yoga for constipation | మోషన్ ఫ్రీ చేసే యోగా ఆసనాలు (వీడియో)

మనిషి కడుపునుంచి వచ్చే అపాన వాయవు (గ్యాస్) జనాల్ని ఎలా తరిమి కొడుతుందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ మధ్య ఓ నవ్వు తెప్పించే విషయం ఒకటి జరిగింది. పాపం గ్యాస్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న ఓ వ్యక్తి  దుబాయ్ నుంచి నెదర్లాండ్ వెళ్లేందుకు విమానం ఎక్కాడు. కానీ సదరు వ్యక్తి విమానం ఎక్కిన దగ్గర నుండి అదే పనిగా గ్యాస్ వదలడంతో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. దీంతో విమానాన్ని మధ్యలోనే ఉన్న ఆస్ట్రియాలో ఆపేయాల్సి వచ్చింది.

శరీరంలో గ్యాస్ పెరగడానికి కారణాలు

చిన్న పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండడం, డయాబెటిస్, సెలియాక్, లివర్ సంబంధిత సమస్యలు. మనం తిన్న కార్బోహైడ్రేట్స్ సరిగ్గా అరగక పోవడం. జీర్ణం కాని ఆహారం మలద్వారానికి చేరడంతో సమస్య తలెత్తుతుంది. అయితే రూపాయి ఖర్చులేకుండా, రోజూ ఐదు నిమిషాల సమయాన్ని కేటాయిస్తే యోగా తో ఈ సమస్యనుంచి బయటపడొచ్చు. మరి ఎలాంటి మెడిటేషన్ చేస్తే గ్యాస్ ట్రిక్, గ్యాస్ సమస్యల నుంచి ఎలా భయటపడాలో తెలుసుకుందాం.

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్నవారిలో గ్యాస్ ట్రబుల్ అనేది సాధారణం. కడుపులో గ్యాస్ ట్రబుల్ ఎక్కువైనప్పుడు  అది హైపరాసిడిటీకి కారణమవుతుంది. కొన్నిసార్లు గ్యాస్ జీర్ణవ్యవస్థ నుంచి కిడ్నీల్లోకి చేరుతుంది.

అలా కిడ్నీల్లోకి చేరిన గ్యాస్ రాళ్లను తయారు చేయడమే కాదు బ్యాక్ పెయిన్ వచ్చేలా చేస్తుంది. అయితే కొన్ని యోగాసనాలు చేయడం ద్వారా మనం గ్యాస్ తో పాటు మలబద్ధకం సమస్యల్ని దూరం చేసుకోవచ్చు.

యోగా డైజెషన్ కు ఉపయోగపడే హైడ్రో క్లోరిక్ ను ఉత్పత్తి చేస్తుంది. హైడ్రోక్లోరిక్ తిన్న ఆహారాన్ని భాగాలుగా విభజించి జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆహారంతో పాటు లోపలికి వెళ్లే సూక్ష్మక్రిముల్ని చంపుతుంది. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ను నయం చేయడానికి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..?

గమనిక : యోగాసనాల కోసం ప్రయత్నించే వారందరికీ మా మనవి. యోగా ఆసనాలు చేయాలనిపిస్తే నిపుణుల సలహా తప్పని సరిగా తీసుకోవాలి. 

1.కపాలభాతి ప్రాణాయామం

కపాలభాతి అంటే ఏమిటీ..?

సంస్కృతంలో కపాల అంటే పుర్రె, భాతి అంటే అందంగా, ఆకర్షణీయంగా ఉండడాన్ని కపాలభాతి అంటారు. యోగాసనం ముఖ్య ఉద్దేశం శరీరంలో లోపలి అవయవాలను గాలిద్వారా శుద్ధి చేసి ముక్కుద్వారా బయటకు పంపడం.

ఈ వ్యాయామం ఎలా చేయాలి

ఈ ఆసనం, ఊబకాయం, కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్, డైజెషన్ సమస్యలతో పాటు అనేక రకాల సమస్యల్ని మటుమాయం చేసేందుకు ఉపయోగపడుతుంది.

 1. నేలపై కూర్చొని మీ కాళ్లను ముడుచుకోవాలి. కళ్ళు మూసుకుని మీ వెన్నపూసను నిటారుగా ఉంచాలి.
 2. మీ ఎడమ అరచేతిని ఎడమ మోకాలిపై, కుడి అరచేతిని కుడి మోకాలిపై ఉంచాలి.
 3. పొట్టతో నెమ్మదిగా ఊపిరి తీసుకొని ముక్కుతో నెమ్మదిగా వదలాలి
 4. ప్రారంభ దశలో గాలిని బలవంతంగా పీల్చకూడదు. నార్మల్ గా పీల్చాలి. ప్రారంభంలో గాలి పీల్చడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ అలవాటు అయ్యే కొద్ది మనకు గాలి పీల్చడం సులభంగా ఉంటుంది.
 5. ప్రారంభంలో ఓ వారం రోజులు పొట్టతో గాలిని పీల్చడంపై ప్రాక్టీస్ చేయాలి. అ తరువాత నుంచి మొదటి రెండు వారాలు 5 నిమిషాలు, మూడో వారం నుంచి 10 నిమిషాల పాటు కపాలభాతిని చేయాలి.
 6. కపాలభాతి వ్యాయామాన్ని ప్రతిరోజు ఉదయం 5నుంచి 6గంటల లోపు ఖాళీ కడుపుతో చేయాలి.
 7. గాలిని వేగంగా పీల్చకూడదు. నెమ్మదిగా పీల్చాలి.

కపాలభాతి చేయడం వల్ల కలిగే లాభాలు

 1. ఇది శ్వాసకోశ వ్యవస్థ యొక్క పనితీరును మెరుగు పరుస్తుంది. లంగ్స్ పనితీరు బాగుండేలా చేస్తుంది. లంగ్స్ లో అనారోగ్య సమస్యలుంటే నయం చేస్తుంది.
 2. అంగ స్తంభన సమస్యలను నుంచి గట్టెక్కిస్తుంది. పిల్లల కోసం ప్రయత్నించే దంపతుల్లో అంగ స్తంభన సమస్య ఉంటే పిల్లలు పుట్టడం సమస్యగా మారుతుంది. పిల్లల కోసం ప్రయత్నించే దంపతులు కపాలభాతి ఆసనం చేయడం ద్వారా అంగ స్తంభన సమస్యల నుంచి బయటపడొచ్చు. పిల్లలు పుట్టేందుకు సాయపడుతుంది.
 3. మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వాలంటే జీర్ణాశయంలో క్లోమం ( ఇంగ్లీష్ లో ప్యాంక్రియాస్ లేదా పాన్ క్రియాస్) అనే గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి డక్టల్ కణాలు, ఎసినార్ అనే రెండు రకాలైన రసాల్ని విడుదల చేస్తుంది. డక్టల్ కణాలు బై కార్బనేట్ పదార్ధాల్ని జీర్ణం చేసి ఆమ్లతత్వాన్ని అదుపు చేసేందుకు ఎసినార్ కణాలు క్లోమరసంలోని ఎంజైముల పనితీరు బాగుండేలా చేస్తుంది. క్లోమ గ్రంథి పనితీరు బాగుండాలంటే కపాలభాతి ఉపయోగపడుతుంది.
 4. లోపలి శరీర అవయవాల్ని శుభ్రం చేస్తుంది. వ్యర్ధాల్ని బయటకు పంపిస్తుంది.
 5. ఒత్తిడి నుంచి దూరం చేసి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.
 6. హెవీ వెయిట్ తో బాధపడేవారు కపాలభాతి ద్వారా బరువు తగ్గొచ్చు.

2. భస్త్రికా ప్రాణాయామం లేదా ప్రాణాయామం

ప్రాణాయామం అంటే ఏమిటీ

ముక్కుద్వారా గాలిని పీల్చి శరీరాన్ని గాలి ద్వారా కంట్రోల్ చేయడాన్ని ప్రాణాయామం అంటారు. గాలిని పీలిస్తే శరీరం కంట్రోల్ అవుతుందా అనే డౌట్ రావచ్చు. యోగాలో పూరకం, కుంభకం, రేచకం అనే మూడు స్థితుల ఆధారంగా గాలిని పీల్చడం ద్వారా శరీరం కంట్రోల్ అవుతుంది. పూరకం అంటే మెల్లగా శ్వాసను తీసుకోవడం, కుంభకం అంటే పీల్చిన గాలిని నిలిపి ఉంచడం, పూరకం అంటే నిలిపిన గాలిని మెల్లగా వదలడం.

ప్రాణాయామాన్ని ఎలా చేయాలి

 1. యోగా ను చాప మీద లేదా నేలమీద కూర్చొని చేయాలి
 2. ముక్కు ఎడమ వైపు నుంచి గాలిని పీల్చి మూడు సెకన్ల పాటు లోపల ఉంచి ముక్కు కుడి వైపున వదలాలి.
 3. ఈ వ్యాయామాన్ని ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి 6గంటల లోపు చేయాలి
 4. ప్రతి రోజు 5 నిమిషాలు తప్పని సరిగా చేయడం వల్ల 10రోజుల్లో మీ శరీరంలో అనేక మార్పుల్ని గమనిస్తారు

  ప్రాణాయామం వల్ల లాభాలు

 1. శరీరంలో రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది
 2. గుండె సంబంధిత సమస్యల్ని నివారిస్తుంది.
 3. ఆందోళన నుంచి కాపాడుతుంది. మనసు ప్రశాంతంగా ఉండేలా సాయం చేస్తుంది.
 4. కిడ్నీలు, లంగ్స్ ల పనితీరు బాగుండేలా చేస్తుంది
 5. తిన్న ఆహారం డైజెషన్ అయ్యేలా చేస్తుంది
 6. అపానవాయువు(పిత్తు) రాకుండా కాపాడుతుంది
 7. ఊబకాయం, అర్ధరైటిస్, తలనొప్పి, ఉబ్బసం, మైగ్రేన్, నిరాశ, నాడీ సమస్యలు మరియు గ్యాస్ ట్రిక్ సమస్యలను కూడా నయం చేస్తుంది.      3.  వజ్రాసనం

ఇది చాలా సులభమైన ఆసనం. ఈ ఆసనం అన్నం తిన్న వెంటనే చేయాలి. వజ్రాసనాన్ని డైమండ్ ఫోజ్ అని పిలుస్తారు.

వజ్రాసనం ఎలా చేయాలి

 1. మీ మోకాళ్లను వంచి, మీ పిరుదులపై కూర్చోవాలి
 2. కళ్ళు మూసుకుని, మీ వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోండి.
 3. మీ ఎడమ అర చేతిని ఎడమ మోకాలిపై, కుడి అరచేతిని కుడి మోకాలిపై ఉంచండి.
 4. నెమ్మదిగా ఊపిరి పీల్చి వదలండి

వజ్రాసనం వల్ల లాభాలు

 1. వజ్రాసనం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
 2. మలబద్దకం, గ్యాస్ ట్రబుల్ ను అరికట్టి తిన్న అన్నం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది
 3. గ్యాస్ సమస్యలు ఉన్నవారు ఉదయం భోజనం, రాత్రి భోజనం తర్వాత ఈ వ్యాయామం చేసుకోవచ్చు.
 4. కడుపులో, మూత్ర సమస్యల్ని నయం చేస్తుంది.
 5. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
 6. ఊబకాయం తగ్గిస్తుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది మంచి పెయిన్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు.

4. పవన ముక్తాసన

ఈ ఆసనం జీర్ణవ్యవస్థ నుండి వ్యర్థ పదార్థాల్ని, మలినాల్ని బయటకు పంపి లోపలి పేగుల కదలికలు బాగుండేలా చేస్తుంది.

 1. నేలపై పడుకోవాలి
 2. మోకాళ్లను గుండె వరకు మడవాలి
 3. మడిచిన కాళ్ల మధ్యలో తల భాగాన్ని అమర్చాలి
 4. నుదిటిని లేదా, కళ్లను రెండు మోకాళ్ల మధ్య ఆనిచ్చాలి. ఇలా ప్రతిరోజు ఐదు నిమిషాల పాటు చేయాలి

పవన ముక్తాసన లాభాలు

 1. ఈ ఆసనం వల్ల గ్యాస్ ట్రబుల్ ను అరికడుతుంది.
 2. డైజెషన్ ప్రాబ్లమ్ ను నయం చేస్తుంది
 3. పొట్టలోని పేగులు కదలికలు బాగుపడేందుకు ఉపకరిస్తుంది.
 4. పొట్టలోని పేగులు కదిలి ఫ్యాట్ అంతా కరిగిపోయి బరువు తగ్గేందుకు ఉపయోగ పడుతుంది.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest