Weight loss | బరువు తగ్గేందుకు అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు

ప్రెజెంట్ జనరేషన్ లో బరువు పెరగడం అనేది ప్రధాన సమస్యగా మారింది. దీంతో బరువు  తగ్గించుకునేందుకు చాలా మంది అన్నం తినకుండా పస్తులుంటున్నారు. అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఆయుర్వేద పద్దతుల్లో కొన్ని ఆహార నియమాలను పాటించి మన శరీరాన్ని ఎలా కావాలంటే అలా డిజైన్  చేసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

ముందుగా బరువు తగ్గాలనుకునేవారు నడుం (బెల్లి ఫ్యాట్) బాగంలో పేరుకుపోయిన కొవ్వును సహజ పద్దతుల్లో కరిగించుకోవాలని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.

అందుకు కొన్ని వ్యాయామాలతో పాటు ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా బరువు తో పాటు బెల్లి ఫ్యాట్ ను అరికట్టవచ్చు.

నడుం భాగం అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. అందుకే  నడుం భాగంలో కొవ్వు పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవాలని నానా అవస్థలు పడుతుంటారు. కొన్ని వైద్య పరిశోధనల్లో శరీరంలో ఏ ప్రాంతంలోనైనా కొవ్వును ఈజీగా కరిగించు కోవచ్చని, కానీ నడుం భాగంలో ఉండే కొవ్వును కరిగించు కోవడం చాలా కష్టమని తేలింది.  అయినప్పటికీ, ఆయుర్వేదంలో కొన్ని పద్దతుల ద్వారా సహజ పద్దతుల్లో కొవ్వును కరిగించు కోవచ్చు.

శరీరాన్ని సుఖపెట్టడం, వ్యాయామం చేయకపోవడం, గంటల తరబడి కూర్చొన్న చోటే కూలబడిపోవడం,  అతిగా నిద్రపోవడం, అధిక కొవ్వు పదార్ధాలున్న ఆహారాన్ని తీసుకోవడం, స్మోకింగ్, డ్రింకింగ్‌ చేయడం ద్వారా బరువు పెరుగుతున్నట్లు  ఆయుర్వేదం శాస్త్రం చెబుతోంది. ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అవ్వడం వల్ల  ఒంట్లో కొవ్వు పెరిగిపోవడం, ఊబకాయం, నడుం భాగంలో కొవ్వు పేరుకు పోవడంతో అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి.

కొవ్వును కరిగించడంతో పాటు, బరువు ను తగ్గించేందుకు కొన్ని చిరు ధాన్యాలు ఉపయోగపడతాయని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు రామ్ ఎన్ కుమార్ తెలిపారు. నల్ల మిరియాలు మరియు అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు కూడా కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. జీర్ణక్రియను పెంచడానికి వేడి నీళ్లు తాగాలని సూచిస్తున్నారు.  చల్లని నీరు త్రాగేవారికి కొవ్వు కరిగించడం కష్టమని డాక్టర్ కుమార్ చెప్పారు.

ఆయుర్వేద నిపుణులు డాక్టర్ అశుతోష్ గౌతమ్, డాక్టర్ రామ్ ఎన్ కుమార్  కొన్ని సహజ పద్దతుల ద్వారా బరువు తగ్గేందుకు  కొన్ని టిప్స్ చెప్పారు అవేంటో తెలుసుకుందాం.

మెంతులు :

మెంతుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా కొవ్వు కరిగించి బరువు తగ్గడంలో మెంతులు బాగా పనిచేస్తాయి. మెంతుల్లో ఉండే గెలాక్టోమన్నన్ అనే పదార్ధం బరువు తగ్గడంతో పాటు జీర్ణవ్యవస్థ సమర్ధవంతంగా పనిచేసేందుకు సాయం చేస్తాయి. అంతేకాదు ఎక్కువ సేపు ఎనర్జీగా ఉండేలా ఉపయోగపడుతుంది. బరువు ను తగ్గాలనుకునే వారు చేయాల్సిందల్లా  ఒక్కటే మెంతుల్ని వేయించి పొడి చేయాలి. అలా పొడి చేసిన చూర్ణాన్ని(ఫౌడర్ ని)  ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీటిలో కొంచెం పొడిని  తీసుకోవాలి.  రాత్రి పూట విత్తనాలను నానబెట్టిన నీటిని తాగవచ్చు.  విత్తనాలను ఖాళీ కడుపుతో నమలాలి. అలా చేయడం వల్ల ఒంట్లో కొవ్వు కరిగిపోయి. బరువు తగ్గుతారు.

పిప్పళ్లు లేదా లాంగర్ పెప్పర్స్ :

చాలా మంది దంపతులుకు సంతనా లేమి సమస్యతో బాధపడుతుంటారు.  అందుకు కారణం  భార్య – భర్తలు ఇద్దరు లావుగా ఉండడం వల్లే  సంతాన లేమి సమస్య ఎదురవుతుందని ఆయుర్వేద డాక్టర్ రామ్ చెబుతున్నారు.  విపరీతమైన బరువు , ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల పురుషుల్లో వీర్య కణాలు నశించిపోతున్నాయి. స్త్రీల్లో ఎగ్ రిలీజ్ అవ్వడం కష్టం గా మారుతుంది. దీన్ని అధిగమించేందుకు భార్య భర్తలిద్దరు బరువు తగ్గాలని చెబుతున్నారు. బరువు తగ్గించేందుకు పిప్పళ్లు ఉపయోగ పడతాయని అంటున్నారు. పిప్పిళ్లను సన్నటి మంటపై దోరగా వేయించి పొడిని చేయాలి. రాత్రి పడుకునే సమయంలో మూడు చిటికెల పొడిలో కొద్దిగా తేనె కలుపుకొని నాలుకతో చప్పరించాలి. పొడి  కొద్దిగా మంటగా ఉన్నా కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్పారు. కడుపులో మంటగా ఉంటే కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు  తాగవచ్చన్నారు.

వేగి మొక్క/ విజయ్ సార్ మొక్క:

వేగి మొక్క ఆయుర్వేదంలో దివ్య ఔషధమనే చెప్పుకోవాలి. అధిక బరువు, కొవ్వు, షుగర్ బాధితులు ఎవరైనా సరి వేగి మొక్క రసాన్ని తీయాలి. అలా తీసిన రసాన్ని చెక్క గ్లాసులో పోసి రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తాగాలి. అలా తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. కొవ్వును కరిగించు కోవచ్చు. అంతేకాదు ఈ రసం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది.

గమనిక : నార్మల్ గ్లాసులో ఉంచడం వల్ల రసం రంగు మారదు. దీంతో ఆ రసం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వైద్యులు చెబుతున్నారు. అందుకే చెక్కతో తయారు చేసిన గ్లాసులో రసాన్ని ఉంచాలని అంటున్నారు.

త్రి ఫల చూర్ణం :

త్రి ఫల చూర్ణం అంటే కరక్కాయ, ఉసిరికాయ, తాని కాయలతో చేసిన పొడినే త్రి ఫల చూర్ణం అంటారు. ఈ చూర్ణం ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 290రకాల వ్యాధులను నయం చేసే శక్తి ఈ త్రి ఫల చూర్ణానికి ఉంది.

మనకు కావల్సినంత కరక్కాయ, ఉసిరికాయ, తాని కాయలతో  పొడిని చేసుకోవాలి. అనంతరం ఆ పొడిలో పటిక బెల్లం పొడి, మనకు కావాల్సినంత నెయ్యి కలిపి మెత్తగా చేసుకొని గాజు పాత్రలో శుభ్రం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న పొడిని  ఉదయం ఐదు గ్రాములు, సాయంత్రం ఐదు గ్రాములు, చిన్న పిల్లలకు వారి వయసులను బట్టి చప్పరించడం వల్ల ఒంట్లో కొవ్వు కరగడంతో పాటు బరువుతగ్గుతారు.

పునర్నవ / అటిక మామిడి : 

పునర్నవ ఆకులో కొంచెం నీళ్లను కలిపి వేడి చేయాలి. అనంతరం వడగట్టి ప్రతీ రోజు ఉదయం తాగడం వల్ల కిడ్నీ సమస్యలు దూరం అవుతాయి. బరువు తగ్గించేందుకు రామబాణంగా ఉపయోగపడుతుంది.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest