women weight loss tips : మహిళలు త్వరగా బరువు తగ్గాలంటే ఈజీ టిప్స్

ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగుల జీవితం. టైంకి తినకపోవడం, ఒత్తిడి, నిద్రపోకపోవడం, స్మార్ట్ ఫోన్ లో గంటల తరబడి గడపడం వల్ల ఎక్కడలేని జబ్బులన్నీ మనకే వస్తుంటాయి.  ఈ  సమస్యల్లో ప్రధానమైంది అధిక బరువు దీనిని ఒబేసిటీ, హెవీ వెయిట్ అని కూడా అంటారు. ఎన్ని పేర్లు ఉన్నా సమస్య మాత్రం ఒక్కటే .

బరువు వల్ల ప్రాణాలు పోతాయా..? 

ఈ అధిక బరువే అనేక రకాలైన అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. నార్మల్ గా బరువు ఉంటే పరవాలేదు. కానీ భారీగా బరువు పెరిగితేనే సమస్యలు. సమస్యలంటే చిన్నాచితకా అనారోగ్య సమస్యలు కాదండోయ్. ప్రాణాలు పోయేంత అనారోగ్య సమస్యలు. బరువు పెరిగితే ప్రాణాలు పోతాయా అనే అనుమానం రావచ్చు. పక్కగా పై ప్రాణాలు పైకి పోతాయి.

ఉదాహరణకు తన యాక్టింగ్ తో కుర్ర కారు హృదయాల్ని కొల్లగొట్టిన ఓ టాలీవుడ్  హీరోయిన్ తో పాటు తన దర్శకత్వ ప్రతిభతో ఎంతోమంది హీరోలు, హీరోయిన్ లు, నటీ, నటులను వెండితెర పై ఓ వెలుగు వెలిగేలా బాటలు వేసిన డైరెక్టర్ అధిక బరువు కారణంతో ప్రాణాలు కోల్పోయారు. అధిక బరువు ను తగ్గించుకునేందుకు ఆపరేషన్లు చేయించుకున్నారు. బరువు కారణంగా ఆపరేషన్లు వికటించి ప్రాణాల్ని పణంగా పెట్టడం సినీ అభిమానుల్ని విస్మయానికి గురిచేసింది.

అధిక బరువు ఉన్నామని ఎలా తెలుస్తుంది 

body mass index chart in telugu

మనం బరువు ఉన్నామా..? ఉంటే ఎంత బరువు ఉన్నాం. bmi(body mass index chart) ఆధారంగా చెప్పవచ్చు. ఈ చార్ట్ లో అధిక బరువు ఉంటే దాన్ని ఒబేసిటీ గా చెప్పుకోవచ్చు.

అధిక బరువు ఉంటే వచ్చే అనారోగ్య సమస్యలు

diabetes health problems in telugu

 

 

 

 

 

 

 

 

 

 

 

మనకు వచ్చే అనారోగ్య సమస్యలకు 84శాతం అధిక బరువు కారణమేనని వైద్యులు చెబుతున్నారు. ఈ బరువు వల్ల టైప్ -2 డయాబెటిస్ అటాక్ అవుతుంది. డయాబెటిస్ వల్ల గుండె జబ్బులు, లివర్ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, బీపీ, క్యాన్సర్ తో పాటు అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో సతమతం అవ్వాల్సి వస్తుంది.

బరువు తగ్గడం ఎలా..?

how to weight loss tips for women in telugu

 

 

 

 

 

 

 

 

 

 

 

కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే బరువు తగ్గడం చాలా ఈజీ. ఆ సింపుల్ చిట్కాలు పాటించకుండా బరువు తగ్గేందుకు గంటల తరబడి జిమ్ చేస్తూ కాలం గడిపేస్తుంటారు.  మరి  సింపుల్ చిట్కాలు పాటించి త్వరగా బరువు ఎలా తగ్గొచ్చొ తెలుసుకుందామా..?

శనగలు  

శనగలు ప్రొటీన్ ఫుడ్. బరువు తగ్గేందుకు బాగా ఉపయోగపడతాయి. దానికి తోడు కొంచెం శనగల్ని తిన్నా తొందరగా ఆకలి కూడా వేయదు. ప్రతీరోజు ఉదయాన్నే టిఫిన్ కు బదులు నానబెట్టిన శనగల్ని తింటే సరిపోతుంది. త్వరగా బరువు తగ్గవచ్చు.

కూరగాయల ముక్కలు  

మనం తినే కూరగాయలు అధిక బరువును తగ్గించేందుకు సాయం చేస్తాయి. ముఖ్యంగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పుచ్చకాయలు, కీరదోసకాయలు, ఆకు కూరలు బరువు తగ్గిస్తాయి.

నిమ్మకాయ నీళ్లు  

  నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ప్రతీ రోజు ఉదయం నిమ్మకాయ రసంలో కొంచెం తేనే కలుపుకొని తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. నిమ్మకాయ నీళ్లలో ఉన్న ఔషద గుణాలు పొట్టలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. రోజంతా యాక్టీవ్ గా ఉండేలా తయారు చేస్తుంది.

వ్యాయామం  

బాడీ ఎక్సర్ సైజ్ అనేది బరువును తగ్గించేందుకు కీరోల్ ను ప్లే చేస్తుంది. ప్రతీరోజు ఉదయం సాయంత్రం వేళల్లో శరీరం చమట పట్టేలా ఎక్సర్ సైజ్ లు చేయండి. ఆహారంతో పాటు ఎక్సర్ సైజ్ చేయడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.

నీళ్లు ఎక్కువగా తాగాలి 

నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారా అనే అనుమానం రావొచ్చు. మంచినీళ్లు బరువు తగ్గేందుకు మంచి ఎనర్జీ డ్రింక్ లా పనిచేస్తాయి. మంచినీళ్లు తాగడం వల్ల తిన్న అన్నం బాగా అరుగుతుంది. దీంతో కడుపులో పేరుకుపోయిన కొవ్వు పదార్ధం పలు మార్గాల ద్వారా శరీరం నుంచి భయటకు విడుదలవుతుంది.
ఓ అధ్యయనం ప్రకారం, 16.9 ఔన్సులు (500 మి.లీ) నీరు త్రాగడం వల్ల 30-40 నిమిషాల తర్వాత 30% కేలరీల సంఖ్య పెరుగుతుంది.
భోజనానికి ముందు నీరు తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు  13% కేలరీలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి (7 ట్రస్టెడ్ సోర్స్, 8 ట్రస్టెడ్ సోర్స్).

సమయానికి నిద్రపోవడం  

నిద్రపోకపోవడం వల్ల బరువు పెరగడమే కాదు. గుండె జబ్బులు, మధుమేహం తో పాటు అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయి. తీవ్రమైన ఒత్తిడి, గంటల తరబడి ఆన్ లైన్ గడపడం వల్ల నిద్రలేమి సమస్య వచ్చి పడుతుంది. ఆహారం, వ్యాయామం తో పాటు బరువు తగ్గడానికి తగినంత నిద్ర పోవడం చాలా ముఖ్యమని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తంలో ఉన్న గ్రెలిన్ అనే హార్మోన్ వల్ల నిద్రలేమి సమస్యతో బాధపడేవారు అధిక బరువు పెరుగుతారని  వైద్యులు చెబుతున్నారు. ఓ అధ్యయనం ప్రకారం మహిళలు ప్రతీరోజు రాత్రి కనీసం ఏడు గంటల నిద్ర పోవడం వల్ల 33% బరువు తగ్గుతారని తేలింది.

ఏరోబిక్ వ్యాయామం 

ఏరోబిక్ వ్యాయామం బొడ్డు చుట్టు పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడతాయి. ఏరో బిక్ వ్యాయామాలంటే తేలిక పాటి ఆటలు, స్మిమ్మింగ్, సైక్లింగ్, జాగింగ్, స్లో రన్నింగ్, డ్యాన్స్ లు. ఇవి బరువు తగ్గేందుకు మంచి చిట్కాలని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఏరో బిక్ వ్యాయామాల వల్ల ప్రతీ రోజు ఎనర్జిటిక్ గా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు తప్పని సరిగా  రోజుకు కనీసం 20-40 నిమిషాలు, వారానికి 150–300 నిమిషాలు ఏరోబిక్స్ ను చేస్తే మంచి ఫలితాలుంటాయి.

మంచి ఫుడ్ తినండి  

బరువు తగ్గేందుకు చాలా మంది కడుపు మాడ్చుకుంటారు. అవేం అవసరం లేదు. టైంకి మంచి ఆహారం తో పాటు వ్యాయామం చేయడం వల్ల బరువు ఈజీగా తగ్గొచ్చు. ముఖ్యంగా తినే విషయంలో సమయ పాలన పాటించాలి . ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు.

ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తినాలి

ఆరోగ్యంగా ఉండాలన్నా, జీర్ణవ్యవస్థబాగుండాలన్నా, బరువుతగ్గాలన్నా ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు తినడం చాలా ముఖ్యం. యాపిల్, బఠానీలు, క్యారెట్,బీన్స్, పాలకూర, అవిశె విత్తనాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఫుడ్ తినడం వల్ల బరువు ఈజీగా తగ్గొచ్చు. అంతేకాదు ఫైబర్ ఫుడ్ కొంచెం తిన్నా కడుపు నిండేలా చూస్తాయి.

తినే తిండిని ఆస్వాదించండి 

మనం తినే తిండిని ఆస్వాధించినప్పుడే ఆరోగ్యకరంగా ఉంటామని వైద్యులు చెబుతుంటారు. తినే తిండిని ప్రాపర్ గా ఆస్వాదిస్తూ తినడం వల్ల శరీరంలో మెటబాలిజం చక్కగా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక తినే తిండిని బాగా నమలడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండి బరువు తగ్గేందుకు సాయపడుతుంది.

ఇంకా చదవండి : వాత, పిత్త, కఫ | బరువు తగ్గాలంటే

ఇంకా చదవండి : బరువు తగ్గేందుకు అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest