obesity health tips| ఊబకాయం – అధిక బరువు అంటే ఏమిటి

నిలుచోవాలంటే ఇబ్బంది, కూర్చోవాలంటే ఇబ్బంది. వేగంగా నడవాలంటే కష్టం. ఏ పని చేయాలన్నా కష్టం. అది ఏ సమస్య అని ఆలోచిస్తున్నారా..? అదేనండీ ఊబకాయం. నేడు ఎంతో మందిని ఊబకాయం సమస్య పట్టిపీడిస్తుంది. అమెరికా చైనాల తరువాత మనదేశం మూడో స్థానంలో ఉంది. దీనికి అనేక కారణాలున్నాయి. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం అధిక బరువు సమస్య వస్తుంది. మనం ఆహారంలో ఎక్కువ క్యాలరీలు తీసుకొని తక్కువ క్యాలరీలను ఖర్చు చేయడం వల్ల అది కొవ్వుగా మారి శరీర భాగాల్లో పేరుకుపోవడం వల్ల ఈ ఊబకాయం వస్తుంది.

ఈ ఊబకాయాన్ని బాడీ మాస్ ఇండెక్స్(బీ ఎంఎస్) ఆధారంగా ఈజీగా కనిపెట్టవచ్చు. పురుషుల నడుము చుట్టుకొలత 40 అంగుళాల 102 సెంటీమీటర్లు, స్త్రీల నడుము చుట్టు కొలత 35 అంగుళాలు లేదా 88 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే ఊబకాయంగా గుర్తించవచ్చు.

ఊబకాయానికి దారితీసే కారణాలు

ఊబకాయం ఎక్కువ శాతం జన్యుపరంగా వస్తుంది. ఊబకాయం ఉన్న తల్లి తండ్రులకు పుట్టిన పిల్లలకు 80శాతం, తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికైనా ఉంటే 50శాతం ఊబకాయం పిల్లలకు వస్తుంది.

ఒబేసిటీ పురుషుల్లో కంటే  స్త్రీలల్లోనే ఎక్కువ

హార్మోన్ల పనితీరు, ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల ఒబేసిటీ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. గంటల తరబడి కదలకుండా కూర్చోవడం, తీవ్రమైన ఒత్తిడి, ఆధునిక ఆహారపు అలవాట్లు, కొవ్వు ఎక్కువగా ఉన్న పదార్ధాల్ని తినడం, తినే విషయంలో సమయ పాలన పాటించకపోవడం వల్ల ఒబేసిటీకి కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఓవర్ వెయిట్ అంటే

అధిక బరువు బాడీ మాస్ ఇండెక్స్ (BMI) పై ఆధారపడి ఉంటుంది. ఎత్తు, బరువు ఆధారంగా bmi ని కిలో గ్రాములు / మీటర్ స్వైర్డ్ (m2) లో కొలుస్తారు.

బాడీ మాస్ ఇండెక్స్ ఆధారంగా అధిక బరువు ను ఇలా కనిపెట్టవచ్చు

అధిక బరువు తో ఉన్న వారు బీఎంఐ చార్ట్ లో 25.0 – 29.9 kg / m2.1 చూపిస్తుంది. సాధారణ బరువు తో ఉన్న వారు 18.5 ,24.9 మధ్య ఉంటుంది. 18.5 కన్నా తక్కువ ఉంటే తక్కువ బరువు తో ఉన్నట్లు గుర్తించవచ్చు.

ఒబేసిటీతో బాధపడేవారి బీ ఎంఎస్ ఇలా ఉంటుంది

బీఎంఎస్ లో 30.0 ఉంటే ఊబకాయం ఉందని, 40.0పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే ఊబకాయంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అర్ధం చేసుకోవచ్చు.

ఒబేసిటీకి చికిత్స ఎలా ఉంటుంది

ఒబేసిటీ తగ్గాలంటే అధిక బరువును తగ్గించాలి. 5శాతం నుంచి 10శాతం బరువు తగ్గడం వల్ల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు, టైప్ -2 డయాబెటీస్ నుంచి బయటపడొచ్చు.

అధిక బరువు ను తగ్గించడం ఎలా

అధిక బరువు ను తగ్గించేందుకు నడక ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. నడకతో పాటు ఆహార నియమాలు పాటించడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు.

see this – women weight loss tips : మహిళలు త్వరగా బరువు తగ్గాలంటే ఈజీ టిప్స్

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest