Yoga for Thighs And Hips | తొడలు & హిప్స్ ను తగ్గించే ఈజీ యోగా టిప్స్

ఎక్కువ గంటలు కూర్చొని పనిచేయడం, జంక్ ఫుడ్ తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల తుంటి(హిప్), తొడల భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో నడిచేందుకు, కూర్చొనేందుకు ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం తుంటి, తొడల భాగంలో పేరుకుపోయిన కొవ్వును కొన్ని యోగాసనాల ద్వారా కరిగించవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గమనిక : అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆసనాలు వేయకూడదు. డాక్టర్లు, నిపుణుల సలహాలతో ఆసనాలు వేయవచ్చు.   

1.ఉత్కటాసనం – అందరికి తెలిసిన ఆసనం కూర్చీ ఫోజు

ఉత్కటాసనం అంటే మనం కుర్చీలో ఎలా కూర్చొంటామో…కుర్చీ లేకుండా అలా గాల్లో కూర్చోవడాన్ని ఉత్కటాసనం అంటారు. ఈ ఆసనం వేయడం వల్ల కండరాల పనితీరు బాగుంటుంది. ఆసనం వేసినప్పుడు బరువంతా మోకాళ్లు, తొడల కండరాలు, తుంటిపై పడుతుంది. దీంతో మీ కండరాలు పెరగడమే కాదు.. బలంగా చేస్తుంది.

ఆసనం ఎలా వేయాలి

పైన చెప్పినట్లు కుర్చీలో ఎలా కూర్చొంటామో. గాలిలో అలా కూర్చోవాలి.  మోకాళ్లను, పిరుదుల్ని మెల్లగా వంచాలి. ఈ ఆసనం బరువంతా మోకాళ్లపై పడుతుంది. అందుకే మోకాళ్లను పూర్తిగా కిందకి వంచకూడదు. నామమాత్రంగా వంచాలి. మీ రెండో చేతుల్ని పైకి లేపి అలా కొన్ని సెకన్లపాటు ఈ భంగిమ వేయాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు : భంగిమలో మోకాళ్లపై ఒత్తిడి పడకూడదు. ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడాలి.

2.వీరభద్రాసనా – వారియర్ ఫోజ్

ప్రయోజనాలు – ఈ ఆసనం తొడల భాగంలో పేరుకుపోయిన కొవ్వును మాత్రమే కరిగిస్తుంది. కాలి కండరాలు పనితీరు బాగుంటాయి.

ఆసనం ఎలా వేయాలి

మీ కుడి మోకాలిని వంచాలి. ఎడమ కాలిని వెనక్కి నెట్టాలి. కుడి చేతిని ముందుకు, ఎడమ చేతిని వెనక్కి జరపాలి. ఇలా ఆసనాన్ని మారుస్తూ ఉండాలి. ఆసనం చేసే సమయంలో గాలిని నెమ్మదిగా పీల్చాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ఆసనం వేసే సమయంలో మీ రెండు కాళ్లు సరైన భంగిమల్లో ఉండేలా చూసుకోండి.

3.నటరాజ ఆసన (లార్డ్ ఆఫ్ డ్యాన్స్ ఫోజ్ )

ప్రయోజనాలు –  తుంటి, తొడ కండరాలు ఫ్రీ అవుతాయి. కండరాలు ఫ్రీ అవ్వడం వల్ల పనితీరు బాగుంటుంది. కాళ్ల లోపలి భాగంలో ఉన్న ఎముకలు పటిష్టం గా ఉండేలా చేస్తుంది. కండరాలు ఫ్రీ అవ్వడం వల్ల తుంటి, తొడల భాగంలోని ఎనర్జీ బ్లాక్స్ విడుదలై రక్త ప్రసరణ జరుగుతుంది. ఆక్సిజన్ , పోషకాల్ని అందిస్తుంది. ఫ్యాట్ ను కరిగిస్తుంది.

ఆసనం ఎలా చేయాలి – తడసన లో నిలబడండి. మీ కుడి కాలిని  పైకి ఎత్తండి మరియు మీ కుడి కాలు భూమికి సమాంతరంగా ఉంచండి.  మీ మోకాలిని వంచి, మీ కుడి చేతిని కుడి పాదం / పెద్ద బొటనవేలు చేరే వరకు సాగదీయండి. మీ కుడి పాదం అనుకున్న భంగిమ లో పెట్టిన తరువాత , మీ ఎడమ చేయిని ముందుకు సాగండి. అలా కొద్ది సేపు ఈ భంగిమను వేయండి.

4. ఉష్ట్రాసనం – లేదా ఒంటె ఫోజ్

ప్రయోజనాలు –  ఈ ఆసనం తుంటి, తొడల కండరాలతో పాటు శరీరంలో అన్నీ అవయవాల కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది.

ఎలా చేయాలి –  మోకాళ్ల పై కూర్చొని మీ ఎడమ చేయిని, కుడి చేయిని వెనక్కి మడిచి మీ చేతి వేళ్లను మీ కాలి చీలిమండలాన్ని తాకాలి. మీరు వెనుక వైపు చూస్తున్నప్పుడు మీ తలను జాగ్రత్తగా ఉంచాలి.

5.బుద్ధకోనాసన (లేదా సీతకోక చిలుక ఫోజు)

ప్రయోజనాలు : ఇది తుంటిలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే అద్భుతమైన ఆసనం. తుంటి కదలికల్ని ఫ్రీ చేస్తుంది. లోపలి తొడల భాగం వెడల్పు చేస్తుంది. దీంతో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఈ ఆసనం అద్భుతమైన హిప్ ఓపెనర్. ఇది మీ తుంటిలో కదలిక పరిధిని కూడా పెంచుతుంది. మీ లోపలి తొడలు విస్తరించి, బిగువుగా ఉంటాయి మరియు సన్నని ద్రవ్యరాశి నిర్మించబడుతుంది. ఈ ఆసనం ప్రాథమికంగా మీ పండ్లు మరియు తొడలపై పనిచేస్తుంది మరియు వారికి అద్భుతాలు చేస్తుంది.

దీన్ని ఎలా చేయాలి – మీ కాళ్లను చాచి చాప మీద కూర్చోండి. మీ మోకాళ్ళను మడిచి, మీ పాదాలను మధ్యలో తీసుకురండి. మీ పాదాలలో చేర్చి మరియు మీ వీపును నిటారుగా ఉంచండి. మీ అరచేతులతో మీ పాదాలను పట్టుకోండి. ఇప్పుడు, మీ మోకాళ్ళను నేలమీదకు నెట్టండి, మీకు వీలైనంత వరకు. కొన్ని నిమిషాలు భంగిమను పట్టుకుని వదిలేయండి.

for more news

Weight Gain Tips In Telugu | సింపుల్ గా బరువు పెరగాలంటే

Five Herbal Tea: టీ తాగండి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోండి

Morning Drinks For Weight Loss : మీ బరువును తగ్గించే మార్నింగ్ డ్రింక్స్

Add a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest