బ్రష్ ఇలా చేస్తే దంత సమస్యలు మటుమాయం

దంతాలు శుభ్రంగా ఉంటే పలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కాబట్టే దంతాల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.

రకరకాల ఆహారపు అలవాట్లు, స్మోకింగ్, డ్రింకింగ్‌‌, ఆహారం తినే విషయంలో  సమయ పాలన పాటించకపోవడం వల్ల మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నా చిగుళ్ల నొప్పి , పళ్లు పుచ్చిపోవడం, రంగు మారడం ఇలా రకరకాల సమస్యలు మనల్ని వేధిస్తుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల దంత సమస్యల్ని నివారించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మన దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాలి. దంతాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, దంత సమస్యల్ని పరిష్కరించాలన్నా మన రోజూ వారి అలవాట్లను మార్చుకోవాలి. వాటిల్లో

  1. బ్రష్ చేయకుండా పడుకోకూడదు.

రోజుకి రెండు సార్లు బ్రష్ చేయడం అనేది సర్వసాధారణం. ఉదయం నిద్రలేచిన తరువాత, నైటి పడుకోబోయే ముందు. కానీ కొంతమంది నైట్ బ్రష్ చేయకుండా బద్దకం, అలసటతో పడుకుంటారు. కానీ వైద్యులు మాత్రం తప్పని సరిగా రోజుకి రెండు సార్లు బ్రష్ చేయాలని సూచిస్తున్నారు.  దీంతో  రోజుకి రెండు సార్లు బ్రష్ చేయాలని వైద్యులు చెప్పినా కొంతమంది అవేం పట్టించుకోరు. నైట్ పడుకోబోయే ముందు బ్రష్ చేయడం వల్ల మన నోటిలో క్రిములు, పేరుకుపోయిన  వ్యర్ధాలు తొలిగిపోతాయి.

  1. జాగ్రత్తగా బ్రష్ చేయాలి.

కొంతమంది బ్రష్ ను గంటల తరబడి చేస్తుంటారు. అలా చేయడం వల్ల మనదంతాలకు రక్షణగా ఉండే ఎనామెల్ అరిగిపోతుంది. దీంతో మీరు ఏ పదార్ధాల్ని తిన్నా పళ్లు జివ్వు మంటాయి. అందుకే దంతాల్ని రెండు లేదా, మూడు నిమిషాలు బ్రష్ చేయాలి.  టూత్ బ్రష్ తో నెమ్మదిగా, వృత్తాకార కదలికలతో దంతాల్ని శుభ్రం చేసుకోవాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు బ్రష్ చేయడం వల్ల పళ్లకు ఉన్న గార గట్టిపడి, గార పెరిగేలా చేస్తుంది. దీంతో చిగుళ్ల సమస్యలు తలెత్తుతాయి.

  1. నాలుకను నిర్లక్ష్యం చేయోద్దు

బ్రష్ చేసిన ప్రతీసారి నాలుకను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకోకపోవడం వల్ల వ్యర్ధాలన్నీ నాలుకపై పేరుకుపోయి నోటి దుర్వాసన వస్తుంది. కాబట్టి బ్రష్ ఎంత జాగ్రత్తగా చేస్తారో..నాలుకను కూడా అంతే జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి.

  1. ఏ టూత్ పేస్ట్ వాడుతున్నారు

దంతాల్ని శుభ్రం చేయడంలో టూత్ పేస్ట్ లు కీ రోల్ ప్లేచేస్తాయి. టేస్ట్ బాగుంది కదా అని మనకు నచ్చిన టూత్ పేస్ట్ కాకుండా ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ తో బ్రష్ చేయడం వల్ల దంతాలు మిలమిల మెరిసిపోతాయి. అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. సాధారణంగా ఫోరైడ్ అంటే చాలామందికి ఓ భయం ఉంది. ఫ్లోరైడ్ శరీర భాగాల్ని నాశనం చేసినా దంతాల్ని కాపాడడంలో ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ లు ప్రధమ స్థానంలో ఉన్నట్లు వాషింగ్ టన్ సైంటిస్ట్ దగ్గాల్ చెబుతున్నారు.  దంతాల్ని నాశనం చేసే క్రిముల్ని హతమార్చడంలో ఫ్లోరైడ్ సాయం చేస్తుంది.

  1. ప్లోసింగ్ తప్పని సరి

బ్రష్ చేయడం కంటే ఫ్లోసింగ్ చేస్తే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయని డెంటిస్ట్ లు చెబుతున్నారు. ప్లాసింగ్ చేయడం వల్ల పళ్లమధ్యలో ఇరుక్కొన ఆహారం బయటపడుతుంది. దీంతో దంతసమస్యలు, నోటి దుర్వాసనలు తొలగిపోతాయి.

 

ప్లాసింగ్ అంటే ( పళ్ల మధ్య సందుల్ని దారాలతో క్లీన్ చేయడాన్ని ఫ్లాసింగ్ అంటారు)

 

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest