Back Pain After Pregnancy : మహిళల్లో వెన్నునొప్పిని తగ్గించే మార్గాలు

గర్భం దాల్చిన మహిళలు పురిటి నొప్పులు తట్టుకోలేక, త్వరగా డెలివరీ అవ్వడం వల్ల, కొన్ని సందర్భాల్లో వైద్యులు ఆపరేషన్ చేసి గర్భం నుంచి బయటకు తీస్తారు. అయితే ఆపరేషన్ చేసే సమయంలో శరీరంలో ఉన్న రక్తం బయటకు రావడం, ఆపరేషన్ చేయడంతో పాటు రకరకాల కారణాల వల్ల గర్భిణీలకు అనేక రకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిలో అతి ముఖ్యమైన సమస్య నడుం నొప్పి.

Back Pain After Pregnancy

సీ- సెక్షన్ చేయించుకున్న మహిళల్లో బ్యాక్ పెయిన్ అనేది సర్వసాధారణం. కానీ ఆ నొప్పిని తట్టుకోవడం చాలా కష్టం. ఈ నొప్పి కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అయితే ప్రారంభం దశలో నడుం నొప్పి తగ్గాలంటే డాక్టర్ సలహాలతో డైట్ ప్లాన్ ను ఫాలో అవ్వా లి. అవసరమైతే యోగా ను అలవాటు చేసుకోవాలి. డైట్ ప్లాన్, యోగాలతో నడుం నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.

డెలివరీ తరువాత నడుం నొప్పికి ( వెన్నునొప్పి)కి కారణాలు..?

డెలివరీ తరువాత శరీరంలో జరిగే అనేక మార్పులు, పని, ఆహారపు అలవాట్లు, డెలివరీ సమయంలో విపరీతమైన ఒత్తిడి వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది.

 డెలివరీ తరువాత వెన్ను పూసలో నొప్పి రావడానికి కారణాలు

గర్భిణీల కాన్పు సులభంగా అయ్యేందుకు  శరీరం ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ల ను విడుదల చేస్తుంది. ఆ హార్మోన్ల ప్రభావం కొన్ని నెలల పాటు ఉంటుంది. అదే సమయంలో హార్మోన్లు విడుదల అయ్యే సమయంలో  కీళ్లల్లో ఉన్న జాయింట్లు (జాయింట్ లో ఎముకల్ని కలిపే భాగాన్ని స్నాయువులు లేదా లిగమెంట్ ) ఒక్కసారిగా ఓపెన్ అవుతాయి. అయితే సమయంలో లిగమెంట్లు బలహీనంగా ఉన్న మహిళల్లో బ్యాక్ పెయిన్ సమస్య తలెత్తుతుంది.

♦ కొంతమంది తల్లులకి పాలు ఎలా కూర్చొని పట్టాలో తెలియదు. దాని వల్ల కండరాలు బిగుసుకుపోయి వెన్నునొప్పి వస్తుంది.

♦ డెలివరీ సమయంలో గర్భాశయం తెరుచుకోవడం వల్ల పొట్ట భాగంలోని కండరాలు బలహీన పడి వెన్నెముకను ముందుకు లాగతాయి. దీంతో వెనుక కండరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది.

♦ అధిక బరువు ఉండటం వెన్నెముక భాగంలో ఒత్తిడి ఏర్పడుతుంది.

♦ మీ బిడ్డను ఎత్తడానికి లేదా మరేదైనా పనికోసం కోసం తరచుగా వంగడం వల్ల వెన్నునొప్పి వస్తుంది.

♦  గర్భవతిగా ఉన్నప్పుడు కాన్పు సమయంలో వెన్నునొప్పి ఉంటే అది ప్రసవం అనంతరం కూడా కొనసాగే అవకాశం ఉంది.

డెలివరీ తరువాత వెన్నునొప్పి ఎంతకాలం ఉంటుంది?

సాధారణంగా  డెలివరీ తర్వాత ఆరు నెలల్లో వెన్నునొప్పి తగ్గుతుంది  అప్పటికి, రిలాక్సిన్ హార్మోన్ స్థాయి స్థిరపడి శరీరం సాధారణ స్థితికి వస్తుంది. దీంతో వెన్నునొప్పి తగ్గిపోతుంది. కండరాలు, కీళ్లు బిగుసుకుపోవడం వల్ల శరీరం శక్తివంతంగా తయారవుతుంది. దీంతో   వెన్నునొప్పి తగ్గుతుంది. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో తొలిసారి గర్భం దాల్చిన మహిళల శారీరక శ్రమ  కారణంగా నొప్పి సుమారు 12 నెలలు కొనసాగుతుంది. అయితే ఈ నొప్పినుంచి శాశ్వతంగా ఉపశమనం పొందాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి.

డెలివరీ తరువాత వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ మార్గాలన్నీ అవగాహన కోసమే తప్ప సొంతంగా చేయకూడదు. డాక్టర్లు, యోగా టీచర్ల సలహా తప్పని సరిగా తీసుకోవాలి.    

1.డెలివరీ జరిగిన ఒక నెల తర్వాత సాధారణ బరువు ను తిరిగి పొందడానికి ప్రయత్నాలు చేయండి. బరువు కోసం మంచి డైట్ ను ఫాలో అవ్వాలి

2 . డెలివరీ తర్వాత వ్యాయామం, లేదా యోగా చేయండి. ఎందుకంటే  కండరాలు, శరీరంలో ప్రధాన అవయవాల్లోని భాగాలను కీళ్లకు అండగా ఉండే లెగిమెంట్ లు  ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. సి-సెక్షన్ చేయించుకున్న గర్భిణీలు నడక సురక్షితమైన వ్యాయామం అని చెప్పుకోవచ్చు. నడక నడుం భాగంలోని కండరాలు శక్తివంతంగా ఉండేలా చేస్తుంది.

3. మీరు పృష్ట కటి వంపు లేదా పెల్విక్  ట్లైట్స్ అని పిలిచే వ్యాయామం చేయాలి. ఇది ఎలా చేయాలో ఇక్కడ గమనించవచ్చు.

♦మీ వీపు మీద పడుకోండి. మోకాళ్లను వంచి, మీ పాదాలను నేలపై చదును గా ఉంచాలి.

♦గాలిని బొడ్డు భాగం వరకు పీల్చాలి.

♦బొడ్డు భాగంలో ఉన్న గాలిని వెన్నెముక నుంచి యథావిధిగా ముక్కతో వదలాలి.

♦అలా ప్రతీ రోజు ఈ వ్యాయామాన్ని 8 నుంచి 10 సార్లు చేయాలి.

గమనిక – సీ – సెక్షన్ డెలివరీ అయితే వ్యాయామం చేసేందుకు  కనీసం ఆరు వారాలు పూర్తయిన తరువాతే చేయాలి.    

4. సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలి. శారీరక శ్రమ వెన్ను నొప్పిని పెంచుతుంది.

5.డెలివరీ తర్వాత భారీ వస్తువులను ఎత్త వద్దు. ఎందుకంటే కండరాలు, కీళ్లపై ఒత్తిడి తెస్తుంది

6. కూర్చొన్నప్పుడు సరైన భంగిమలో కూర్చోవాలి. తల్లి పాలిచ్చేటప్పుడు బిడ్డ వైపు వంగకూడదు. నిటారుగా  కూర్చోవాలి. తల్లి పాలిచ్చేటప్పుడు  భుజం లేదా వెనుక భాగంలో నొప్పి ఉంటే పిల్లలకు ఆహారాన్ని అలవాటు చేయండి.

7. కూర్చోవడానికి సౌకర్యంగా ఉండే కుర్చీలో కూర్చోండి. వీపు భాగంలో దిండ్లను పెట్టుకోండి. కుర్చీలో కూర్చొన్న తరువాత మీ పాదాలను నేల నుండి కొద్దిగా పైకి లేపేలా వెన్నెముక పై  బరువు పెట్టకుండా  ఫుట్ స్టూల్ ఉపయోగించండి.

8. డెలివరీ తర్వాత కొన్ని నెలలు హై హీల్స్  ధరించడం మానుకోవాలి.

9. పాపాయిని తుంటిపై ఎక్కువసేపు మోయడం కూడదు. ఎందుకంటే ఇది వెనుక కండరాలపై నిరంతరం ఒత్తిడి తెస్తుంది. మీ బిడ్డను మోసేందుకు ఫ్రంట్ ప్యాక్ ను  ఉపయోగించండి.

10. బిడ్డను ఎత్తుకొనేటప్పుడు చేతులు చాచకూడదు. బదులుగా దగ్గరగా ఉండి ఎత్తుకోవాలి.

11. సౌకర్యంగా పడుకోండి. అందుకోసం దిండ్లను ఉపయోగించండి.

12. నేల నుండి ఏదైనా తీసేందుకు  మీ వెనుక భాగంలో ఒత్తిడిని తగ్గించడానికి నడుము వద్ద వంగడం కంటే మీ మోకాళ్లను వంచి తీసుకోవడం ఉత్తమం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest