Thyroid Health Tips : అలా చేస్తే థైరాయిడ్ తగ్గదు..పైగా హార్మోన్లు తగ్గిపోతాయి

ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతీ ఒక్కరికి అనారోగ్య సమస్యలు తీవ్ర  ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆడ, మగ, చిన్నపిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరిని కుంగదీస్తున్న సమస్య థైరాయి.

ఎవరికైనా ఆరోగ్యం బాగలేదంటే మీకు థైరాయిడ్ ఉందేమో డాక్టర్ కు చూపించుకోండి అని సలహా ఇస్తుంటారు. దీంతో థైరాయిడ్ ఏమో అని తెగ హైరానా పడిపోతుంటారు.

థైరాయిడ్ అనేది దీర్ఘకాలిక సమస్య కాకపోయినప్పటికీ దీని కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకుంటూ తగిన ఆహార నియమాల్ని పాటిస్తే థైరాయిడ్ సమస్యను అధిగమించడం పెద్ద సమస్య కాదు.

థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్లు ముఖ్యంగా ఆహార నిబంధనల్ని తప్పని సరిగా పాటించడం చాలా మంచిది.

గమనిక : థైరాయిడ్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్లు తప్పని సరిగా వైద్యుల్ని సంప్రదించాలి

థైరాయిడ్ హార్మోన్ ను ఎలా అందిస్తారు

థైరాయిడ్ గ్రంధి అనేది మెడలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఒక ఎండో క్రైమ్ గ్రంధి. థైరాయిడ్ గ్రంధి నుంచి వచ్చే  హార్మోన్ నే థైరాయిడ్ హార్మోన్ అని అంటాం. ఈ హార్మోన్ శరీరంలో తగ్గినప్పుడు వచ్చే సమస్యను హైపోథైరాయిడిజం అంటారు. ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్లు థైరాయిడ్ హార్మోన్ ను బయటనుంచి ట్యాబ్లెట్ల రూపంలో ఇవ్వాలి. చాలా మంది ఈ థైరాయిడ్ హార్మోన్ ను ఎప్పుడు తీసుకోవాలి. ఎలాంటి వ్యాయామాలు చేస్తే ఈ థైరాయిడ్ సమస్యను అదిగమించవచ్చు

థైరాయిడ్ ట్యాబ్లెట్లను ఎలా తీసుకోవాలి. 

థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. ట్యాబ్లెట్లు వేసుకున్న 45 నిమిషాల వరకు టీ, కాఫీలు తాగకూడదు. బ్రేక్ ఫాస్ట్ చేయకూడదు. అలా బ్రేక్ ఫాస్ట్ చేస్తే ట్యాబ్లెట్ వేసుకున్నా దాని ప్రభావం ఉండదని వైద్యులు చెబుతున్నారు.

ట్యాబ్లెట్లు వేసుకున్న తరువాత మంచినీళ్లు తాగొచ్చు. 

థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకున్న తరువాత ప్రతీఒక్కరికి ఒక అనుమానం ఉంది. అదే ట్యాబ్ లెట్ వేసుకున్న తరువాత మంచినీళ్లు తాగవచ్చా లేదా అని. వైద్యులు వాటర్ తాగొచ్చని చెబుతున్నారు. ఇక ఆహారంలో ఎలాంటి నిబంధనలు లేవని చెబుతున్నారు. క్యాబేజీ , క్యాలీఫ్లవర్ సోయా బిన్ తినకూడదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేస్తున్నారు. కాకపోతే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న గంటతరువాత మాత్రమే అన్నం తినాలని చెబుతున్నారు.

థైరాయిడ్ కు ప్రత్యేక వ్యాయామాలు లేవు

థైరాయిడ్ ను కంట్రోల్ చేసే ప్రత్యేక వ్యాయామాలు లేవని, అన్నీ రకాల వ్యాయామాలు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఎవరైనా థైరాయిడ్ ను నయం చేసేందుకు ప్రత్యేక వ్యాయామాలు ఉన్నాయని చెబితే నమ్మొద్దని చెబుతున్నారు. థైరాయిడ్ సమస్య గొంతు భాగంలో ఉంటుంది. కాబట్టి గొంతుభాగాన్ని ముందుకు వెనక్కి ఊపడం వల్ల థైరాయిడ్ తగ్గిపోతుందనడం లో వాస్తవం లేదని చెబుతున్నారు.

ట్యాబ్లెట్లు వేసుకోవడంలో శ్రద్దతీసుకోవాలి

ట్యాబ్లెట్ వేసుకోవడం లో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. థైరాయిడ్ ట్యాబ్లెట్లతో పాటు ఇతర ఐరన్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకోకూడదని, అలా వేసుకోవడం వల్ల ఎటువంటి ప్రభావం చూపకపోగా..హార్మోన్ల శాతం పూర్తిగా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest