలసట, ఒత్తిడి, నిద్ర లేమి, తలనొప్పి, నిరాశ నుంచి ఉపశమనం లభిస్తుంది.

♦  ఇది మనస్సును శాంతపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది .

ఛాతీ భాగం వెడల్పు అవ్వడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది.   ఆస్తమాతో బాధపడేవారికి ఎంతో ప్రయోజనం చే కూరుస్తుంది.

ఈ ఆసనం థైరాయిడ్ గ్రంథులను ఉత్తేజ పరుస్తుంది . బ్రీతింగ్ సమస్యలను దూరం చేస్తుంది.

ఉద్యోగాల వల్ల రోజంతా కంప్యూటర్ ముందు గడిపే వారికి ఇది గొప్ప ఆసనం. మోకాలు ,భుజం వెడల్పు అవ్వడం వల్ల శరీరానికి ఎనర్జీ వస్తుంది.

ఏల్చూరి ఆయుర్వేదం పద్దతిలో నడుం నొప్పి పోవాలంటే

నడుం నొప్పి శాశ్వతంగా ఉంటే చాలా ప్రమాదం. అందుకే నొప్పి ప్రారంభదశలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. నడుం నొప్పి పోవాలంటే యోగ, నేచురల్(ఆయుర్వేద) పద్దతిలో పోగొట్టుకోవచ్చు

కావాల్సిన పదార్ధాలు  – ఎండు ఖర్జూరం, గవ్వ పలుకు సాంబ్రాణి పొడి, దారం, మైదా పిండి

తయారు చేసే విధానం

ఎండు ఖర్జూరం కాయను సగానికి విడదీసి లోపల ఉన్న గింజని తీసివేయాలి. గవ్వ పలుకు సాంబ్రాణి పొడిని మెత్తగా చేసి విడదీసిన రెండు ఖర్జూరం కాయల్లో నింపాలి. అనంతరం ఆ రెండిటిని కలిపి విడిపోయిన ఖర్జూర కాయని దారంతో చుట్టాలి. ఆ తరువాత ఖర్జూరం కాయపై తయారు చేసిన మైదా పిండి పుయ్యాలి.  తరువాత సన్నని మంటపై దోరగా కాల్చాలి. దోరగా కాలిస్తే ఖర్జూరం కాయ ఎర్రటి రంగులోకి మారుతుంది. అనంతరం ఖర్జూరం కాయకు ఉన్న మైదా పిండిని, చుట్టిన దారాన్ని తీసేయాలి. ఖర్జూరం కాలడంతో లోపల ఉన్న పిండి మెత్తగా తయారవుతుంది. అలా తయారైన పిండిని ఖర్జూరంతో సహా మెత్తగా తయారు చేసి బఠానీ గింజలా తయారు చేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి. ప్రతిరోజు నడుం నొప్పితో బాధపడేవారు ఆ గింజల్ని మూడు, నాలుగు వారాల పాటు తినాలి. దీంతో పాటు యోగా చేయడం, ఆహార నియమాల్ని పాటించడం చేస్తే డాక్టర్ తో పని లేకుండా నడుం నొప్పిని శాశ్వతంగా మటుమాయం చేసుకోవచ్చు.

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest