Effects Of Alcohol On Your Body| ఆల్కాహాల్ తాగిన తరువాత శరీరంలో ఏం జరుగుతుందంటే..?

మందు తాగితే ఏమవుతుందో తెలుసా  అని అడిగితే ఎవరైనా ఏం చెప్తారు..? కిక్కొస్తుందని ఠక్కున చెప్పేస్తారు. కిక్ వస్తే ఏం చేస్తారని అడిగితే ఏం సమాధానం చెప్పలేరు. ఎందుకంటే మందు తాగే 90శాతం మందు బాబులకు మందు ఎందుకు తాగుతున్నామో..? తాగితే ఏమవుతుందో తెలియదని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ లు చెబుతున్నారు.

మరి మందు ఎందుకు తాగుతున్నారని నిర్వహించిన  సైంటిస్ట్ ల సర్వేలో  ఎక్కువ మంది తన స్నేహితులు తాగుతున్నారని, తన తల్లిదండ్రులు తాగుతున్నారని, సినిమాల్లో తనకు నచ్చిన అభిమాన నటుడు తాగితే ఏ విధంగా ఫీల్ అవుతున్నాడో మనం కూడా అలాగే ఫీలవ్వచ్చు అనే భ్రమలో మద్యం సేవిస్తున్నట్లు తేలింది.  సైంటిస్ట్ లు 1000మంది మందు బాబుల్ని సర్వే చేయగా వారి 827మంది పై తరహా సమాధానం చెప్పినట్లు తేలింది. అయితే మనం మందు తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం..?

శరీరంలో డోపమైన్, ఎండార్ఫిన్ అనే రెండు హార్మోన్లు ఉన్నాయి. ఆ హార్మోన్లు మందు తాగిన తరువాత బిగ్గరగా కేకలు వేయడం, తెగ ఆనంద పడిపోవడం, గతంలో జరిగిన విషయాల్ని గుర్తు తెచ్చుకొని ఏడ్వడం, ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించేలా బాడీకి సిగ్నల్స్ పంపుతాయని  వైద్యులు చెబుతున్నారు.

మందు తాగిన వెంటనే ఆ రెండు హార్మోన్లు యాక్టివ్ అయ్యి బాడీలోని మిగిలిన పార్ట్స్ కి సిగ్నల్స్ పంపుతుంది. దాంతో  మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహా రాజులం అంటూ చిందేస్తారని తెలిపారు.

మందు తాగితే మత్తు ఎందుకు వస్తుంది..?  

మందు తాగిన వెంటనే హార్మోన్లు యాక్టివ్ అయ్యి బాడీకి మెసేజ్ పంపుతుంది. దీంతో లిమిట్ గా మందు తాగడం వల్ల యాక్టివ్ గాను,  ఎక్కువగా తాగడం వల్ల యాక్టివ్ నెస్ తగ్గి నరాలు దెబ్బతింటాయి. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి పై ప్రాణాలు పైకిపోతాయి.

మందు తాగడం వల్ల లివర్, కిడ్నీలు ఎందుకు పాడవుతాయి

మందు తాగడం వల్ల నాలుగు దశల్లో హెఫెక్ట్ చూపిస్తుంది. నాలుగో దశ లో ప్రాణం పోతుంది. సాధారణంగా మనం తిన్న ఆహారం రక్తనాళాల్లోకి వెళ్లుతుంది. అదే మందు తాగినప్పుడు అన్నం కంటే మందు ఆహార నాళాలను వెడల్పు చేసే ఫాస్ట్ గా లోపలికి వెళ్లేలా చేస్తుంది. అలా లివర్, కిడ్నీలు, మెదడులోకి వెళుతుంది. అలా వెళ్లడం వల్లే మన శరీరం మొద్దుబారి మత్తెక్కుతుంది.

మందు తాగే వాళ్లు బరువు ఎందుకు పెరుగుతారు  

సాధారణంగా లివర్ తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది. అయితే మనం తాగిన ఆల్కహాల్ జీర్ణాశయం లోకి వెళ్లగానే లివర్ తన పని తాను చేసుకునేందుకు సిద్ధమై ఎంజైమ్ లను విడుదల చేస్తుంది. ఆ ఎంజైమ్ లు ఆల్కాహాల్ ను ఫస్ట్ ఎసిటాల్డిహైడ్ గా విడగొట్టి ఆ తరువాత ఎసిటిక్ ఆమ్లంగా మార్చుతుంది. అలా మారిన ఎసిటిక్ ఆమ్లం కార్బన్ డై ఆక్సైడ్ గా విడిపోతుంది. అదే సమయంలో కొన్నిక్యాలరీలను విడుదల చేస్తుంది.  ఆ క్యాలరీలు ఎనర్జీ ఇవ్వడంతో పాటు బరువు పెరిగేందుకు దోహదపడతాయి.

గ్లామర్ కోసం కాదు.. మందు తాగే సమయంలో స్టఫ్ ఎక్కువగా తినేది

చాలా మంది మద్యం సేవించే సమయంలో స్టఫ్ విపరీతంగా తింటుంటారు. అందుకు కారణం మందుతో పాటు స్టఫ్ ఎక్కువగా తింటే మార్నింగ్ నిద్ర లేచిన తరువాత మొహంలో గ్లామర్ పెరుగుతుందని అనుకుంటారు. సైంటిఫిక్‌  గా స్టఫ్ ఎక్కువ తినకపోవడం వల్ల పోషకాలు అందవు. దీంతో నీరసం వచ్చి, శరీరంలోని అవయవాలు లివర్, కిడ్నీలు చెడిపోతాయి.

మందు తాగితే వామ్టింగ్స్ ఎందుకొస్తాయి.

సాధారణంగా మందు తాగితే వామ్టింగ్స్ చేసుకుంటుంటారు. అందుకు కారణం ఎసిటాల్డిహైడే అని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ లు చెబుతుంటారు. తాగి, తినడం వల్ల వాంతులు అవుతుంటాయి. ఆలా వాంతులు అయినప్పుడు ఎసిటాల్డిహైడే బ్రెయిన్ కి కొన్ని సిగ్నల్స్ పంపుతుంది. ఆ సిగ్నల్స్ బ్రెయిన్ కి వెళ్లి వాంతులవుతుంటాయి. వాంతులు అవుతున్నప్పుడు ఇక తాగింది చాలు అని అర్ధం.

తాగితే హ్యాంగోవర్ సమస్య ఎందుకు తలెత్తుతుంది.

తాగిన వాళ్లకి హ్యాంగోవర్ ప్రధాన సమస్య. దీనికి మందులే లేవు. హ్యాంగోవర్ స్టార్ట్ అయిందంటే మందు తాగుడు మానేయాలి. తాగడం కంటిన్యూ చేస్తే తలనొప్పి వస్తుంది. సాధారణంగా తాగిన మద్యాన్ని జీర్ణం చేసే ది లివర్. పీపాలుపీపాలు మందు తాగడం వల్ల లివర్ మద్యాన్ని జీర్ణం చేసే శక్తిని కోల్పోతుంది. ఎందుకంటే.. లివర్​ ఒక గంటలో 8 నుంచి 12 గ్రాముల ఆల్కహాల్​ను మాత్రమే జీర్ణం చేయగలదు.

 మందు తాగినప్పుడు తలనొప్పి వస్తే ఏం చేయాలి

కొన్ని రకాల బ్రాండ్ లు తాగినప్పుడు హ్యాంగోవర్ లో ఉన్నప్పుడు బాడీ డీ హైడ్రేట్ అయ్యి తలనొప్పి వస్తుంది. ఆ సమయంలో మంచి నీళ్లు తాగాలి. మంచి నీళ్లు తాగితే రక్తనాళాలు తెరుచుకుంటాయి.

మందు తాగితే బాత్రూంకి ఎందుకు వెళతారు   

తాగినప్పుడు పిట్య్చూట్రీ గ్రంథి వాసోప్రెసిన్‌‌ అనే హార్మోన్‌‌ను విడుదల చేస్తుంది. అందుకే మద్యం తాగినప్పుడు బాత్రూంకి వెళ్లాల్సి వస్తుంది. అలా ఎక్కువ సార్లు వెళ్లడం వల్ల  బాడీ డీహైడ్రేట్​ అవుతుంది. దీనివల్ల కూడా హ్యాంగోవర్​గా అనిపిస్తుంది.

more news

Best Food For Vitamin C : కరోనా క్రైసిస్ లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఫ్రూట్స్

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest