WHO Travel Precautions | కరోనా వైరస్ – జర్నీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు కరోనా వైరస్ పట్ల భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వరల్డ్ హెల్త్  ఆర్గనైజేషన్ కరోనా వైరస్ సోకకుండా కొన్ని జాగ్రత్తలు సూచింది  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు  

 చేతుల్ని శుభ్రం క్లీన్ చేసుకోవాలి

చేతుల నుంచి వైరస్ ఒకరి నుంచి ఒకరి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి చేతులు మురికి గా ఉన్నప్పుడు సబ్బు, నిల్వ ఉంచిన నీటితో కాకుండా ట్యాప్ వాటర్ తో చేతుల్ని కడుక్కోవాలి.

వీలైతే 90 శాతం ఆల్కహాల్ ఉత్పత్తులతో తయారు చేసిన హ్యాండ్ వాష్ క్రీమ్ లతో చేతుల్ని శుభ్రం కడుక్కోవాలి

చేతుల్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం   

దగ్గు లేదా తుమ్ము తర్వాత

అనారోగ్యంతో బాధపడేవారిని చూసుకొనేటప్పుడు

మీరు ఆహారాన్ని తయారు చేసే ముందు.. తినడానికి ముందు

టాయిలెట్ వెళ్లిన తరువాత

చేతులు మురికిగా ఉన్నప్పుడు

పెంపుడు జంతువుల్ని శుభ్రం చేసినప్పుడు , వాటిని బాత్ రూమ్ కి తీసుకెళ్లినప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవాలి .

ఇతరులకు హాని కలగకుండా  తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు నోటిని, ముక్కును టిష్యూస్ తో అడ్డు పెట్టుకోవాలి

అనంతరం ఆ టిష్యూస్ ను డస్ట్ బిన్ లో పడేయండి

అనారోగ్యంతో బాధపడేవారిని చూసుకోవాల్సి వచ్చినప్పుడు  దగ్గు లేదా తుమ్ము తర్వాత ఆల్కహాల్ ఉత్పత్తులతో తయారు చేసిన హ్యాండ్ వాష్ క్రీమ్ లతో చేతుల్ని శుభ్రం క్లీన్ చేసుకోవాలి.

అనారోగ్యంతో బాధపడుతున్నవారితో

దగ్గు, జ్వరంతో బాధపడుతున్నవారితో సన్నిహితంగా ఉండకుండా చూసుకోవాలి.

బహిరంగంగా ఉమ్మి వేయకూడదు.

జ్వరంతో, దగ్గుతో డాక్టర్లను కలిస్తే  అనారోగ్యానికి ముందు చేసిన ట్రావెల్ వివరాల్ని తప్పని సరిగా చెప్పాలి

ఫీవర్, దగ్గు ఉంటే ప్రయాణానికి దూరంగా ఉండాలి

జ్వరం ఉంటే, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ముందుగానే డాక్టర్లను సంప్రదించాలి.

డాక్టర్ తో అనారోగ్యానికి ముందు జర్నీ వివరాల్ని తప్పని సరిగా షేర్ చేయాలి

ప్రయాణించేటప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే

జ్వరం మరియు దగ్గుతో  బాధపడుతున్న వ్యక్తులతో దూరంగా ఉండండి

తప్పని సరిగా సబ్బుతో , ఆల్కహాల్ ఉత్పత్తులతో తయారైన హ్యాండ్ వాష్ క్రీమ్స్ తో చేతుల్ని శుభ్రం చేసుకోవాలి

అనారోగ్యంతో బాధపడే వారి  కళ్ళు, ముక్కు, నోటిని తాకకుండా ఉండండి

టిష్యూస్ తప్పని సరిగా వాడాలి

దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మీ నోటిని, ముక్కును టిష్యూస్ తో అడ్డం పెట్టుకోవాలి. అనంతరం డస్ట్ బిన్ లో పడేయాలి.

ఫేస్ మాస్క్ లను ధరించాలనుకుంటే తప్పని సరిగా నోరు, ముక్కును కప్పి ఉంచాలి.

ధరించిన తరువాత మాస్క్ లను ఎట్టి పరిస్థితుల్లో చేతులతో టచ్ చేయకూడదు.

మాస్క్ ను తీసేయాల్సి వస్తే మాస్క్ ను తీసేసి మరో కొత్త మాస్క్ ను ధరించాలి. నోటికి ఉన్న మాస్క్ ను తీసిన అనంతరం చేతుల్ని శుభ్రం చేసుకోవడం మరిచి పోవద్దు

ఒకటే మాస్క్ ను ఎక్కువ సేపు ధరించకూడదు

పాత మాస్క్ తీసేసి కొత్త మాస్క్ ను ధరించే ప్రతీ సారి  చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

బాగా ఉడికించిన  ఆహారాన్ని మాత్రమే తినండి

బహిరంగంగా ఉమ్మి వేయకుండా ఉండాలి.

దగ్గే వాళ్లతో , జంతువులతో ప్రయాణించకూడదు.

see this – కరోనా వైరస్ పట్ల పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest