Weight Gain Tips In Telugu | సింపుల్ గా బరువు పెరగాలంటే

మనలో చాలామంది సన్నగా ఉంటారు. గాలికి  కొట్టుకుపోయేంత బరువుతో ఇబ్బంది పడుతుంటారు. అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో విపరీతమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, బాడీ స్ట్రాంగ్ గా లేకపోవడం, జన్యుపరమైన లోపాల వల్ల ఎంత తిన్నా బరువు పెరగరు. అయితే  ఇప్పుడు మనం డైట్ ను ఫాలో అవుతూ ఎలా బరువు పెరగాలో తెలుసుకుందాం.

గమనిక : మీ శరీరంలో కండపెరగాలంటే కఠినమైన ఆహార నియమాలు పాటించాలి. ఆహార నియమాల వల్ల శరీరంలో కొవ్వుకు చోటుండదు. కండ పెరుగుతుంది. ఆరోగ్యకరమైన, కొవ్వు లేని, అధిక కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలంటే తప్పని సరిగా డైటీషియన్ సలహా అవసరం.

అయితే, బరువు పెరగడానికి కొన్ని హోం రెమిడీస్ ను ఫాలో అవ్వడం మంచిది. ఎందుకంటే మీ రెగ్యులర్ లైఫ్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉంటుంది.

ఖర్జూరం / పాలు

ఖర్జూరం ఫౌడర్ ను పాలల్లో కలుపుకొని తాగడం వల్ల బరువు పెరగొచ్చు. పాలల్లో ఫౌడర్ ను యాడ్ చేయడం ద్వారా మీ కండరాలు బలంగా ఉండేలా చేస్తుంది. ఎందుకంటే ఖర్జూరం పొడిలో విటమిన్ ఎ, సి, ఇ, కె, బి 2, బి 6, నియాసిన్ మరియు థియామిన్ల తో పాలు పలు విటమిన్లు నిండి ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ప్రోటీన్, చక్కెర, శక్తి మరియు విటమిన్లను పొందవచ్చు. ఎక్కువ బరువు పెరగకుండా మీకు కావాల్సిన బరువును పెంచేందుకు కండరాలు సహాయ పడతాయి. రెగ్యులర్ గా పాలల్లో ఖర్జూరం పొడిని కలుపుకొని తాగడం వల్ల కేవలం 20 నుండి 30 రోజుల లోపు మంచి ఫలితాలను చూస్తారు.

బెల్లం/ వెన్న

ప్రతీరోజు పగలు భోజనానికి అరగంట ముందు, రాత్రి భోజనానికి అరగంట ముందు వెన్నలో ఓ స్పూన్ బెల్లం కలుపుకొని తాగాలి. ఇలా నెల రోజుల పాటు వెన్న మరియు బెల్లం కలుపుకొని తినడం వల్ల బరువు పెరుగుతారు.

మామిడి కాయ/ పాలు

ప్రతీరోజు మూడు సార్లు మామిడి కాయ తిన్న తరువాత తప్పని సరిగా పాలు తాగాలి. ఒక పండిన మామిడిని రోజుకు మూడు సార్లు తినండి మరియు మామిడి తిన్న తర్వాత ఒక గ్లాసు పాలను యాడ్ చేయండి.  మామిడిలో తగినంత మొత్తంలో కార్బోహైడ్రేట్, చక్కెర మరియు ప్రోటీన్లు ఉంటాయి. ఇవి మన శరీరం బరువును పెంచడానికి సహాయపడతాయి. మీరు ఒక నెల తర్వాత  ఫలితాలను చూస్తారు.

మధ్యాహ్నం నిద్ర

మీరు బరువు పెరిగేందుకు జిమ్ కు వెళ్లకుండా ప్రతీరోజు మధ్యాహ్నం 45 నిమిషాల నుంచి గంట పాటు నిద్రపోవాలి. రాత్రి పూట నిద్ర ఎంత మంచిదో.. బరువు పెరిగేందుకు మధ్యాహ్నం నిద్ర అంత మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల కండరాలు ఫ్రీ అవుతాయి. బరువు పెరిగేందుకు సాయపడుతుంది. కండరాలు ఫ్రీ అవ్వడం వల్ల మనం తిన్న తిండి ఆ ఎముకల్లోకి వెళ్లి బరువు పెరిగేలా చేస్తుంది.

వేరుశనగ వెన్న

మనం బరువు పెరిగేందుకు మరో చక్కటి మార్గం వేరుశనగ వెన్న. ప్రతీరోజు మనం తినే టిఫిన్ తో పాటు వేరు శనగ వెన్నను యాడ్ చేయండి. వేరుశనగతో తయారు చేసిన వెన్నలో కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు, ఖనిజాలు మరియు విటమిన్లు శక్తితో నిండి ఉంటాయి.  మీ రోజువారీ ఆహారంలో కొంచెం వేరుశనగ వెన్నను యాడ్ చేయండి. మనం ఇంట్లో బరువు పెరిగేందుకు చక్కటి మార్గం. ఇక  మల్టీ గ్రెయిన్ బ్రెడ్‌పై వేరుశెనగ వెన్నను కలుపుకొని తినవచ్చు. నెలరోజుల్లో బరువు పెరుగుతారు.

అరటి/ పాలు

ప్రతీ రోజు ఉదయం సాయంత్రం టీ, కాఫీలకు బదులు పాలు తాగిన తరువాత అరటి జ్యూస్ ను తాగాలి.  అరటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. పాలు తాగిన తరువాత అరటి జ్యూస్ ను తాగడం వల్ల శరీరానికి కేలరీలు మిక్స్ అయ్యి మంచి ఎనర్జీని ఇస్తుంది. అందుకే ఆటగాళ్లు ప్రతీరోజు తప్పని సరిగా పాలు, అరటి పండును తప్పని సరిగా తీసుకుంటారు.

కాల్చిన బంగాళ దుంప

కార్బోహైడ్రేట్లు ఉన్న బంగాళ దుంపల్ని ఆహారంలో చేర్చడం వల్ల బరువు పెరుగుతారు. బంగాళదుంపల్ని ఉడికించినవి కాకుండా వెన్నతో కాల్చడం లేదా నార్మల్ గా కాల్చిన బంగాళ దుంపల్ని తినడం ఉత్తమం. మనం ఇంట్లో బరువు పెంచే ఫుడ్ అని చెప్పుకోవాలి. మీరు తినే ఆహారానికి కాల్చిన బంగాళదుంపల్ని యాడ్ చేయడం మంచిది.

బరువు పెరిగేందుకు ట్రై చేస్తున్నవారు టీ లేదా కాఫీ వంటి ద్రవాల్ని భోజనానికి ముందు తాగడం మానుకోవాలి. ఇవి ఆకలిని తగ్గిస్తాయి. ఒకవేళ తప్పని సరిగా తాగాల్సి వస్తే భోజనానికి గంటముందు మాత్రమే తాగాలి. ఇలా పైన చెప్పిన సలహాలు పాటించడం వల్ల నెలరోజుల్లో బరువు పెరుగుతారు.

FOR MORE NEWS

Weight loss | బరువు తగ్గేందుకు అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest